అందమైన జీవితంలో మేమిద్దరం ఇలా.. ఆ రూమర్లకు సుమ అలా ఆన్సర్ ఇచ్చేసింది!!

అది బుల్లితెర అయినా, సినిమా ఫంక్షన్లైనా, ఎలాంటి షో అయినా సరే సుమ అడుగుపెడితే ఆ సందడి వేరేలా ఉంటుంది. అయితే వెండితెరపైనా సుమ అలా చటుక్కున మెరిసి మాయమైంది. ఇక తనకు బుల్లితెరే బెస్ట్ అనుకుని ఇక్కడే సెటిలైంది. బుల్లితెరపై యాంకరింగ్ కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేసి మకుటం లేని మహారాణిలా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. వృత్తిపరంగా సుమకు ఎలాంటి బాధలు లేకపోయినా సరే వ్యక్తిగత జీవితం గురించి నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది.

దూరంగా ఉంటున్నారంటూ..

దూరంగా ఉంటున్నారంటూ..

సుమ, రాజీవ్ కనకాల మధ్య కుటుంబ పరమైన సమస్యలు వచ్చాయి. ఆ ఇద్దరూ విడిపోయారు. దూరంగా ఉంటున్నారు. ఇద్దరూ వేర్వేరు ఇంట్లో ఉంటున్నారుఅంటూ ఇలా లెక్కలేనన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అయితే వీటిపై వారిద్దరు గతంలో ఎన్నిసార్లు ఖండించినా వార్తలు రావడం మాత్రం ఆగలేదు.

లాక్‌డౌన్‌లో అలా..

లాక్‌డౌన్‌లో అలా..

అయితే లాక్‌డౌన్‌లోనూ వీరిద్దరు కలిసే ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు. సుమ ఎన్నో వీడియోలను షేర్ చేసింది. వంట చేసుకుంటూ... డ్యాన్సులు చేసుకుంటూ.. ఫాం హౌస్‌లో సందడి చేస్తూ ఇలా ఎన్నో వీడియోలు పెట్టింది. కానీ ఏనాడు రాజీవ్ కనకాల ఉన్నట్టు చూపించలేదు. దీంతో మళ్లీ ఆ వార్తలు ఊపందుకున్నాయి.

 షోతో చెక్ పెట్టేశారు..

షోతో చెక్ పెట్టేశారు..

తాజాగా సుమ హోస్ట్‌గా నిర్వహించే క్యాష్ షోలో రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సమీర్ వంటివారంతా అతిథులుగా విచ్చేశారు. ఆ షోలో సుమ, రాజీవ్ కనకాల మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు. ఎంత అన్యోన్యంగా ఉన్నారో చెప్పకనే చెప్పేశారు. తప్పుడు వార్తలు, రూమర్లను పుట్టించే వారికి కౌంటర్ వేసేశారు.

Recommended Video

Metro Kathalu Movie Actor Thiruveer Special Interview || అలా చేస్తే తప్పు కానీ నటించడం తప్పు కాదు!
తాజాగా సెల్ఫీ..

తాజాగా సెల్ఫీ..

తాజాగా రాజీవ్ కనకాల, సుమ కలిసి ఓ అందమైన సెల్పీ దిగారు. ఇక ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అద్భుతమైన కామెంట్ చేసింది సుమ. అందమైన నేచర్.. అందమైన జీవితం.. అందులో మేమిద్దరం ఇలా ఒకే ఫోటోలో అని తెలిపింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X