twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజశేఖర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్: తప్పుకున్న డైరెక్టర్.. కొత్త దర్శకుడు ఎవరంటే!

    |

    అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందారు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. చాలా కాలం పాటు తన హవాను చూపించిన ఆయన.. వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో కనిపించారు. అయితే, కొన్నేళ్ల నుంచి సినిమాల్లో వేగం తగ్గించిన ఆయన.. ఈ మధ్య చాలా తక్కువ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో 'గరుడ వేగ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన రాజశేఖర్.. ఆ మధ్య 'కల్కి' తర్వాత మరో చిత్రంలో నటించలేదు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత తన 91వ సినిమాను ప్రకటించారాయన.

    ఫిబ్రవరి 4న రాజశేఖర్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ఆయన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. లలిత్ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఎల్‌ఎమ్‌వీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. శివానీ, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం‌లు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చబోతున్న ఈ సినిమాకు 'శేఖర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో రాజశేఖర్ సగం ముఖం మాత్రమే కనిపిస్తోంది. తన ఏజ్‌కు తగ్గ పాత్రలోనే ఆయన కనిపిస్తున్నారు.

    Rajasekhar New Movie Shekar First Look Released

    ఈ సినిమాకు మొదట నీలకంఠ దర్శకత్వ బాధ్యతలు చేపట్టినా కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు తప్పుకున్నాడు. దీంతో లలిత్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి ఈ చిత్రానికి జీవిత దర్శకత్వం వహిస్తారని జోరుగా ప్రచారం కూడా జరిగింది. కానీ, అందుకు భిన్నంగా కొత్త దర్శకుడిని తీసుకున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ రిటైర్ అయిన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అతడి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

    English summary
    Rajasekhar is an Indian film actor known for his works primarily in Telugu cinema, and a few Tamil films. In a career spanning more than thirty years, he has acted in over eighty films in a variety of roles. He starred in blockbuster films like Talambralu, Sruthilayalu, Aahuti, Ankusam, Magaadu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X