twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్యాన్ ఇండియా మూవీగా సైనైడ్.. రాజేశ్ టచ్ రివర్ డైరెక్షన్‌లో ప్రియమణి

    |

    పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల గ్రహీత రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో... జాతీయ పురస్కార గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'సైనైడ్'. మిడిల్ ఈస్ట్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుండగా... హిందీలో ఇదే పోలీసాఫీసర్ పాత్రలో యశ్‌పాల్ శర్మ నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం లో చిత్రంజన్ గిరి, తణికెళ్లభరణి, రాంగోపాల్ బజాజ్, సిజ్జు, శ్రీమాన్, సమీర్, రోహిణి, సంజు శివరామ్, షాజు, ముకుందన్, రిజు బజాజ్ తదితరులు నటిస్తున్నారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. బెంగళూరు, మంగళూరు, మైసూర్, కూర్గ్, మడిక్కెరి, గోవా, హైదరాబాద్, కాసరగోడ్ కీలకమైన షూటింగ్ ప్రదేశాలలో షూటింగ్ కొనసాగుతుంది.

    Rajesh Touchrivers Cyanide as Pan India Movie

    మిడిల్ ఈస్ట్ సినిమా పై.లి. అధినేత ప్రదీప్ నారాయణ్ మాట్లాడుతూ "సైనైడ్ సినిమాకు ప్రారంభం నుంచే మంచి ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది. మలయాళంలో 300కు పైగా చిత్రాల్లో నటించి, రాష్ట్ర పురస్కారాలతో పాటు ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్న సిద్ధిఖ్ మా సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో 'నా బంగారు తల్లి' చిత్రం ద్వారా ఆయన నంది అవార్డు అందుకున్నారు. అలాగే, కన్నడలో దాదాపు 250 చిత్రాలలో నటించి రెండు సార్లు కర్ణాటక రాష్ట్ర అవార్డులను, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్న రంగాయన రఘు... కేరళ రాష్ట్ర పురస్కార గ్రహీత, పలు మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన మణికంఠన్ ఆచారి, మలయాళంలో దాదాపు 150 సినిమాలలో నటించిన శ్రీజిత్ రవి, ప్రశాంత్ అలెగ్జాండర్ ఈ సినిమాలో నటించనున్నారు.

    ఈ సందర్భంగా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత కే నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ "ప్రవాసాంధ్రులైన మేము సినిమాల మీదున్న ఆసక్తితో తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ... దేశ వ్యాప్తంగా చక్కటి సినిమాలను నిర్మించాలనే ఉద్ధేశ్యంతో ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ సంస్థను స్థాపించాం. ప్రియమణితో రాజేష్ టచ్ రివర్ రూపొందిస్తున్న 'సైనైడ్' చిత్రం కథ మమ్మల్ని బాగా ఇన్ఫైర్ చేసింది.సైనైడ్ మోహన్ కేసును అందరూ పేపర్లో చదివే ఉంటారు. కానీ, రాజేష్ టచ్ రివర్ తీసుకున్న పాయింట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకే ఈ సినిమాపై ఆసక్తి కలిగింది అని అన్నారు.

    ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మాట్లాడుతూ "సైనైడ్ మోహన్ సంచలనాత్మక కేసును ప్రేరణగా తీసుకొని 'సైనైడ్' చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. కథాంశానికి వస్తే... 20మంది అమ్మాయిలలో ప్రేమను ప్రేరేపించి, శారీరకంగా అనుభవించాక వారికి 'సైనైడ్' ఇచ్చి వాళ్ల బంగారు ఆభరణాలతో ఉడాయించే సైనైడ్ మోహన్ కేసు ప్రేరణతో ఈ కథ రూపొందించాం" అని అన్నారు.

    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజేష్ టచ్ రివర్
    నిర్మాతలు : ప్రదీప్ నారాయణన్, కే నిరంజన్ రెడ్డి,
    స్పెషల్ ఎఫెక్ట్ మేకప్ మెన్‌: ఎన్.జి. రోషన్
    మాటలు: రవి పున్నం
    పాటలు: డాక్టర్ గోపాల్ శంకర్
    పిఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి
    కంటెంట్ సలహాదారు: పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్

    English summary
    'Cyanide', directed by the winner of several national and international awards director Rajesh Touchriver, stars the National-award winning actress Priyamani in the lead. Middle East Cinema Pvt Ltd and Prime Show Entertainment are producing this promising movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X