twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజంగానే ‘రెచ్చిపోయారు’.. వామ్మో వాటిని మించేలా ఉందే.. రాజీవ్ కనకాల రచ్చ!

    |

    బుల్లితెరపై కొత్త కొత్త షోలు వస్తూనే ఉన్నాయి. కొత్త కాన్సెప్ట్‌లంటూ వస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అయితే ఆర్టిస్ట్‌లు మాత్రం మారడం లేదు గానీ ప్రోగ్రాంలు మాత్రం మారుతున్నాయి. ప్రస్తుతం జబర్దస్త్ ఆర్టిస్ట్‌లతో మరో కొత్త షోను రాజీవ్ కనకాల నడిపించబోతోన్నాడు. అయితే జబర్దస్త్ ఆర్టిస్ట్‌లే కాకుండా యూట్యూబ్, టిక్ టాక్, డ్యాన్సర్స్ ఇలా చాలా మందినే పట్టుకొచ్చారు.

    కొత్త షోతో రాజీవ్ కనకాల

    కొత్త షోతో రాజీవ్ కనకాల

    ఒకప్పుడు రాజీవ్ కనకాల బుల్లితెరపై ఫుల్ డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్. ఎన్నో సీరియల్స్, ఇంకెన్నో షోలను సక్సెస్ ఫుల్‌గా హోస్ట్ చేశాడు. అలాంటి రాజీవ్ కనకాల ఈ మధ్య బుల్లితెరకు దూరంగా ఉంటూ వచ్చాడు. కానీ ఈ మధ్యే మళ్లీ తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు.

    రెచ్చిపోదాం బ్రదర్ అంటూ..

    రెచ్చిపోదాం బ్రదర్ అంటూ..

    రెచ్చిపోదాం బ్రదర్ అంటూ కొత్త షోను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నట్టు ప్రకటించాడు. ఇందులో నవ్వించడానికి వంద దారులున్నాయి.. ఆ వంద దారులు ఒకే చోటకు వస్తే.. అంటూ రాజీవ్ కనకాల అనడం.. జంక్షన్ జామ్ అయిపోద్దంటూ కౌంటర్ వేయడం.. వంటి డైలాగ్‌తో ఓ చిన్న ప్రోమోను విడుదల చేయగా అది బాగానే క్లిక్ అయింది.

    అదే కాన్సెప్ట్..

    అదే కాన్సెప్ట్..

    రెచ్చిపోదాం బ్రదర్ అనే షోలో అన్ని కాన్సెప్ట్‌లు కలిపి ఉన్నాయి. ఇందులో జబర్దస్త్ షోలాంటి స్కిట్లు, డ్యాన్స్ పర్ఫామెన్స్, స్టాండప్ కామెడీలు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో కనిపించే ఆర్టిస్ట్‌లు మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.

    రెచ్చిపోయిన యాంకర్..

    రెచ్చిపోయిన యాంకర్..

    యాంకర్‌గా ఉన్న మేఘన మాత్రంఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ డ్యాన్సులతో వయ్యారాలను ఊపేసింది. ఆమె వయ్యారాలను నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హోస్ట్టింగ్, యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ అన్నీ బాగున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

    టిక్ టాక్, యూట్యూబ్..

    టిక్ టాక్, యూట్యూబ్..

    రెచ్చిపోదాం బ్రదర్ షోలో టిక్ టాక్ స్టార్స్, యూట్యూబ్ స్టార్స్ ఇలా అందరినీ పట్టుకొచ్చారు. ఇక టిక్ టాక్ మంచి ఊపులో ఉన్న సమయంలో కొంత మంది బాగానే హల్చల్ చేశారు. ఇప్పుడు వాళ్లు బుల్లితెరపై మంచి అవకాశాలు సాధిస్తున్నారు. మరి ఈ షోతో అందరూ క్లిక్ అవుతారో లేదో చూడాలి.

    English summary
    Rajeev kanakala rechipodham brother show promo..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X