Brahmamudi August 2nd: కావ్య పుట్టింటి కష్టాన్ని తీర్చిన రాజ్.. కల్యాణ్‌కి ప్రేమలేఖ.. ఎవరు రాశారబ్బా?
బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తిని పెంచుతూనే ఉంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో తన పుట్టింటి కష్టం గురించి తెలుసుకుని కావ్య డల్ అవుతుంది. కావ్య సమస్య తెలుసుకుని రాజ్.. తనకు డబ్బులు ఇస్తాడు. మరోవైపు కల్యాణ్ కు అభిమాని లెటర్ పంపుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
కావ్య తన ఇంట్లో సమస్య వల్ల డల్ ఉంటుంది. ఇక రాజ్ ఏమైందని అడిగినా కూడా చెప్పకుండా మౌనంగా వెళ్లి పోతుంది. కల్యాణ్ మాట్లాడిన దగ్గర నుంచి కళావతి టెన్షన్ గా ఉంది ఏమైందోనని రాజ్ తన దగ్గర వెళతాడు. ఏం జరిగింది కళావతి ఎందుకు టెన్షన్ పడుతుంది అని కల్యాణ్ ను అడుగుతాడు. వదిన వాళ్ళ అమ్మ ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అర్జెంట్ గా రూ.50 వేలు కట్టాలంట. నేను ఇస్తానంటే వదిన వద్దని అంటుందని కల్యాణ్ చెప్తాడు. నువ్వే ఎలాగైన వదినకు సాయం చేయాలి అని అంటాడు.

ఇక కుటుంబ పరిస్థితి గురించి ఆలోచిస్తూ కావ్య డిజైన్స్ సరిగా వేయలేకపోతుంది. నిద్రలో మెలుకువ వచ్చిన రాజ్ అది గమనిస్తాడు. డిజైన్స్ రాక పేపర్స్ అన్నీ పారేస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి డిజైన్స్ కావాలంటే ఇంత బాగా వేస్తావ్ అనుకోలేదని వెటకారం చేస్తాడు రాజ్. డిజైన్స్ ఐడియా రాకపోతే సైలెంట్ గా కూర్చోవాలి. నీ మైండ్ ఎంత గజిబిజిగా ఉందో ఈ పేపర్స్ చూస్తే తెలుస్తుంది. నీ కష్టం ఏంటో చెప్పు వీలైతే తీరుస్తాను అంటాడు. కానీ కావ్య చెప్పకుండా పడుకుంటుంది.

ఇక కావ్య పరాధాన్యంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి టీ గమనించుకోకుండా ఒకరికి ఇవ్వాల్సినవి మరొకరికీ ఇస్తుంది. ఏమైంది నువ్వు ఇక్కడ ఉంటే మైండ్ ఇంకెక్కడో ఉందని ఇంద్రాదేవి అడుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనులు చేస్తే తప్పులు జరగవని అపర్ణ నోరు పారేసుకుంటుంది. అదంతా రాజ్ గమనిస్తూనే ఉంటాడు. కృష్ణమూర్తి అప్పు కట్టలేకపోతున్నందుకు బాధపడతాడు. రెండు నెలల్లోపు పది లక్షలు కట్టడానికి తానేమీ బంగారం వ్యాపారం చేయడం లేదని బాధపడతాడు.

రాజ్ ఆఫీసు కి రెడీ అవుతుంటే కావ్య డిజైన్స్ తీసుకొచ్చి ఇస్తుంది. బాగున్నాయ్ అని అంటాడు. వాళ్ళకి ఎక్స్ ప్లేన్ చేయడానికి ఆఫీసుకు వస్తున్నావా అంటే రాలేనని పనుందని చెప్తుంది. కావ్య బాధ తెలుసుకున్న రాజ్ యాభై వేలు ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నారని అడుగుతుంది. డబ్బులు ఎక్కువ అయ్యి ఇస్తున్నానని కాసేపు పోట్లాడుకుంటారు. చివరకు రాజ్ ఇచ్చిన డబ్బులను తీసుకుంటుంది కావ్య.

నాకు తెలుసు ఈ విధంగా అయినా నీ పుట్టింటి వాళ్ళకి సాయం చేస్తున్నందుకు నువ్వు సంతోషంగా ఉంటావని మనసులో అనుకుంటాడు రాజ్. సమయానికి డబ్బు చేతికి అందేసరికి కావ్య భర్త వైపు ప్రేమగా చూసి థాంక్స్ చెప్పుకుంటుంది. కాసేపటికి ఇంటికి కొరియర్ వస్తుంది. దానితో పాటు పూల కుండీ కూడా కొరియర్ బాయ్ ఇస్తాడు. అది కళ్యాణ్ కి వచ్చిందని కావ్య చెప్తుంది. తన కొడుకు సెలెబ్రెటీ అయిపోయాడని ధాన్యలక్ష్మి పొంగిపోతుంది. అభిమాని రాసిన లెటర్ చదివి అందరికీ వినిపిస్తానని కావ్య అంటుంది. కళ్యాణ్ మాత్రం వద్దని బతిమలాడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తోంది. రేపటి ఎపిసోడ్ లో స్వప్న ఏవో ట్యాబ్లెట్స్ అర్డర్ చేసి తెప్పించుకుంటుంది. అది చూసిన రుద్రాణి ప్రెగ్నెన్సీ లేదని కనిపెడుతుంది.


Click it and Unblock the Notifications











