twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    EMK: ఎన్టీఆర్ షోలో రాజమౌళితో పాటు మరొక సీనియర్ దర్శకుడు.. ఫొటోలు లీక్ అవ్వడంతో?

    |

    నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి ఒక రియాల్టీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే బిగ్ బాస్ మొదటి సీజన్ కు వ్యాఖ్యాతగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత రెండవ సీజన్ కు కూడా హోస్ట్ గా కొనసాగుతుతాడని అందరు అనుకున్నారు. కానీ బిజీగా ఉండటం వల్ల తారక్ మళ్లీ అటు వైపు వెళ్ళలేదు.

    ఇక ఈ సారి అందరికీ విజ్ఞానాన్ని అందించేలా ఉంటే గేమ్ షోను స్టార్ట్ చేశాడు. గతంలో నాగార్జున మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరుడు సరి కొత్తగా మొదలు పెట్టాడు. ఎవరు మీల్ కోటీశ్వరులు అంటూ మొదటి ఎపిసోడ్ లోనే రామ్ చరణ్ తో సరి కొత్తగా స్టార్ట్ చేశాడు. తారక ఈసారి మరికొంత మంది అగ్ర దర్శకులు కూడా షో లోకి ఇన్వైట్ చేయబోతున్నాడు. అందులో రాజమౌళి తో పాటు మరొక సీనియర్ దర్శకుడు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

    మొదటి ఎపిసోడ్ తోనే భారీ క్రేజ్

    మొదటి ఎపిసోడ్ తోనే భారీ క్రేజ్

    ఎవరు మీలో కోటీశ్వరులు షోను ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గ్రాండ్ గా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఎప్పటిలానే వెండితెరపై భారీస్థాయిలో రేటింగ్స్ అందుకుంటున్నాడు. బిగ్ బాద్ సీజన్ 1 ను మొదలు పెట్టినప్పుడు ఏ స్థాయిలో అయితే క్రేజ్ అందుకున్నాడో ఇప్పుడు కూడా అదే తరహాలో స్టార్ట్ చేసాడు. అందుకు సంబంధించిన ప్రోమోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తో మొదలు పెట్టిన మొదటి షో కు ఎవరు ఊహించని విదంగా మంచి రేటింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

    రెగ్యులర్ ప్రమోషన్స్

    రెగ్యులర్ ప్రమోషన్స్

    రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారి RRR సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ కోసం నందమూరి అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా ఇటీవల స్టార్ట్ చేశారు. మొదటి పాట తోనే సినిమాకు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశారు.

    గేమ్ ఆడించడమే కాకుండా

    గేమ్ ఆడించడమే కాకుండా

    జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎవరు మీలో కోటీశ్వరుడలు షోతో అప్పుడప్పుడు RRR సినిమా కు సంబంధించిన ప్రమోషన్ ను గట్టిగానే చేయాలని ఫిక్స్ అయ్యారు. డైరెక్ట్ గా కాకుండా సినిమాకు సంబంధించిన టెక్నీషియన్లను నటీనటులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి వారితో గేమ్ ఆడించడమే కాకుండా వారి పర్సనల్ విషయాలను కూడా అడిగి తెలుసుకుంటారు. ఇక సినిమాకి సంబంధించిన అనేక విషయాల గురించి కూడా చర్చలు జరపాలని ప్లాన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ తో అయితే మొత్తానికి తెలుగులో భారీ స్థాయిలో అయితే బజ్ క్రియేట్ చేశాడు.

    రాజమౌళి - ఎన్టీఆర్

    రాజమౌళి - ఎన్టీఆర్

    దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ షో కు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి ఎంత సన్నిహితంగా ఉంటారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు ఇద్దరి కెరీర్ కూడా ఒకేసారి మొదలైంది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో జూనియర్ ఎన్టీఆర్ మొదటి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి కూడా అప్పటి నుంచే మంచి దర్శకుడిగా కొనసాగుతూ వచ్చాడు. ఆ తర్వాత సింహాద్రి, యమ దొంగ వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు.

    ఎన్టీఆర్ షో కోసం రాజమౌళి

    ఎన్టీఆర్ షో కోసం రాజమౌళి

    ఇక చాలా కాలం తర్వాత మళ్లీ RRR సినిమాతో ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. వీరితోపాటు రామ్ చరణ్ కూడా సినిమా కోసం కలిసి పని చేస్తుండడంతో అంచనాల స్థాయి ఆకాశాన్ని దాటేసింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం రాజమౌళి ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. షో కోసం మరొక సీనియర్ దర్శకుడు కూడా గేస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు సీనియర్ దర్శకుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.

    ఆ ఫొటోలు లీక్ అవ్వడంతో

    ఆ ఫొటోలు లీక్ అవ్వడంతో

    ఇటీవల రాజమౌళితో పాటు కె.రాఘవేంద్రరావు కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎవరు మీలో కోటీశ్వరులు సెట్ దగ్గర కనిపించినట్లు కొన్ని ఫోటోలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కాని జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తప్పకుండా రాజమౌళిని అలాగే చిత్ర యూనిట్ సభ్యులు కొంతమందిని షో కోసం ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. మరి ఈ షో ద్వారా RRR కు ఏ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తారో చూడాలి.

    Recommended Video

    Chiru బృందంలో Mahesh Babu, Allu Arjun | Ys Jagan ఒకే అంటేనే || Filmibeat Telugu
    విడుదల ఎప్పుడంటే?

    విడుదల ఎప్పుడంటే?

    RRR సినిమా విడుదల విషయానికి వస్తే ఈ ఏడాది రెండు విడుదల తేదీలను మిస్ చేసుకున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీ వచ్చే ఏడాది ఎలాగైనా అనుకున్న తేదీకి రావాలని అనుకుంటున్నారు. అసలైతే అక్టోబర్ 13న విడుదల చేయాలని అనుకుంటున్నారు కానీ పరిస్థితిలు ఏ మాత్రం అనుకూలించేలా లేవని అర్థమవుతోంది.

    ఇక ఎలాగైనా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారని ఒక టాక్ అయితే వస్తుంది. కానీ ఇప్పటికే పొంగల్ భరిలో భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ పోటీకి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఆచార్య కూడా రావచ్చని టాక్ వచ్చింది. మరి RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    SS Rajamouli, JrNTR & Raghavendra Rao spotted at Annapurna studios today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X