Brahmamudi September 2nd: కావ్య వర్సెస్ అపర్ణ... తల్లికే అగ్రతాంబూలం.. ఫలితం ఇస్తానంటివి ఇదేనా బాస్
స్టార్ మాలో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తోంది. అత్తా కోడళ్ల సవాళ్లు... మధ్యలో రాజ్ తంటాలు... మరోవైపు అనామిక కోసం కల్యాణ్ తిప్పలు... ప్రెగ్నెన్సీ లేదనే విషయం తెలియకుండా ఉండేందుకు స్వప్న పడే పాట్లు... ఇవన్నీ ప్రేక్షకులకు ఇంట్రెస్టును కలిగిపిస్తున్నాయి. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
ఎపిసోడ్ ప్రారంభంలో.. తన ఫోన్ లిఫ్ట్ చేయకుండా స్వీఛ్ఛాఫ్ చేసినందుకు కల్యాణ్ పై అప్పు సీరియస్ గా ఉంటుంది. ఇదేనా ఫ్రెండ్ షిప్... అని అడిగితే.. అనామిక గురించి చెప్పుకొస్తాడు. నాకు ఇప్పుడు ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అని కల్యాణ్ చెప్తాడు. దీంతో అది నేను ఒకటేనా... ఆమె నీ కవితలు చూసి ఫ్రెండ్షిప్ చేసింది.. నేను ఏం చూడకుండా చేశాను అని అప్పు చెప్తుంది. భలే చెప్పావ్ బ్రో అంటాడు కల్యాణ్. ఇక కల్యాణ్ తను నా అభిమాన ఫ్రెండ్.. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనగానే అప్పు సంతోషపడుతుంది.

మరోవైపు రాత్రి కనకంకి ఇందిరాదేవి కాల్ చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నట్లు చెబుతుంది. రాత్రి చెబుతున్నందుకు ఫీల్ అవ్వొద్దని... ఇంటికి రావాల్సిందిగా ఇందిరా దేవి మాట్లాడుతుంది. మీరు ఇంతలా చెప్పాకా రాకుండా ఎలా ఉంటామంటూ కనకం అంటుంది. మరోవైపు వంటింట్లో కావ్య పని పూర్తి చేసుకుని వస్తుంటే అపర్ణ వచ్చి.. కావ్యతో మాట్లాడుతుంది. నీతో మాట్లాడొద్దని నాకు నేను శపథం పెట్టుకుంటాను. కానీ నా కర్మ ఎప్పుడూ నీతో మాట్లాడాల్సి వస్తుంది. నిన్ను అందరూ గుర్తిస్తున్నారు. ఓ మనిషిలా చూస్తున్నారు. ఆ పెద్దలకు ఎదురుచెప్పలేని బలహీనత నాది. అలా అని నువ్ ఇంట్లో తిరుగుతుంటే చూస్తూ సహించలేను అని అపర్ణ కావ్యతో అంటుంది.
అపర్ణ మాటలకు కావ్య వెళ్లిపోతుంటే.. ఆగు.. నేను మాట్లాడటం ఇంకా పూర్తి చేయలేదు... అని చెప్తుంది అపర్ణ. మీరు మాట్లాడటం పూర్తి చేస్తే నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక్కసారి సమాధానం చెప్పినందుకే ఇంట్లో నుంచి మీ అబ్బాయి చీకట్లోకి గెంటేశారు. ఇంకా అవమానాల దిగమింగుకోలేను అని కావ్య అంటుంది. నిన్ను అర్థం చేసుకోవడం కాదు. నువ్వే అర్థం చేసుకోవడం మిగిలి ఉంది. నువ్వు ఇంతే, నీ బతుకు ఇంతే. నా కొడుకు మనసులో నీకు స్థానం దక్కదు. కోడలిగా హక్కు ఉండదు. రేపు నీకు నా కొడుకు ఆశీర్వాదం ఇవ్వడు. నన్ను బాధపెట్టే పని ఏమాత్రం చేయడు అని అపర్ణ అంటుంది.

