Brahmamudi October 25th: స్వప్న ప్రెగ్నెన్సీ నాటకం... అందరి ముందు బయటపెట్టిన కావ్య?

రాజ్ ఆత్మరామం బయటకు వచ్చి కావ్య గురించి మాట్లాడుతాడు. కావ్యను నువ్వు విపరీతంగా ప్రేమిస్తున్నావ్ అంటూ రాజ్ తో ఆత్మ చెప్తాడు. ఇక మన అమ్మను అడగకుండా.. అమ్మకు కోపం వస్తుందని తెలిసి కూడా కావ్య కోసం పనిమనిషిని పెట్టావంటే.. ప్రేమతోనే చేశావ్ అని చెప్తాడు. ఇక నువ్వు కావ్యను ప్రేమిస్తున్నావ్ అంటే... లేదు లేదు... ప్రేమించడం లేదు అంటూ రాజ్ అరుస్తాడు. అప్పుడే కావ్య వచ్చి.. ఏమైందని అడుగుతుంది. ఏం లేదు అని అడుగుతుంది కావ్య.. గాలి లేదు అంటాడు రాజ్. ఫ్యాన్ వేసుకోవచ్చు కదా అని కావ్య అనగా.. వేయొచ్చు కదా అంటాడు రాజ్.

ఇక కావ్య.. రాజ్ తో రొమాంటిక్‌ గా మాట్లాడుతుంది. వ‌య‌సుతో పాటు మ‌న‌సు ఆగ‌డం లేద‌నిపిస్తోంద‌ని అంటూ రాజ్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. రాజ్ భ‌య‌ప‌డిపోయి ఆమెకు దూరంగా వెళ్లిపోతాడు. పెళ్లాం మీద చేయి వేయ‌డానికి కూడా మీకు సోమ‌రిత‌నం అంటూ రాజ్‌ కు క్లాస్ ఇస్తుంది. తర్వాత తాతాయ్య ఓ బుక్ ఇచ్చాడు అంటూ రాజ్‌ కు ఓ బుక్ ఇస్తుంది. తాత‌య్య ఈ బుక్ ఇచ్చి, హ‌నీమూన్ వెళ్ల‌మ‌న్నాడ‌ని రాజ్‌ తో అంటుంది కావ్య‌. తాను పెట్టిన గ‌డువు ముగిసే వ‌ర‌కు హ‌నీమూన్ లేద‌ని అబ‌ద్ధం చెప్పి ఆ స‌మ‌స్య నుంచి త‌ప్పించుకుంటాడు రాజ్‌. నిద్ర‌పోవ‌డానికి సిద్ధ‌మైన కావ్య త‌న ప‌రుపుతీసుకొచ్చి కింద వేస్తుంది.

Raj is Annoyed in October 25th 2023 Episode number 236 in Brahmamudi Telugu Serial

అప్పుడే కావ్య కోసం ఇందిరాదేవి పాలు తీసుకొస్తుంది. ఆ ప‌రుపు చూస్తే తాను ఆడుతోన్న ప్రేమ నాట‌కం మొత్తం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని భయపడిన రాజ్... ప‌రుపును వెనుక డోర్ నుంచి గార్డెన్‌లో ప‌డేస్తాడు. రూమ్‌లోనే రాజ్ అటూ ఇటూ తిరుగుతూ టెన్ష‌న్‌గా క‌న‌ప‌డ‌టంతో ఏమైంద‌ని ఇందిరాదేవి అడుగుతుంది. తిన్న‌ది అర‌గ‌క తిరుగుతున్నాడ‌ని రాజ్‌పై సెటైర్ వేస్తుంది కావ్య‌. ఇందిరాదేవి పాలు ఇచ్చి వెళ్లిపోతుంది. ఆ త‌ర్వాత త‌న ప‌రుపు ఏది అని రాజ్‌ను అడుగుతుంది కావ్య‌. మ‌న విడివిడిగా ప‌డుకోవ‌డం ఇష్టంలేకే ప‌రుపును కింద‌ప‌డేశారు క‌దా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య‌. అంత‌లేదు అంటూ కావ్య‌కు బ‌దులిస్తాడు రాజ్‌. పరుపును తీసుకువస్తా అని కిందకి వెళ్తాడు.

వాకింగ్‌ కు వెళ్లిన త‌న భ‌ర్త ప్ర‌కాశం ఇంటికి తిరిగిరాక‌పోవ‌డంతో ధాన్య‌ల‌క్ష్మి కంగారు ప‌డుతుంది. మ‌తిమ‌రుపు కార‌ణంగా ఇళ్లు మ‌రిచిపోయాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను అప‌ర్ణ‌, రుద్రాణి ఓదార్చుతారు. ఇందిరాదేవి చూడ‌కుండా ఉండాల‌నే ప్ర‌య‌త్నంలో రాజ్ కింద‌ప‌డేసిన ప‌రుపు గార్డెన్‌ లో వాకింగ్ చేస్తోన్న‌ ప్ర‌కాశంపై ప‌డుతుంది. దాంతో అత‌డు స్పృహ కోల్పోతాడు. ఆ విష‌యం బ‌య‌ట‌డ‌కుండా ఉండేందుకు బాబాయ్‌ ని తాను తీసుకొస్తాన‌ని ధాన్య‌ల‌క్ష్మికి చెప్పి బ‌య‌ట‌కు వ‌స్తాడు రాజ్ కంగారు చూసి రుద్రాణికి అనుమానం మొద‌ల‌వుతుంది.

