Brahmamudi August 19th: కావ్యను గెంటేసిన రాజ్... కనకం చేసిన పనికి షాక్‌లో దుగ్గిరాల కుటుంబం

ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో దుగ్గిరాల వారసుడి ఉగ్రరూపం కనిపిస్తోంది. రాజ్ మట్టి తొక్కడాన్ని సహించలేకపోతుంది అపర్ణ. కావ్య ఇంటికి రాగానే నిలదీస్తుంది. కావ్య కూడా ఎదురు సమాధానం చెబుతుంది. అప్పుడే రాజ్ వస్తాడు. మా అమ్మను అంటావా అంటూ ఇంట్లో నుంచి గెంటేస్తాడు. కావ్య వర్షంలో తడుస్తూ నిల్చొని ఉంటుంది. అయినా రాజ్ మనసు కరగదు. ఇక ఈరోజు పూర్తి ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే....

బ్రహ్మముడి ఎపిసోడ్ ప్రారంభంలో రాజ్, కావ్య కలిసి మట్టి తొక్కుతున్న వీడియోను అపర్ణకు చూపిస్తుంది రుద్రాణి. నిన్ను మూలకు కూర్చొబెట్టి.. నిీ స్థానాన్ని ఆక్రమించుకుంటుంది కావ్య అని హెచ్చరిస్తుంది. ఇంట్లో అందరూ తన మాట వినాలని శాసిస్తుందని లేనిపోనివి చెబుతుంది. అప్పుడే రాజ్ కు ఫోన్ చేస్తుంది అపర్ణ. వెంటనే ఇంటికి రమ్మని అడుగుతుంది. ఇంతలో కావ్య వస్తుంది. కావ్యను ఆపుతుంది అపర్ణ. ఈరోజు నేను ఏం నేరం చేశానని అడుగుతుంది కావ్య. నా కొడుకు ఎవరు అనుకుంటున్నావ్ అని ప్రశ్ని్స్తుంది అపర్ణ.

Raj Fires On Kavya About His Mother in August 19th 2023 Episode number 179 in Brahmamudi Telugu Serial

నువ్వు వాడితో మట్టి తొక్కిస్తావా అంటూ రచ్చ చేస్తుంది. అప్పుడు కావ్యకు ఇదంతా చేపిస్తుంది రుద్రాణి, రాహుల్ అని తెలుసుకుంటుంది. రుద్రాణిగారు మీకు వినోదం కావాలి కదా.. పూటకో కారణం సృష్టించి.. మా అత్తయ్యగారిని నిలబెట్టి.. ఏం తెలియనట్టు ఉంటారని చెబుతుంది కావ్య. నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చిన రాజ్ తో మట్టి తొక్కించడం ఏంటని అపర్ణ అడుగుతుంది. ఇక రుద్రాణి కూడా వేటకారం చేస్తూ... కావ్యను తిడుతుంది. కావ్య ఫైర్ అవుతుంది. చేయి చూపిస్తుంది. నాకు నా భర్త అంటే గౌరవం ఉందని చెబుతుంది.

నా కొడుకును మట్టి మనిషిలా చేసి.. కూలీ వాడిలా చేస్తే.. మాత్రం ఊరుకునేది లేదని చెబుతుంది అపర్ణ. అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి అత్తయ్య.. నేను డిజైన్స్ వేసి ఆ డబ్బులు మా ఇంటికి తీసుకెళ్లి ఇస్తే నచ్చదు, పోని మా ఆయన వెనకేసు వచ్చి.. ఇలాంటి వారి ముందు.. సమర్థిస్తే.. తట్టుకోలేరు.. ఎక్కడ భార్యగా ఒప్పేసుకుంటారోనని భయం.. ఎక్కడ మేమిద్దరం ఒక్కటైపోతామోనని భయం.. నేను మీకు కోడలిగా పనికిరానని, అందుకని మీ కొడుకు నన్ను భార్యగా చూడకూడదా అని ప్రశ్నిస్తుంది కావ్య. అసలు మీ కొడుకుకు మీరు కన్నతల్లేనా అని ప్రశ్నిస్తుంది కావ్య. దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అప్పుడే రాజ్ వస్తాడు. ఏమన్నావ్ అని కావ్యపైకి చేయి లేపుతాడు.

Raj Fires On Kavya About His Mother in August 19th 2023 Episode number 179 in Brahmamudi Telugu Serial

మా తాత్యయ నేర్పిన సంస్కారం గుర్తింది కాబట్టి ఏం చేయలేదని రాజ్ అంటాడు. నేను ఈ ఇంట్లో ఉండటం మీ అమ్మగారికి ఇష్టం లేదు.. అని కావ్య అరవగా.. అవునా.. నువ్ ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు అని బదులిస్తాడు రాజ్. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంకా నిలబడ్డావ్ ఏంటని, కావ్య చేయి పట్టుకుంటాడు. ఇందిరాదేవి వద్దని అనగా.. ఇలాంటి వాళ్లకు ఇలాగే చేయాలని అంటాడు. కావ్యను లాకెళ్లి బయట వేస్తాడు రాజ్. ఇవాళ్టితో మా ఇంటితో నీకు రుమం తీరిపోయిందని అంటాడు. రాజ్ గదిలోకి వెళ్లిపోతాడు. రుద్రాణి సంతోషపడిపోతుంది.

Raj Fires On Kavya About His Mother in August 19th 2023 Episode number 179 in Brahmamudi Telugu Serial

కావ్య బయటే నిల్చొని ఉంటుంది. రాజ్ గదిలో వస్తాడు కల్యాణ్. కావ్యను ఇంట్లోకి పిలవమని నచ్చచెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ రాజ్ వినడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్లో కనకం, మూర్తి వస్తారు. కావ్య వానలో తడుస్తూ ఉంటుంది. నీకు ఇంత శిక్ష వేస్తారా అని కనకం అంటుంది. వెళ్లి దుగ్గిరాల వారి ఇంటి తలుపులు కోపంగా తీస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X