Guppedantha Manasu May 7th: రాజీవ్ బతికే ఉన్నాడని క్లారిటీ ఇచ్చిన శైలేంద్ర.. వసు కొత్త ప్లాన్, భయంలో మను!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో శైలేంద్ర తనను చూసిన విషయాన్ని మహేంద్ర వసుకు చెబుతాడు. కారు ఆపి మాట్లాడాడు కూడా అని అంటాడు. సడెన్ గా ఓ చోట ఆగితే నేనెళ్లి వెతికేలోపో సడెన్ గా తన ముందుకు వచ్చాడని.. తమ మీద అనుమానం వచ్చిందని అంటాడు. ఇక మన ప్లాన్ అయిపోయినట్లేనని అంటాడు. రాజీవ్ ఎక్కడున్నాడనేది కచ్చితంగా శైలేంద్రకు తెలిసే ఉంటుందని అనిపిస్తుందని అంటాడు. ఈక్రమంలోనే వసు మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారని.. నాకెందుకో అది రాజీవ్ బావే అనిపిస్తుందని చెబుతాడు. అయితే వీళ్లు మాట్లాడుకునేదంతా.. రాజీవ్ చాటుగా విని వింటాడు. కరెక్టుగా గెస్ చేసింది నా మరదలు అంటూ మురిసిపోతాడు.

ఆ తర్వాత అనుపమ, మహేంద్ర, వసులు పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. అప్పుడే ఎస్సై ఆ డెడ్ బాడీ డీఎన్ఏ రిపోర్ట్ వచ్చిందని చెబుతాడు. ఇప్పటికైనా నా మాట నమ్ముతారా అంటూ అడుగుతాడు. కావాలనే మను డ్రామాలు ఆడుతున్నాడని ఇప్పటికే తేలిపోయిందని అంటాడు. ఇక మనును ఎవరూ కాపాడలేరని, ఈ కేసు నుంచి ఎవరూ బయటపడేయలేరని చెబుతాడు. దీంతో వసు మీరు కేసును ఒకవైపు నుంచే ఆలోచిస్తున్నారని అంటుంది. జడ్జిమెంట్ రాకముందే మనును క్రిమినల్ అనకూడదని వసు అనగా.. చివరకు శిక్ష పడ్డప్పుడు అర్థం అవుతుందంటూ చెప్పి వెళ్లిపోతాడు ఎస్సై. ఆ తర్వాత అనుపమ వసును పిలిచి.. వాడి కళ్లల్లో భయం కనిపిస్తుందని అంటుంది.

Rajeev playing hide and seek behind Mahendra on Guppedantha Manasu May 7th 2024 Episode 1068

నేను వాడిని అలా పెంచలేదని, ధైర్యంగా ఉండాలని చెప్పు అంటుంది. అయినా ఎవరో శిక్ష పడుతుందని చెబితే అంతగా భయపడాలా అని అనగా.. మను మాట్లాడతాడు. అవును భయపడుతున్నాను.. కానీ శిక్ష పడుతుందని కాదు, నా తండ్రి ఎవరో తెలుసుకోలేకపోతున్నానని అంటూ బాధ పడతాడు. ఈక్రమంలోనే వసు మాట్లాడుతూ.. అతి త్వరలోనే మీ తండ్రి ఎవరో మీరు తెలుసుకుంటారని అంటుంది. అలాగే అతి త్వరలోనే మిమ్మల్ని బయటకు తీసుకు వస్తామంటూ చెప్పుకొస్తుంది. ఆ తర్వాత మహేంద్ర మాట్లాడుతూ.. నీ తండ్రి ఎవరో తెలిసే వరకు నేనే నీ తండ్రినని, ఆ బాధ్యతలను నేను చక్కగా నిర్వర్తిస్తానని అంటాడు. ఇక ఆ తర్వాత శైలేంద్రను చూపిస్తారు.

