మొత్తానికి బుల్లితెరపై మరో ప్రయత్నం.. కొత్త కాన్సెప్ట్‌తో రాజీవ్ కనకాల రచ్చ

రాజీవ్ కనకాల వెండితెరపై నటుడిగా తన కంటూ ముద్ర వేసుకున్నాడు. అయితే అంత కంటే ముందుగానే బుల్లితెరపై రాజీవ్ కనకాల తన నట విశ్వరూపాన్ని చూపించాడు. బుల్లితెర నుంచి కెరీర్‌ను ప్రారంభించిన రాజీవ్ కనకాల.. వెండితెరపై భిన్న రకాల పాత్రలను పోషించాడు. బుల్లితెరపై ధారావాహికల్లోనే కాకుండా కామెడీ షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించాడు. అలా బుల్లితెరపై ఒకప్పుడు ఎంతో స్టార్డంను అనుభవించాడు రాజీవ్ కనకాల. మళ్లీ ఇన్నాళ్లకు రాజీవ్ కనకాల మరో కొత్త ప్రయత్నం చేస్తున్నాడు.

రాజీవ్ కనకాల అలా..

రాజీవ్ కనకాల అలా..

ప్రస్తుతం రాజీవ్ కనకాల అడపాదడపా చిత్రాల్లో కనిపిస్తున్నాడు. కానీ అతని స్థాయికి తగ్గ పాత్రలేవీ ఈ మధ్య రాలేదు. అయితే రాజీవ్ కనకాల నిర్మాణం వైపు మొగ్గుచూపుతున్నాడు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించే పనిలోబిజీగా ఉన్నాడు. అంతే కాకుండా యూట్యూబ్, సోషల్ మీడియాలో రాజీవ్ కనకాల తన బ్రాండ్‌ను ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నాడు.

బుల్లితెరపై స్పెషల్ అట్రాక్షన్..

బుల్లితెరపై స్పెషల్ అట్రాక్షన్..

రాజీవ్ కనకాల బుల్లితెరపై షోలు మానేసి చాలా కాలమే అవుతోంది. ఒకప్పుడు రాజీవ్ కనకాల హోస్ట్‌గా, యాంకర్‌గా దుమ్ములేపేశాడు. ఫ్యాన్స్‌తో నేరుగా తమ అభిమాన హీరోలతో ముచ్చట్లు పెట్టించేవాడు. అభిమాని, హీరో మధ్య ప్రేమను అందరికీ చూపించేవాడు. అయితే ఈ మధ్య మాత్రం రాజీవ్ కనకాల కేవలం స్పెషల్ గెస్ట్‌గా వస్తున్నాడు.

సుమ షోల్లో గెస్ట్..

సుమ షోల్లో గెస్ట్..

సుమ హోస్ట్‌గా చేస్తోన్న షోల్లో రాజీవ్ కనకాల అప్పుడప్పుడు స్పెషల్ ఎంట్రీలు ఇస్తుంటాడు. అలా క్యాష్, బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్, స్టార్ మహిళ వంటి షోల్లో రాజీవ్ సందడి చేస్తుంటాడు. కానీ తాజాగా రాజీవ్ కనకాల కొత్త షోను ప్రారంభించాడు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

రెచ్చిపోదాం బ్రదర్..

రెచ్చిపోదాం బ్రదర్..

నవ్వించడానికి వంద దారులున్నాయి.. ఆ వంద దారులు ఒకే చోటకు వస్తే.. అంటూ రాజీవ్ కనకాల అనడం.. జంక్షన్ జామ్ అయిపోద్దంటూ కౌంటర్ వేయడం.. ఇక పటాస్, జబర్దస్త్ టీంలోని కొంతమంది ఆర్టిస్ట్‌లతో చేస్తోన్న ఈ రెచ్చిపోదాం బ్రదర్ అనే షో బాగానే క్లిక్ అయ్యేలా ఉంది. అయితే రాజీవ్ కనకాల ఈ ప్రయత్నం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X