టీవీ సీరియల్ ఎపిసోడ్ డైరక్ట్ చేస్తూ నటించిన రాజమౌళి

By Srikanya

Rajamouli
హైదరాబాద్ : ప్రముఖ దర్సకుడు రాజమోళి తాజాగా ఓ పాపులర్ టీవీ సీరియల్ ఎపిసోడ్ డైరక్ట్ చేస్తూ, నటిస్తూ కనిపించనున్నారు. ఆ సీరియల్ పేరు చంద్రముఖి. ఈ డైలీ సీరియల్ గురువారంతో 1500 భాగాలు పూర్తి చేసుకొంటుంది. తెలుగులో ఓ ధారావాహిక ఇన్ని భాగాలుగా ప్రదర్శితం కావడం ఇదే ప్రథమం. ఈ భాగంలో రాజమౌళి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఆయనే ఆ ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించడం విశేషం. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ ధారావాహికను నిర్మిస్తున్నారు.

ఈ విషయమై రాజమౌళి మాట్లాడుతూ...''బుల్లితెర అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే సినిమాల్లోకి రాకముందు నేను కూడా 'శాంతి నివాసం' ధారావాహిక కోసం పనిచేశా. వంద భాగాలు పూర్తి చేయడమే గగనం అనుకొనేవాళ్లం. అలాంటిది 'చంద్రముఖి' ఇన్ని రోజులుగా ప్రదర్శితమవ్వడం ప్రశంసనీయం. ప్రేక్షకుల నుంచీ చక్కటి ఆదరణను సొంతం చేసుకొంది. ఇది రెండు వేల భాగాల వరకూ నిరాటంకంగా కొనసాగాలి. ఆ ప్రత్యేక భాగంలోనూ అవకాశమిస్తే నటిస్తాను. ఆర్కా సంస్థతో 'మర్యాద రామన్న' సినిమా రూపొందించా. త్వరలో ప్రభాస్‌ హీరోగా ఈ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తాను'' అన్నారు.

ఈ సీరియల్‌కి యాట సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతినిగమ్‌, మంజుల, నవీన, నిరుపమ్‌, చలపతిరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా దర్శకులు అప్పుడప్పుడూ బుల్లి తెరపై దర్శనమివ్వడం మామూలే. గేమ్‌ షోలాంటి కార్యక్రమాల్లోనే తళుక్కున మెరుస్తుంటారు. కానీ ఇలా ఓ ధారావాహికలో అతిథిగా కనిపించడం అరుదే. 'చంద్రముఖి' ఆ ప్రత్యేకతను సాధించింది. దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి 'చంద్రముఖి' కోసం బుల్లి తెరపైకి రావటం క్రేజ్ తెస్తుందని భావిస్తున్నారు.

టెలీకాస్ట్ సమయం: ప్రతి రోజు రాత్రి 8 గం.లకు ఈటీవీలో ప్రసారమవుతుంది. గురువారం ఈ ఎపిసోడ్ లో అంటే ఈ రోజు కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X