Brahmamudi August 14th: అపర్ణ, రుద్రాణిలకు సీతారామయ్య వార్నింగ్.. కావ్య చేసిన పనికి ఇంట్లో వాళ్లంతా హ్యాపీ

సోమవారం వచ్చేసింది. మళ్లీ బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఇంట్రెస్టింగ్ గా సాగింది. పుట్టింటి నుంచి వచ్చిన కావ్యపై అందరూ ఫైర్ అవుతారు. మనిషికో మాట అంటారు. కానీ దుగ్గిరాల సీతారామయ్య మాత్రం.. కావ్యకు మద్దతు ఇస్తాడు. నా మనవరాలు ఏం తప్పుచేసిందని అడుగుతాడు. ఇది చూసిన అక్కడి వారంతా షాక్ అవుతారు. ఇక పూర్తి ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే...

ఈరోజు బ్రహ్మముడి ధారావాహికలో... పుట్టింటి నుంచి అత్తగారి ఇంటికి వస్తుంది కావ్య. ఇంట్లో అందరూ నిలదీస్తారు. మట్టి పని చేసుకుంటే మా పరువు పోతుందని అపర్ణ ఫైర్ అవుతుంది. కావ్య.. తన కాంట్రక్ట్ రాజ్ క్యాన్సిల్ చేయించిన విషయం బయట పెడుతుంది. ఇగ ఈ ఇంటి కోడలిగా ఉండాలంటే.. అందరికి నచ్చినట్టుగా ఉండాలి, కుదురుతుందో లేదో అడగమని అపర్ణ అంటుంది.

Brahmamudi

తప్పు చేసింది మీరు.. నా స్వేచ్ఛను లాక్కుంటున్నారని కావ్య ఎదురుమాట్లాడుతుంది. కానీ నేను మాత్రం.. ఈ ఇంటి పరువును కాపాడనని అనుకుంటున్నట్టుగా కావ్య చెబుతుంది. నా నిర్ణయాన్ని మార్చుకోనని తెగేసి చెబుతుంది. ఇలానే మా పుట్టింటికి చేతనైనా సాయం చేస్తూనే ఉంటానని అంటుంది. అయితే మా ఇంట్లో ఉండడానికి వీల్లేదని అపర్ణ షాక్ ఇస్తుంది. దీంతో అందరూ అవాక్కవుతారు.

Brahmamudi

ఇక చాలు ఆపండని సీతారామయ్య గట్టిగా అరుస్తాడు. అసలు నా మనవరాలు ఏం తప్పు చేసిందని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటున్నారని అడుగుతారు. కావ్య మన పరువు తీయలేదని, కాపాడిందని అంటాడు. కావ్య ఈ పనిచేసి.. మనం తనకు ఎంత స్వేచ్ఛ ఇచ్చామో.. ఎంత ప్రొత్సహిస్తున్నామో.. చెప్పకనే అందరికీ చెప్పిందని క్లారిటీ ఇస్తాడు. కావ్య ప్రెస్ మీట్లో తన అత్తగారి ఇల్లు, తనకు ఎంతగానో అండగా నిలబడిందని చెప్పిందని, కానీ మీరు అలా ఉంటున్నారా అని సీతారామయ్య ప్రశ్నిస్తాడు.
Brahmamudi

ఎవరికి ఇష్టం ఉన్నా.. లేకపోయినా.. కావ్య తన పుట్టింటికి వెళ్తుందని, నచ్చిన పని చేస్తుందని అంటాడు. ఇందులో ఎవరూ అభ్యంతరం చెప్పేందుకు వీలు లేదని, ఈ ఇంటి పెద్దగా.. నేను తీసుకున్న నిర్ణయమని చెబుతాడు. కావ్యకు... ధైర్యంగా వెళ్లి నీకు నచ్చింది చేయమని, నీకు నేను ఉన్నానని చెబుతాడు సీతారామయ్య.

Brahmamudi

మరోవైపు కావ్య పరుపు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. రాజ్ వస్తాడు. నా పరుపు నేను తీసుకోగలనని అంటుంది కావ్య. నువ్ పరుపు మాత్రమే కాదు.. పరువు కూడా తీయగలవని రాజ్ వెటకారం చేస్తాడు. కాసేపు వీరి మధ్య ఫన్నీ ట్రాక్ నడుస్తోంది. అసలు మీ ఇంటికి వెళ్లి పనిచేయనని అంత సింపుల్ గా ఎలా ఒప్పుకున్నావని ప్రశ్నిస్తాడు రాజ్. అయ్యో దేవుడా దీనికోసమా.. పరుపు మీద వచ్చిందని, మీతో ఇదే ప్రాబ్లమ్ అని మీరు చెప్పింది చేసినా.. ప్రాబ్లమే.. చెయకున్నా ప్రాబ్లమేనని అంటుంది.

సీన్ కట్ చేస్తే... టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటుంది కావ్య. సీతారామయ్య దిక్కు చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ కిందకు దిగుతాడు. రాజ్ పేపర్ చదువుతుంటే.. తీసుకెళ్లి.. లాక్కొని సీతారామయ్యకు ఇస్తుంది. ఇదిగో ఇది చదవండని, ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలుస్తుందని రాజ్ కు బుక్ ఇస్తుంది కావ్య. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో కావ్య చేసిన పనికి అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. కావ్యను రాజ్ కారులో దింపమని సీతారామయ్య ఆదేశిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X