Rajeev playing hide and seek behind Mahendra on Guppedantha Manasu May 7th 2024 Episode 1068

అంతలోనే అటెండర్ వచ్చి ఫైల్లో ఓ సంతకం పెట్టమని అంటాడు. కానీ తను మాత్రం పెట్టనని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత అదే ఫైల్ తీసుకుని వసు వస్తుంది. ఏంటి సంతకం పెట్టనన్నావట అంటూ అడగ్గా.. సార్ అనమంటూ ఫైర్ అవుతాడు శైలేంద్ర. ఇప్పటికే నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాను.. అయినా అది ఇచ్చుపుచ్చుకుంటేనే బాగుంటుందని అంటుంది. సంతకం పెట్టమంటే పెట్టనని అనగా.. మీరు నన్ను ట్రాప్ చేస్తున్నారని అంటాడు శైలేంద్ర. నిన్ను ట్రాప్ చేయాల్సిన అవసరం మాకేంటనగా.. ఆ రాజీవ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలనే ఇదంతా చేస్తున్నారంటూ చెప్పుకొస్తాడు. కానీ వసు మాత్రం.. రాజీవ్ బతికే ఉన్నాడని తెలుసు, అలాగే అతను ఎక్కడున్నాడో కూడా మాకు తెలుసు అంటూ వివరిస్తుంది.

Rajeev playing hide and seek behind Mahendra on Guppedantha Manasu May 7th 2024 Episode 1068

ఇలా చెప్పి వసు వెళ్లిపోగానే శైలేంద్ర రాజీవ్ కు ఫోన్ చేస్తాడు. వసుకు నువ్వు ఎక్కడున్నావో తెలుసు అంటూ అనగా.. అవునా అలా ఎలా తెలుస్తుందని అంటాడు. అయినా నీకు తెలివి లేదా బ్రో.. నువ్వు ఇప్పుడు నాకు ఫోన్ చేశావు కదా నీ ఫోన్ ట్రాప్ చేస్తే అసలు విషయం తెలిసిపోతుంది కదా అంటూ చెప్పుకొస్తాడు రాజీవ్. శైలేంద్ర మాట్లాడుతూనే.. తన భార్య ధరణి ఈ విషయాలు వినడాన్ని చూస్తాడు. ఆ తర్వాత మరోసారి ఫోన్ మాట్లాడుతూ.. నువ్వు బతికి ఉన్నావని వారికి డౌట్ వచ్చిందని అంటాడు. దాక్కోమంటే దాక్కోకుండా... నేరుగా వాళ్ల ఎదుటకు వెళ్లి ఇదంతా చేశావంటూ ఫైర్ అవుతాడు. ఇక మన బండారం అంతా బయట పడబోతుంది అంటూ శైలేంద్ర అనగా.. నేను జాగ్రత్తగానే ఉంటాను, నీవు కూడా జాగ్రత్తగా ఉండు అని రాజీవ్ చెబుతాడు.

Rajeev playing hide and seek behind Mahendra on Guppedantha Manasu May 7th 2024 Episode 1068

చాటుగా ఉండి ఇదంతా విన్న ధరణి వెంటనే వసుధారకు ఫోన్ చేస్తుంది. రాజీవ్ బతికే ఉన్నాడని.. శైలేంద్ర ఇప్పుడు రాజీవ్ తోనే మాట్లాడాడని చెబుతుంది. వారు మాట్లాడింది నాకు అర్థం కాలేదు కానీ చాలా సీక్రెట్ గా మాట్లాడుకున్నారని మధ్యలో వెళ్తే బయటకు పంపించాడని అంటుంది. రాజీవ్ బావ బతికి ఉన్నాడని కన్ఫార్మ్ అయిందని.. కానీ అది నిరూపించేందుకు నాకో సాయం కావాలని మీ ఆయన ఫోన్ లో ఎవరితో మాట్లాడారో ఆ నెంబర్ ఏంటో కనుక్కుని చెప్పమని అడుగుతుంది. దానికి ధరణి సరేనని చెప్పగా.. ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X