Anchor Suma: పాపం సుమ.. గర్భవతి సమయంలో ఆ తప్పు చేసిన రాజీవ్ కనకాల.. 25ఏళ్ల తర్వాత క్షమాపణలు!

బుల్లితెర యాంకర్ క్వీన్​ సుమ - సినీ సెలబ్రిటీ రాజీవ్ కనకాల.. ఈ ఇద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఎప్పటి నుంచో వీరిద్దరిలో ఒకరు తన మాటకారీతనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే మరొకరు తన నటనతో తెరపై రాణించారు. అయితే వీరిద్దరు చాలా సార్లు విడిపోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎట్టకేలకు రాజీవ్ కనకాల తాను చేసిన తప్పును ఒప్పుకుని సుమకు క్షమాపణలు చెప్పారు. సుమ గర్భవతిగా ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు అలాంటి పనులు చేసి ఆమెను చాలా బాధపెట్టారట. ఇంతకీ ఆ తప్పు ఏంటి? అసలేం జరిగిందనేదే ఈ కథనం..

యాంకర్ సుమ.. తెలుగమ్మాయి కాకపోయినా పక్కింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులు అందరితో ఎంతో బాగా కలిసి పోయింది. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరను ఏలుతూ తెలుగు ప్రజల మనసు దోచుకుంది. స్టార్ హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా ప్రమోషనల్​ ఈవెంట్​ అంటే ఆమె కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆమె ఎలాంటి ఈవెంట్​ను అయినా సరే తమ వాక్చాతుర్యంతో బాగా హ్యాండిల్ చేస్తుంది.

Rajeev Kanakala Says Sorry To His Wife Suma Kanakala After 25 Years News Goes Viral

ఇక సుమ పర్సనల్ లైఫ్ గురించి తెలిసిందే. ఆమె భర్త సినీ నటుడు రాజీవ్ కనకాల. ఈ మధ్యే వీరు తమ 25వ పెళ్లి రోజును ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుమ తన యూట్యూబ్‌ ఛానల్‌లో తన భర్తతో కలిసి చేసిన ఓ కొత్త వీడియోను షేర్ చేసింది. ఇందులో ఎన్నో ప్రశ్నలకు ఈ జంట సమాధానాలు ఇచ్చారు.

ఆ విషయంలో ఎక్కువగా గొడవలు : మీ పార్ట్నర్ ఫోన్​ చెక్​ చేశారా? అని అడగగా రాజీవ్‌ కనకాల అలా చేయలేదన్నాడు. కానీ సుమ మాత్రం పదేళ్ల క్రితం తాను చెక్​ చేసినట్లు చెబుతూ నవ్వించేసింది. ఇక ఏ విషయంలోనైనా గొడవపడేవారా అన్న ప్రశ్నకు... తాను గర్భవతిగా ఉన్నప్పుడు రాజీవ్‌ దెయ్యాల సినిమాలకు ఎక్కువగా తీసుకెళ్లేవాడని, ఆ విషయంలో ఎక్కువగా గొడవపడేవాళ్లమని సుమ ఆన్సర్ ఇచ్చింది.

సారీ చెప్పిన రాజీవ్‌ : రాజీవ్‌కు ఫోన్‌ చేసినప్పుడల్లా ఇదిగో ఐదు నిమిషాల్లో వచ్చేస్తున్నా అంటూ చాలా ఆలస్యంగా వచ్చేవాడని ఫిర్యాదు చేసింది సుమ. పెళ్లైన ఆరేడేళ్ల వరకు రాజీవ్​ కోసం ఎంతగానో ఎదురు చూసి చూసి చివరకు ఒక్కటే అన్నం తినేసేదాన్నని చెప్పింది. దీంతో అప్పుడు చేసిన పనికి తాను పశ్చాతాప్పపడుతున్నట్లు సారీ చెప్పారు రాజీవ్​. క్షమాపణలు చెప్పగానే సుమ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయింది. ఇక తన పెళ్లిరోజును కూడా గుర్తు చేసుకుంటూ అప్పట్లో తమ ఇంట్లో వ్యతిరేకత ఉన్నా తర్వాత అందరూ ఒప్పుకున్నారని చెప్పింది.

Rajeev Kanakala Says Sorry To His Wife Suma Kanakala After 25 Years News Goes Viral

పెళ్లి సమయంలో తాళి కట్టేటప్పుడు రాజీవ్​ మూడుముళ్లు వేశాక నాలుగో ముడి కూడా వేసేశాడని చెప్పింది సుమ. ఆడపడుచు వేయాల్సిన ముడిని కూడా ఆయనే వేసేశాడని తెలిపింది. ఎంతో కష్టపడి ప్రేమించాను కదా అందుకే ఆ ముడి కూడా నేనే వేస్తానుంటూ అలా చేశాడని చెప్పుకొచ్చింది. ఇంకా ఈ జంట ఈ పెళ్లి రోజు సందర్భంగా తమ యానివర్సరీని.. దగ్గర్లోని వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడే కేక్ కట్ చేసి జరుపుకుంది. అన్నదానం కూడా చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X