Guppedantha Manasu May 9th: వసును కిడ్నాప్ చేయబోయిన రాజీవ్.. మను కాలేజీకి చేసిన సాయమంతా మోసమే!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో ముందుగా రాజీవ్ ను చూపిస్తారు. నిద్రలో ఉన్న అతడికి వసుధార బావా అని పిలిచినట్లుగా వినిపిస్తుంది. దీంతో అతడు మళ్లీ బావా అని పిలువు మరదలు పిల్లా అంటూ కలవరిస్తాడు. రెండు చేతులు చాచి మరీ బావా అని అంటూ అనగా.. అతడి ముందే కూర్చున్న శైలేంద్ర బావా అంటాడు.

ముఖ్యంగా అతడి చెంపలు పట్టుకుని నీకు గడ్డం ఉందేంటి, మీసాలు కూడా ఉన్నాయేంటి అని మొహం చూస్తాడు. నువ్వేంటి భయ్యా అంటూ అడుగుతాడు. పొద్దు పొద్దునే ఈ దరిద్రం ఏంటి భయ్యా అని శైలేంద్ర అనగా.. నువ్వు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపో అని చెబుతాడు. కానీ అథడు మాత్రం వసుధారను వదిలి ఉండలేనంటూ రాజీవ్ చెబుతాడు.

Rajeev is Going to Kidnap Vasu on Guppedantha Manasu May 9th 2024 Episode 1070

మన మీద వాళ్లకు డౌట్ వచ్చిందని.. ముఖ్యంగా నువ్వు బతికే ఉన్నావని, నిన్ను తెగ వెతికేస్తున్నారని శైలేంద్ర చెబుతాడు. అది నాక్కూడా తెలుసని రాజీవ్ అనగా.. నా భార్యకు కూడా అనుమానం వచ్చి రాత్రి నా ఫోన్ చెక్ చేసిందని అంటాడు. కానీ అప్పటికే నేను అన్నీ డిలీట్ చేయడం వల్ల తప్పించుకోగలిగామని... ఈ రెండు మూడు రోజులుల నువ్వు అసలే బయటకు రాకూడదని అంటాడు దీనికి రాజీవ్ ఓకే అని చెప్పగా శైలేంద్ర అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రాజీవ్ తనలో తాను మాట్లాడుకుంటూ.. నేను ఎందుకు నా మరదలిని చూడకుండా ఉంటాను.. కచ్చితంగా చూస్తానంటూ చెప్పుకొస్తాడు. అంతేకాకుండా పాల వాడిలా మారి వసుధార ఇంటికి వెళ్తాడు. పాలు పోస్తూ.. వసును మత్తు మందు కొట్టి ఆమెను కిడ్నాప్ చేయాలనుకుంటాడు.

ఇక ఆ తర్వాత అదంతా కల అని చూపిస్తారు. ఇంతలోనే శైలేంద్ర డోర్ కొడుతూ.. మేడమ్ పాలు అంటూ పిలవగా.. వసుధార వెనక నుంచి వస్తుంది. హలో మిమ్మల్నే ఎవరు కావాలంటూ అడుగుతుంది. వసును ఎత్తుకెళ్లాలని అని రాజీవ్ అనుకొని వెనక్కి తిరగగానే.. రాజీవ్ కనిపిస్తాడు. ఆమెకు మత్త మందు కొట్టి వెంట తీసుకెళ్లాలని అనుకోవాలనుకుంటాడు. అంతోలనే వసు.. మహేంద్రను పిలవగా అతడు వస్తాడు. అంతలోనే మహేంద్ర, అనుపమలు బయటకు రాగా... రాజీవ్ పారిపోతాడు. మహేంద్ర బయటకు వెళ్లి వెతికినా దొరక్కపోయేసరికి మళ్లీ లోపలికి వస్తాడు. రాజీవ్ వచ్చాడని, పాల క్యాన్ కూడా ఇక్కడే ఉందని చెబుతుంది. వాడిని పట్టుకుంటే మన సమస్య తీరిపోతుందని అనుకుంటారు. మామయ్యా మీరు రండి అంటూ మహేంద్రను తీసుకుని అనుపమ బయటకు వెళ్తుంది. ఏమైనా సమస్య ఉంటే ఫోన్ చేయమని అనుపమకు చెబుతారు.

Rajeev is Going to Kidnap Vasu on Guppedantha Manasu May 9th 2024 Episode 1070

ఆ తర్వతా మహేంద్ర, వసుధారలు పోలీస్ స్టేషన్ కు వస్తారు. ఈక్రమంలోనే పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతూ.. ఏంటిలా వచ్చారని అంటాడు. మళ్లీ ఆ పోలీస్ ఆఫీసర్ అతడికి నేరం పడుతుంది, ఏదీ జరగదని అంటాడు. కానీ కచ్చితంగా బయటకు వస్తాడని మహేంద్ర చెప్పగా.. మనును బయటకు తీసుకు వస్తారు. ఈ ముగ్గురూ ఓచోట కలిసి కూర్చుని మాట్లుడుకంటూ ఉండగా... తాను ఈరోజు రాజీవ్ ను చూశానని చెబుతుంది. ఇతా విన్న మను షాక్ అవుతాడు. అతడు బతికే ఉన్నాడని ప్రూవ్ చేయడం ఎలా అంటూ అడుగుతుంది. అయితే ఈ విషయంలో మనకు సాయం చేయదగినవాడు ఒక్కడే శైలేంద్ర అని మను అంటాడు. అలాగే తనకు బాగా ఇష్టం అయినది ఇస్తే మనకు సాయం చేస్తాడని చెబుతాడు. శైలేంద్రకు ఇష్టమైనది ఎండీ పదవి అని దాన్ని ఎరగా చూపి రాజీవ్ ను బయటకు రప్పించే ప్లాన్ నాదగ్గర ఒకటి ఉందంటాడు.

Rajeev is Going to Kidnap Vasu on Guppedantha Manasu May 9th 2024 Episode 1070

ఆ తర్వాత దీనికంటే ముందు నేను మీకో విషయం చెప్పాలంటూ గతంలో జరిగిన విషయాన్ని వివరిస్తాడు. నేను కాలేజీకి 50 కోట్లు ఇవ్వలేదని.. ఇస్తానని చెప్పిన మాట వాస్తవమే అయినా శైలేంద్రే ఇదంతా చేయించాడని అంటాడు. అయితే అనుమానం వచ్చి ఇంటరాగేట్ చేస్తే తనకు ఇది తెలిసిందని దాంతో ఆ చెక్ చింపేశానని వివరిస్తాడు. ఇదంతా ముందే చెప్పనందుకు నన్ను క్షమించండి అంటూ వివరించగా.. సరేనని అంటాడు మహేంద్ర. అయితే నేను ఇచ్చిన అప్పు కట్టకపోతే జప్తు చేసుకుంటానని నోటీసులు పంపిస్తానంటూ ఓ ప్లాన్ చెబుతాడు. తన మీద ఎలాగూ నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్న అతడు కచ్చితంగా నమ్ముతాడని అంటాడు. అతడు నమ్మకపోయినా.. తాము నమ్మేలా చేస్తామంటూ వసు, మహేంద్రలు వివరిస్తారు. ఇలా ఈ సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X