Brahmamudi july 12th: కావ్య, కల్యాణ్‌ను స్టేషన్ నుంచి విడిపించిన రాజ్.. హనీమూన్ కావాలంటూ స్వప్న పంచాయితీ
బ్రహ్మముడి తెలుగు సీరియల్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య, కల్యాణ్‌ను పోలీసులు అరెస్టు చేయగా... పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రాజ్ విడిపిస్తాడు. మరోవైపు ఇంట్లో స్వప్న మరో పెంట పెడుతుంది. హనీ మూన్ కావాలంటూ పంచాయితీ పెడుతుంది. మరోవైపు సేటు కనకం ఇంట్లో అప్పు కోసం వార్నింగ్ ఇస్తాడు. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెెళితే...
శ్రుతిపై రాజ్ ఫైర్: రాజ్ దగ్గరికి డిజైన్స్ పట్టుకొస్తుంది శ్రుతి. వాటిని చూసి రాజ్ షాక్ అవుతాడు. అసలు నీ వర్క్ చూస్తుంటే నాకు చాలా కన్ఫ్యూజన్‌గా ఉంది. ఒక్కోసారి చాలా అద్భుతంగా వేస్తావ్... అసలు మొన్న డిజైన్స్ వేసింది నువ్వేనా.. మనం నెక్ట్ వీక్ డిజైన్స్ మేన్యుఫేక్టరింగ్‌కి పంపించాలి.. పని మీద కాస్త శ్రద్ధ పెట్టు అని వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఇంతలో రాజ్‌కి జూబ్లీహిల్స్ ఎస్‌ఐ ఫోన్ చేస్తాడు.

మీరు ఒకసారి స్టేషన్‌కు రావాలి.. అని అంటే ఎందుకు.. అంటాడు రాజ్. మీరు పిలవగానే రావడానికి నేను మీ కింద పనిచేసే కానిస్టేబుల్‌ను కాదని ఎస్ఐపై సీరియస్ అవుతాడు రాజ్. తాను చాలా బిజీగా ఉంటానని, సడన్‌గా పిలిస్తే రానని, తాను రావాలంటే ప్రాపర్ అపాయింట్‌మెంట్ ఉండాలని చెబుతాడు.
స్వప్న పంచాయితీ: సరే మీ పనులు చూసుకొని తీరిగ్గా రండి అప్పటివరకు మీ వైఫ్‌ను, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటానని ఎస్ఐ చెబుతాడు. మా వాళ్లను అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటని ఎస్ఐని అడుగుతాడు రాజ్. స్టేషన్‌కు వచ్చి నన్ను కలిస్తేనే కారణాలు చెబుతానని ఎస్ఐ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

కావ్య ఏదో తప్పు చేసి తన తమ్ముడిని ఇరికించిందని కోపంతో పోలీస్ స్టేషన్‌కు బయలుదేరుతాడు రాజ్. దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కలిసి టీవీ చూస్తుంటారు. అపర్ణ, ఇందిరాదేవి, ధాన్యలక్ష్మి సినిమాలో మునిగిపోతారు. వెంటనే ఛానల్ మారుస్తుంది స్వప్న.అసలు ఏంటీ నీ బాధ అని స్వప్నను ధాన్యలక్ష్మి అడుగుతుంది.
హనీమూన్ కావాలంటూ: చెబితే ఏం చేస్తారు అంటూ ఆమెపై స్వప్న సీరియస్ అవుతుంది. తన భర్త సరిగా ఉంటే నాకు ఈ బాధలన్ని ఎందుకు వస్తాయి అని వాపోతుంది. దాంతో ఈ గొడవను తమకు అనుకూలంగా మార్చుకొని స్వప్నను ఇంటి నుంచి గెంటేయాలని రాహుల్, రుద్రాణి అనుకుంటారు. నీకు రత్న సింహాసనం కావాలా, హంసతూలిక తల్పం కావాల అంటూ స్వప్నను దెప్పిపొడుస్తుంది రుద్రాణి.

నాకు నా భర్త ప్రేమ కావాలి అంటూ రుద్రాణితో కోపంగా అంటుంది స్వప్న. కొత్తగా పెళ్లయిన తనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయని, వాటిని తీర్చాలని తన భర్తతో పాటు అత్తగారికి లేదని సీరియస్ అవుతుంది. తాను హనీమూన్ వెళ్లాలని అనుకుంటున్నట్లు రుద్రాణితో చెబుతుంది.
బిడ్డపుట్టాకే హనీమూన్: నువ్వేమీ కొత్తగా పెళ్లిచేసుకొని రాలేదు, కడుపుతో వచ్చావని స్వప్నపై రుద్రాణి ఫైర్ అవుతుంది. పెళ్లికి ముందు మీ అబ్బాయి చేసిన వాగ్ధానాలు ఏమైనా తెలుసా...గోవాలో డెస్టినేషన్ మ్యారేజీ, ఫారిన్‌లో ఫస్ట్ నైట్ అంటూ తనకు మాటిచ్చాడని రాహుల్ అబద్ధాల్ని బయటపెడుతుంది స్వప్న. అవన్నీ పిచ్చిదానిలా నువ్వు నమ్మి సర్వసం సమర్పించుకున్నావని అపర్ణ అంటుంది. బిడ్డ పుట్టినతర్వాతే ఇద్దరిని ఫారిన్ పంపిస్తానని ఇందిరాదేవి స్వప్నకు సర్ధిచెబుతుంది.

పోలీసులతో ముచ్చట్లు: కావ్య, కళ్యాణ్‌కు ఏమైందోనని కంగారుగా పోలీస్ స్టేషన్‌కు వస్తాడు రాజ్. కానీ వాళ్లు అక్కడ సరదాగా పోలీసులతో ముచ్చట్లు చెబుతూ కనిపిస్తుంటారు. దాంతో ఇద్దరిపై రాజ్ ఫైర్ అవుతాడు. కావ్య డ్రైవింగ్ నేర్చుకుంటూ తనను కారుతో ఢీకొట్టిందని రాజ్‌తో చెబుతాడు ఎస్ఐ. కావ్య, కళ్యాణ్‌లను క్షమించనని సీరియస్‌గా అంటాడు. సెటిల్‌మెంట్ చేసుకుందామని రాజ్ చెప్పిన అతడి మాటల్ని ఎస్ఐ పట్టించుకోడు.ఓ వైపు రాజ్ టెన్షన్ పడుతుంటే కళ్యాణ్, కావ్య జోక్స్ వేస్తారు. చివరకు కమీషనర్‌కు కాల్ చేసి మ్యాటర్ సెటిల్ చేస్తాడు రాజ్.
సేటు ఇళ్లు జప్తు: స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కావ్య, కళ్యాణ్‌పై ఫైర్ అవుతాడు రాజ్. దుగ్గిరాల వంశం పరువు తీశారని కోపగించుకుంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎండ్ అయ్యింది. తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతుంటుంది కావ్య.అదే సమయంలో అప్పు కోసం సేట్ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తాడు.ఆ విషయం కావ్యకు తెలియకుండా ఉండాలని కనకం అనుకుంటుంది. కానీ ఫోన్ కట్ చేయడం మర్చిపోతుంది. సేట్ ఇళ్లు జప్తు చేస్తానని బెదిరించడం కావ్య వింటుంది.


Click it and Unblock the Notifications











