Brahmamudi November 18th: అర్ధరాత్రి ప్రియుడితో స్వప్న... రాజ్‌కు డౌట్

ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో (నవంబర్ 18వ తేదీ) రాజ్ గదిలోకి రాగానే కావ్య బుక్ చదువుతూ ఉంటుంది. రొమాంటిక్ పదాలతో రాజ్ ను రెచ్చగొట్టేలా చదువుతూ ఉంటుంది. రాజ్ కు కోపం వచ్చి ఆ బుక్ తీసుకుందామని లాగితే.. కావ్య వచ్చి రాజ్ ఒడిలో పడిపోతుంది. అయినా కూడా బుక్ చదువుతూ ఉంటుంది. ఇక కోపం వచ్చి రాజ్ ఆ బుక్ ను గాల్లోకి విసిరేస్తాడు. అది మళ్లీ రాజ్ తలమీద పడుతుంది. ఏమైందే నీకు అంటాడు రాజ్.. వయసు అయిందని చెప్తుంది కావ్య. నీకు నాకు మధ్య ఎప్పటికీ ఏ సంబంధం ఉండదు అని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. ఎలా ఉండదో నేను చెప్తా అని కావ్య అనుకుంటుంది.

మరోవైపు అరుణ్ కాల్ చేస్తా అన్నాడు ఇంకా చేయట్లేదు అని స్వప్న టెన్షన్ పడుతుంది. ఇక అరుణ్ దుగ్గిరాల ఇంటికి వస్తాడు. రాహుల్ కి కాల్ చేసి మాట్లాడుతాడు. స్వప్నకు కాల్ చేసి.. ఇంటి బయటకు రమ్మని చెప్పు అని రాహుల్ చెప్తాడు. ఇక స్వప్నకు కాల్ చేసి... బయటకు రమ్మని చెప్తాడు. స్వప్న రాను అని చెప్తుంది. లేదంటే నేనే లోపలికి వస్తా అని అరుణ్ బెదిరిస్తాడు. ఇక స్వప్న నేను వస్తాను అని చెప్తుంది. మరోవైపు రాజ్ బయటకు వచ్చేలా చేయ్ అని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది.

Kanakam Consoles Appu in November 18th 2023 Episode number 257 in Brahmamudi Telugu Serial

అరుణ్ లోపలికి వస్తుంటే స్వప్న బయటకు తీసుకువెళ్లి లాగిపెట్టి కొడుతుంది. ఇక ఇది నిజంగా ఫైర్ బ్రాండ్... డబ్బు లేకపోయినా క్యారెక్టర్ ఉంది.. మనకు క్యారెక్టర్ లేకపోయినా డబ్బు ముఖ్యం.. అని రాహుల్ అనుకుంటాడు. ఇప్పుడు రాజ్ ను పిలిస్తే బెటర్ అని రాజ్ కు కాల్ చేస్తాడు రాహుల్. ఇంట్లో ఉండే కాల్ చేసావ్ ఏమైంది అని రాజ్ అంటాడు. నీతో ఓ విషయం మాట్లాడాలి బాల్కనీరా అని చెప్తాడు రాహుల్. ఓకే అని రాజ్ బయలుదేరుతాడు.

ఇక మరోవైపు స్వప్నకు అరుణ్ ఐ లవ్ యూ అని చెప్తాడు. ఇంతలో రాహుల్ దగ్గరకు రాజ్ వస్తాడు. నీకో విషయం చెప్పాలి అనుకున్నా.. కానీ ఇప్పుడు చెప్పలేను అంటూ రాహుల్ లోపలికి వెళ్లిపోతాడు. ఇక ఇంతలో కావ్య కూడా బయటకు వస్తుంది. స్వప్న, అరుణ్ లను చూస్తుంది. బాల్కనీ నుంచి రాజ్ వాళ్లను చూస్తాడు. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటాడు. విషయం తెలుసుకోకుండా తప్పుగా అనుకొవద్దు అని అనుకుంటాడు రాజ్.

Kanakam Consoles Appu in November 18th 2023 Episode number 257 in Brahmamudi Telugu Serial

అరుణ్.. ప్రపోజల్ పెట్టి.. నాతో వచ్చేయ్ అని అడుగుతాడు. నాకు పెళ్లైంది.. ఏం మాట్లాడుతున్నావ్ అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది. ఇక అరుణ్ వెళ్లిపోతాడు.. మరోవైపు కావ్య.. స్వప్నను తీసుకువచ్చి ఎందుకు అరుణ్ వచ్చాడు అని అడుగుతుంది. నాకు తెలియదే.. నన్ను పెళ్లి చేసుకుంటాను అని వచ్చాడు అని స్వప్న.. కావ్యకు చెప్తుంది. కావ్య నమ్మదు... కానీ స్వప్న అలాంటి చీప్ ఫేలోతో నేనుందుకు మాట్లాడుతా చెప్పు అని చేప్తుంది.

మరోవైపు కనకం నిద్ర పోకుండా కూర్చొవడం చూసి మూర్తి అడుగుతాడు. నేనంటే ఆర్డర్ పనిమీద కూర్చున్న నిన్ను పడుకోమని చెప్పా కదా అంటాడు మూర్తి. మీతో ఒక విషయం అడగాలి అని కనకం అంటుంది. ఇప్పుడా అని మూర్తి అంటాడు. మీతో చెప్పకూడదు అనుకున్నాను... మీతో చెప్పాలనుకుంటున్నా అని కనకం చెప్పబోతుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో ఇందిరాదేవి రాజ్ దగ్గరకు వచ్చి అరుణ్ మ్యాటర్ చెప్తుంది. అరుణ్, స్వప్న కలిసి ఉన్న ఫోటోల గురించి చెప్తుంది. ఎవరో తెలుసుకోమని అంటుంది. ఇక కావ్య దగ్గరకు వచ్చి రాజ్ అసలు విషయం తెలుసుకుంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X