యాంకర్ సుమ రెమ్యూనరేషన్ ఎంత? రాజీవ్ కనకాల చెప్పింది నిజమా?
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో టెలివిజన్ రంగంలో సుధీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం అనేది చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో యాంకర్ సుమ కొన్నేళ్లుగా తన హవా కొనసాగించడమే కాదు... టాప్ యాంకర్‌గా కొనసాగిస్తున్నారు. ఒక మలయాళీ అమ్మాయి తెలుగు ఇంస్ట్రీలో అనర్గళంగా ఇక్కడి భాష మాట్లాడుతూ ఈ స్థాయిలో ఉండటం ఆమెకు మాత్రమే సాధ్యమైంది. సుమ విజయం వెనక భర్త రాజీవ్ కనకాల సపోర్ట్ ఉందని అంతా అనుకుంటారు. అయితే రాజీవ్ కనకాల మాత్రం ఈ విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తన భార్య గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

అందులో క్రెడిట్ ఏ మాత్రం నేను తీసుకోడట
సుమ ప్రతిభ, పనితనమే ఆవిడను అక్కడ కూర్చోబెట్టింది. అందులో క్రెడిట్ ఏ మాత్రం నేను తీసుకోను. అయితే ఆమె దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల కోడలు కావడంతో తెలియకుండా ఆమెకు కాస్త హెల్ప్ అయిఉండొచ్చు. మిగతాది అంతా ఆవిడ ప్రతిభ మాత్రమే అని రాజీవ్ కనకాల స్పష్టం చేశారు.

అంత సంపాదన లేదంటున్న రాజీవ్
సుమ టెలివజన్ రంగంలో టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె రెమ్యూనరేషన్ విషయంలో రకరకాల కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు హీరో హీరోయిన్లను మించి సుమ రెమ్యూనరేషన్ ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ ప్రచారాన్ని రాజీవ్ కనకాల తోసి పుచ్చారు. సుమ వరుస షోలు, కార్యక్రమాల్లో కనిపిస్తుంది కాబట్టి అంతా అలా అనుకుంటున్నారు. కానీ దీని వెనక కష్టం కూడా అలాగే ఉంటుందని తెలిపారు.

వందల లైట్ల మధ్య నిల్చొని చేయడం చాలా కష్టమైన పని
సినిమా షూటింగులో లైట్ల మధ్యలో ఐదు నిమిషాలు నిల్చొని ఒక షాట్ చేయడం అంటేనే చాలా కష్టం. అలాంటిది రోజుకు కొన్ని వందల లైట్ల మధ్య రెండు మూడు గంటలు నిలబడి ప్రోగ్రాం చేయడం అంటే ఇంకా కష్టం. అలా రోజుకు ఎనిమిది తొమ్మిది గంటలు నిల్చొని షో చేయడం అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. రోజూ మీరు స్పీకర్లు ఆన్ చేసేకుని కూర్చుంటే మీకు తెలియకుండానే మొదడు మీద ప్రభావం పడుతుంది. ఆ పెయిన్ భరిస్తూ చాలా కష్టపడి ఇన్నేళ్ల నుంచి సుమ చేసుకుంటూ వస్తోంది. అయితే బయట అంతా అనుకుంటున్నట్లు ఓహో అనేంత రెమ్యూనరేషన్ అయితే ఉండదని తెలిపారు.

సుమ ఎంత సంపాదిస్తోందో తెలియదు
సుమ ఒక ఆడియో ఫంక్షన్‌కు తీసుకునే రెమ్యూనరేషన్ కొన్ని లక్షల్లో ఉంటుందని అంటుంటారు అయితే ఎన్ని లక్షల్లో నాకైతే తెలియదని రాజవ్ కనకాల తెలిపారు. సుమ ఎంత సంపాదిస్తోంది? ఏమిటి? లాంటి విషయాలను ఎప్పుడూ తెలుసుకోలేదు, అలాంటి ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ఆవిడ స్పేస్ లోకి నేను వెళ్లి నీ సంపాదన మీద నేను పెత్తందారి చలాయిస్తాను అనే నేచర్ నాది కాదు. తన రెమ్యూనరేషన్ ఏమిటో నిజంగా నాకు తెలియదన్నారు.


Click it and Unblock the Notifications











