Bigg Boss Telugu 6: కంటెస్టెంట్లకు బిగ్ షాక్.. విన్నర్ అయినా బోడిగుండే.. తెలివిగా సేఫ్ అయిన మోడల్

తెలుగు టెలివిజన్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అసలే మాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ కార్యక్రమం.. తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను సొంతం చేసుకుంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్ల మీద సీజన్లను కంప్లీట్ చేసుకుంటోంది. ఇలా ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్.. ప్రైజ్ మనీని తగ్గించేసి కంటెస్టెంట్లు అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. కానీ, ఇందులో ఒకరు సేఫ్ అయ్యారు. ఆ వివరాలు మీకోసం!

రేటింగ్ లేకపోవడంతో ట్విస్టులు

రేటింగ్ లేకపోవడంతో ట్విస్టులు

తెలుగులో వచ్చే బిగ్ బాస్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ సాగుతోన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆరో సీజన్ కూడా ఎన్నో ఘనతలను అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఈ సీజన్‌కు ప్రేక్షకుల స్పందన అంతగా రావడం లేదు. దీంతో రేటింగ్ సరిగా దక్కట్లేదు. ఫలితంగా నిర్వహకులు ఎన్నో ట్విస్టులు ఇస్తూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

11వ వారంలో అంతా నామినేట్

11వ వారంలో అంతా నామినేట్

బిగ్ బాస్ షోలోనే అత్యంత ముఖ్యమైన టాస్కుల్లో నామినేషన్స్ ఒకటి. దీని ద్వారా హౌస్‌లో ఎవరు ఉండాలి? ఎవరు వెళ్లాలి? అన్నది డిసైడ్ అవుతుంది. ఇక, ఆరో సీజన్‌లో పదకొండో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కులో కెప్టెన్ ఫైమా తప్ప మిగిలిన ఇనాయా సుల్తానా, శ్రీహాన్ చోటు, రోహిత్, రేవంత్, కీర్తి భట్, మెరీనా, రాజశేఖర్, ఆది రెడ్డి, శ్రీ సత్యలు నామినేట్ అయ్యారు.

ఇమ్యూనిటీ టాస్క్.. ప్రైజ్ మనీ

ఇమ్యూనిటీ టాస్క్.. ప్రైజ్ మనీ

పదకొండో వారానికి సంబంధించి నామినేట్ అయిన వాళ్లకు బిగ్ బాస్ ఓ టాస్కును ఇచ్చాడు. దీని ప్రకారం.. ఆ తొమ్మిది మంది లక్ష నుంచి ఐదు లక్షల వరకూ కోట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఎవరైతే ఎక్కువ మొత్తం (మిగిలిన వాళ్లతో సమానంగా లేకుండా) చెక్‌పై రాస్తారో వాళ్లకు ఇమ్యూనిటీ లభిస్తుంది. ఆ మొత్తాన్ని మాత్రం విన్నర్ ప్రైజ్ మనీ నుంచి తగ్గిస్తామని చెప్పారు.

శ్రీ సత్యకు షాక్.. వాళ్లంతా ఔట్

శ్రీ సత్యకు షాక్.. వాళ్లంతా ఔట్

తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అందరూ తమకు ఇచ్చిన చెక్‌లపై అమౌంట్లు వేసి డ్రాప్ బాక్సులో వేశారు. ఇక, ఈ మొత్తాల గురించి వేరే వాళ్లతో మాట్లాడకూడదని చెప్పినా.. శ్రీ సత్య మాత్రం శ్రీహాన్‌కు హింట్ ఇచ్చింది. దీంతో ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. ఇక, 4,99,999 అమౌంట్ వేసిన కీర్తి, రేవంత్‌ ఔట్ అయ్యారు. అలాగే, 4,99,998 వేసిన మెరీనా, ఇనాయా కూడా వెళ్లిపోయారు.

ఇద్దరిలో టాప్.. రాజ్ సేఫ్‌గానే

ఇద్దరిలో టాప్.. రాజ్ సేఫ్‌గానే

ఇమ్యూనిటీ టాస్కులో శ్రీహాన్, ఆది రెడ్డిలు కేవలం లక్ష రూపాయలు మాత్రమే కోట్ చేశారు. దీంతో సేమ్ అమౌంట్ ఉన్న వీళ్లిద్దరూ కూడా ఔట్ అయ్యారు. ఇక, మిగిలిన వాళ్లలో రోహిత్ 2,51,001 రూపాయలు రాశాడు. రాజ్ మాత్రం ఎవరూ రాయని విధంగా ఎక్కువ అమౌంట్ 4,99,700 రూపాయలను కోట్ చేశాడు. దీంతో అతడు ఈ వారానికి గానూ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు.

ప్రైజ్ మనీలో కోత పెట్టేశారుగా

ప్రైజ్ మనీలో కోత పెట్టేశారుగా

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని 11వ వారానికి సంబంధించి జరిగిన ఇమ్యూనిటీ టాస్కులో రాజ్ కోట్ చేసిన 4,99,700 రూపాయలను విన్నర్ ప్రైజ్ మనీ నుంచి తీసేశారు. అంటే ఈ సీజన్‌లో గెలిచిన కంటెస్టెంట్‌కు 45,00,300 రూపాయలను మాత్రమే అందిస్తామని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో తామే విజేత అని ఊహించుకుంటోన్న కొందరు కంటెస్టెంట్లు తెగ ఫీలైపోయారు.

టాస్కులో ఫెయిల్.. మళ్లీ డౌన్

టాస్కులో ఫెయిల్.. మళ్లీ డౌన్

ఆరో సీజన్‌లో విన్నర్ ప్రైజ్ మనీ 45,00,300 రూపాయలకు తగ్గిపోవడంతో అది పెంచుకునేందుకు బిగ్ బాస్ కొన్ని టాస్కులను ఇస్తానని చెప్పాడు. ఇందులో భాగంగా క్రికెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో 7.30 నిమిషాల్లో వంద రన్స్ చేస్తే లక్ష యాడ్ చేస్తామని చెప్పారు. కానీ, రోహిత్, రేవంత్ 82 రన్స్ మాత్రమే చేయడంతో మరో లక్ష కట్ అయింది. దీంతో ప్రైజ్ మనీ 44,00,300 రూపాయలకు తగ్గిపోయింది. ఈ టాస్క్ నేడు కూడా కొనసాగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X