మీరు ఛాలెంజ్ చేసినా ప్రతిసారి నాకు కలిసి వస్తుంది అత్తయ్య. మీ భర్త కాదు మీ కొడుకే మిమ్మల్ని మారుస్తాడు కావచ్చు అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. అప్పటిదాకా అదంతా విన్న రాజ్.. వ్రతం చేయి.. ఫలితం నేను ఇస్తానని అంటాడు. మరుసటి రోజు ఉదయం కావ్య ఇంటికి వెళ్లేటప్పుడు పట్టు చీర, బంగారం కొనడానికి కావాల్సిన డబ్బు తీసుకువచ్చేందుకు వెళ్లిన భర్త కృష్ణమూర్తి కోసం కనకం ఎదురుచూస్తుంటుంది. తల్లిని ఆటపట్టిస్తూ అప్పు ఉంటుంది. ఇంతలో కృష్ణమూర్తి వచ్చి డబ్బు తీసుకొస్తాడు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో వరలక్ష్మి వ్రతం పనులు అన్నింటిని కావ్య చక్కగా చేస్తుంది.
కావ్యకు అమ్మవారికి చీర కట్టడం రాదేమో. మీరు నేర్పించండి అని ఇందిరా దేవి అంటే.. అపర్ణను ఇరికిస్తుంది రుద్రాణి. నువ్వే నేర్పించొచ్చు కదా అని ఇద్దరూ అనుకుంటారు. ఇక రుద్రాణి కడితే అంతే సంగతి అని ధాన్య లక్ష్మి చురకలు వేస్తుంది. నాకు చీర కట్టడం వచ్చు అని కావ్య చాలా బాగా కడుతుంది. దీంతో ఇన్నేళ్లలో ఇంట్లో అమ్మవారికి చీర ఇంత చక్కగా ఎవరూ కట్టలేదని కావ్యను మెచ్చుకుంటుంది ఇందిరాదేవి.
అంటే అపర్ణ సరిగ్గా చేయలేదని అంటున్నావా అని రుద్రాణి అంటే.. చిన్న కోడలు మంచిది అంటే.. పెద్ద కోడలు చెడ్డది అని కాదు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. కావ్య బాగా చేసిందని అని చెప్పాను తప్పా మీరు చేయలేదని కాదు అని ఇందిరాదేవి అంటుంది. కిచెన్‍లో ఉన్న కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇక తదుపరి ఎపిసోడ్ లో.... దుగ్గిరాల ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఘనంగా జరుగుతుంటుంది. వ్రతంలో కావ్య తల్లితోపాటు దుగ్గిరాల కుటుంబ సభ్యులంతా పాల్గొంటారు. మహాలక్ష్మి భక్తిపాటతో వ్రతం నిర్వహించడం అంతా చూపిస్తారు. అంతా సంతోషంగా వ్రతాన్ని అనుభూతి చెందుతుంటే రాజ్, అపర్ణ మాత్రం ఇష్టం లేనట్లుగా ఎక్స్ ప్రెషన్స్ పెడతారు. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత భర్త చేత అక్షంతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకుంటే ఆ దాంపత్యం కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది అని పంతులు చెబుతాడు. దీంతో తన భర్త రాజ్ దగ్గర ఆశీర్వాదం తీసుకునేందుకు కాళ్లు మొక్కడానికి కింది వంగుతుంది కావ్య.
ఆశీర్వాదం తీసుకోడానికి భర్త రాజ్ పాదాలు తాకేందుకు కావ్య ప్రయత్నిస్తే... రాజ్ మాత్రం దూరంగా జరుగుతాడు. దీంతో రాజ్‍ను కావ్య షాకింగ్‍గా చూస్తుంది. ఇంట్లో వారంతా షాక్ అవుతూ చూస్తుంటారు. చేతిలో ఉన్న అక్షింతలను కూడా రాజ్ కింద పడవేస్తాడు. దీంతో కావ్య మరింత షాక్ కు గురవుతుంది. మరోవైపు రాజ్ తల్లి అపర్ణ మాత్రం తనకు నచ్చిన పని కొడుకు చేస్తున్నాడని లోలోపలే తెగ సంబరపడిపోతుంది.


Click it and Unblock the Notifications











