Brahmamudi October 18th: పోలీసులకు అడ్డంగా దొరికేసిన రాజ్, కావ్య... బయటపడ్డ రాహుల్ బండారం
బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తోంది. కావ్య కోరికను రాజ్ తీర్చేందుకు దొంగచాటుగా ఇంట్లోంచి బయటకు వెళ్లేందుకు బయలుదేరుతాడు. ఇక కావ్య చుడీదార్ వేసుకుని వస్తుంది. అది చూసి రాజ్ షాక్ అయి.. చీర ఏమైంది అని అడుగుతాడు. బైక్ మీద వెళ్లాలి అన్నారు కదా.. కంఫర్ట్ గా ఉంటుందని వేసుకున్న అని చెప్తుంది. ఇక కావ్యను పట్టుకుని రాజ్ బయలుదేరుతాడు. కావ్య ఇది కిల్లీ కొట్టుకు పోయినట్లు లేదు... లేచిపోతున్నట్లు ఉంది అంటుంది. ఇక ఇద్దరూ కలిసి దొంగచాటుగా బయటకు వస్తారు.
ఇక బైక్ తీసుకుని కావ్యను ఎక్కించుకుని రాజ్ బయలుదేరుతాడు. కావ్య.. రాజ్ ను గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఏంటిది అని రాజ్ అడగ్గా... నా కోరిక తీరింది.. ఇలా భర్తతో బయటకు వెళ్లాలని ప్రతి అమ్మాయికి ఉంటుందని చెప్తుంది. ఇక ఓ చోట ఆగుతారు... అక్కడ ఓ వ్యక్తి... క్వాటర్ కావాలా... హాఫ్ కావాలా అని అడుగుతాడు. నీ బొందరా అని రాజ్ చెప్పి వెళ్తాడు. మీరు నిజంగా తాగారా అని కావ్య అంటుంది... నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని రాజ్ చెప్తాడు.. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ముద్ద పప్పులా పెరిగారన్న మాట అని కావ్య అంటుంది. మీకు తాగి వచ్చే భర్తలే కరెక్ట్ అని రాజ్ సెటైర్ వేస్తారు.

ఇక ఇంకో చోటికి వెళ్తారు. అక్కడ పాన్ షాప్ కు తాళం వేయకుండా ఓనర్ బయటకు వెళ్తాడు. అక్కడికి వచ్చిన రాజ్,కావ్య... కిల్లీ దొంగతనం చేయాలని అనుకుంటారు. ఇక లోపలికి వెళ్లిన రాజ్... కావ్యకు కిల్లీ కట్టి ఇస్తాడు. ఆ కిల్లీని తింటుంది కావ్య. ఇక ఈ లోపు అక్కడికి ఓనర్ వచ్చి... ఎవరో దొంగలు పడ్డారు నా షాప్ లో అనుకుంటాడు. పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఐదు నిమిషాల్లో వస్తాను అని పోలీస్ చెప్తాడు. ఇక కావ్య... రాజ్ కోసం పాన్ కట్టిస్తుంది.
కావ్య మసాలా కిల్లి తయారు చేసి... రాజ్ కు ఇస్తుంది... అందులో జరదా కలిపి ఇస్తుంది. రాజ్ పాటలు వేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కావ్య కిల్లీ తెచ్చి నోట్లో పెడుతుంది. ఇక ఇదేంటి ఇలా ఉంది అంటే.. మీది ఉక్కు బాడీ కదా అని కావ్య అంటుంది. ఇక సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. రండి బయటకు... దొంగతనం చేస్తారా అని పోలీసులు అంటారు.
మేం దొందలం కాదు అని రాజ్ నాలుక మందంగా వస్తుంది. రాజ్ మాట్లాడే మాటలను కావ్య చెబుతూ ఉంటుంది. మేం దొంగలం కాదు. డబ్బు తీయలేదు అని కావ్య వివరిస్తుంది. తర్వాత రాజ్ గొంతు సరిగ్గా అయ్యేలా వాటర్ ఇస్తాడు పాన్ షాప్ అతను. మేం దొంగలం ఏంటీ సార్ అని రాజ్ అంటే.. రెడ్ హ్యాండెడ్ గా దొరికారుగా.. కాదు అంటారా అని పోలీసులు అంటారు. మేం భార్యాభర్తలం సార్.... కిల్లీ కావాలని వచ్చాం. కానీ ఎక్కడా షాప్ కనిపించలేదు. ఇక్కడ సెటర్ వేసి ఉన్న లాక్ లేదు. అందుకే కిల్లీ కట్టుకుని, మ్యూజిక్ బాగుంటే డ్యాన్స్ వేశాం అని కావ్య చెబుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇక తదుపరి ఎపిసోడ్ లో మైఖేల్ కు బెయిల్ వచ్చేందుకు లాయర్ తో మాట్లాడతాడు రాహుల్. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మైఖేల్ కు బెయిల్ రావాలంటాడు రాహుల్. దానికోసం ఇంట్లో ఉన్న నగలు దొంగతనం చేసి బయటకు తీసుకెళ్దామనుకుంటాడు. రాహుల్ చేతిలో బ్యాగ్ ఏంటీ అని రాజ్ అడిగితే.. కొత్త డిజైన్స్ అనుకుంటా అని ప్రకాష్ అంటాడు. ఏది చూపించూ అని ప్రకాష్ లాగుతాడు. నగలు కిందపడిపోతాయి. రాహుల్ దొరికిపోతాడు. ఈ నగలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావ్ అని రాజ్ నిలదీస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