Raj is Annoyed in October 25th 2023 Episode number 236 in Brahmamudi Telugu Serial

ప్ర‌కాశం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన రాజ్ అత‌డిని స్పృహ‌లో నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. ప‌రువు కార‌ణంగా త‌న ప‌రువు పోయేలా ఉంద‌ని భావించి దానిని బ‌య‌ట‌ప‌డేస్తాడు. స్పృహ‌లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌కాశం నాకు ఏమైంది...ఇక్క‌డ ఎందుకు ఉన్నాను అంటూ రాజ్‌ను అడుగుతాడు ప్ర‌కాశం. ప‌రుపు విష‌యం దాచిపెట్టి వాకింగ్‌కు వ‌చ్చి ఇక్క‌డే నిద్ర‌పోయావ‌ని రాజ్ కవర్ చేస్తాడు. ప్ర‌కాశాన్ని తీసుకొని ఇంటికి వస్తాడు. భ‌ర్త‌ను చూసి ఎక్క‌డికి వెళ్లార‌ని అడుగుతుంది ధాన్య‌ల‌క్ష్మి. స్వ‌ర్గానికి అంటూ స‌మాధానం చెబుతాడు. అప‌ర్ణ‌, రుద్రాణి అడిగినా అదే స‌మాధానం చెబుతాడు.

ప్ర‌కాశం కోసం తాను గార్డెన్‌లో చూశాన‌ని త‌న‌కు ఎందుకు క‌నిపించ‌లేద‌ని రాజ్‌ను అడుగుతుంది అప‌ర్ణ‌. కానీ రాజ్ త‌డ‌బ‌డుతూ ఏదేదో స‌మాధానం చెబుతుంది. ప్ర‌కాశాన్ని క‌న్ఫ్యూజ్ చేసి త‌న నాట‌కం బ‌య‌ట‌ప‌డ‌కుండా రాజ్‌ కవర్ చేస్తాడు. ఉట్టి చేతుల‌తో రాజ్ తిరిగి రావ‌డం చూసి త‌న ప‌రుపు ఏది అని అత‌డిని అడుగుతుంది కావ్య‌. ప‌రుపు బ‌య‌ట‌ప‌డేశాన‌ని బ‌దులిస్తాడు రాజ్‌. ఇంట్లో వాళ్లంద‌రూ మెళుకువ‌గా ఉన్నార‌ని... వారికి క‌నిపించ‌కుండా ఉండ‌టం కోస‌మే ఆ ప‌ని చేయాల్సివ‌చ్చింద‌ని అంటాడు. మీ అంత‌రార్థం మొత్తం అర్థ‌మైంద‌ని, మీ మ‌న‌సులో ఉద్దేశం తెలిసిపోయింద‌ని కావ్య అంటుంది.

ప‌రుపును ప‌డేయ‌డం వెనుక మీ స్వార్థం ఉంద‌ని, ప‌రుపు ప‌డేస్తే ఒకే బెడ్‌పై ఇద్ద‌రం ప‌డుకోవ‌చ్చ‌ని ఇలా చేశారు క‌దా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య‌. పిచ్చి పిచ్చి క‌విత‌ల‌తో మాట్లాడి రాజ్‌ను మ‌రింత ఏడిపిస్తుంది. ప్రాస‌లు చెప్పి ఆట‌ప‌ట్టిస్తుంది. కావ్య ప్రాస‌ల‌తో రాజ్ బుర్ర‌తిరిగిపోతుంది. త‌ల ప‌ట్టుకుంటాడు. కావ్య‌ను బ‌య‌ట‌కు వెళ్ల‌మ‌ని అంటాడు. తాను ఇందిరాదేవి రూమ్‌లో ప‌డుకుంటాన‌ని కావ్య బ‌య‌లుదేరుతుంది. రాజ్ టెన్ష‌న్ ప‌డి ఆమెను ఆపేసి త‌లుపు మూస్తాడు. మ‌ళ్లీ ప్రాస‌ల‌తో మాట్లాడ‌టం మొద‌లుపెడుతుంది. ఆమెను నోరును బ‌ల‌వంతంగా మూసేస్తాడు రాజ్‌. ఆమెను బెడ్‌పై ప‌డుకోబెడ‌తాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Raj is Annoyed in October 25th 2023 Episode number 236 in Brahmamudi Telugu Serial

ఆ త‌ర్వాత ఎపిసోడ్ లో స్వ‌ప్న సీమంతం కోసం అందరూ ముహూర్తం ఫిక్స్ చేస్తారు. ఇక స్వ‌ప్న సీమంతం వేడుక‌ను జ‌రిపించే బాధ్య‌త‌ను కావ్య‌కు అప్ప‌గిస్తుంది ఇందిరాదేవి. అంద‌రిని మోసం చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని అనుకుంటుంది కావ్య. దీంతో మీ అందరికి ఓ విషయం చెప్పాలి అని కావ్య అంటుంది. అది విని స్వప్న షాక్ అవుతుంది. చూడాలి మరి ఏంజరగనుందో .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X