twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదంలో తమిళ బిగ్‌బాస్‌.. కమల్‌పై రజనీ ఫ్యాన్స్ ఫైర్

    |

    తమిళ బిగ్‌బాస్‌ సీజన్ 3 గ్రాండ్‌గా జూన్ 23 ఆదివారం ప్రారంభమైంది. రియాలిటి షో మొదలై రెండు రోజులు కాకముందే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో వైరుమండి చిత్రంలోని కమల్ హాసన్, పెట్టా చిత్రంలోని రజనీకాంత్ పోస్టర్ దర్శనమిచ్చాయి. అయితే తొలి ఎపిసోడ్ ముగిసిన తర్వాత రెండో రోజు రజనీకాంత్ పోస్టర్‌ మాయం కావడం వివాదంగా మారింది.

    బిగ్‌బాస్ హౌస్‌లో రజనీకాంత్ పోస్టర్‌ను తొలగించడంతో ఆయన ఫ్యాన్స్ అసంతృప్తికి గురయ్యారు. తలైవాను అగౌరవ పరుస్తారా అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో మండిపడ్డారు. ట్వీట్లు, కామెంట్లతో బిగ్‌బాస్ నిర్వాహకులపై విరుచుకుపడ్డారు. అందుకు కారణం కమల్ హాసన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Rajinikanth poster out from Tamil Bigg Boss

    అయితే రజనీకాంత్ పోస్టర్ తొలగింపుపై నిర్వాహకులు వివరణ ఇచ్చారు. రజనీకాంత్ సిగరెట్ తాగుతున్న పోస్టర్ కావడం తొలగించాం. చట్ట, న్యాయపరమైన సమస్యలు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకొన్నాం. రజనీకాంత్ అంటే మాకు ఎనలేని గౌరవం. ఆయనకు అగౌరవం తెచ్చే పనులు చేయం అని బిగ్‌బాస్ షో నిర్వాహకులు వివరణ ఇచ్చారు.

    తమిళ బిగ్‌బాస్‌లో మూడో సీజన్‌కు 15 మందిని మాత్రమే తీసుకొన్నారు. గతంలో సీజన్ 1 16, సీజన్ 2కు 19 మందిని తీసుకొన్న విషయం తెలిసిందే. అయితే తాజా సీజన్‌లో మరో ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని అన్నారు.

    తమిళ బిగ్‌బాస్ 3లో అభిరామి వెంకటాచలం, చరణ్, శ్రవణన్, ఫాతీమా బాబు, లోస్లియా మారియానేసన్, రేష్మా పసుపులేటి, ముజెన్ రావు, సాండీ, సాక్షి అగర్వాల్, జాంగిరి మధుమతి, కెవిన్, శెరిన్ శ్రీంగార్, మోహన్ వైతా, వనిత విజయ్ కుమార్, దర్శన్ త్యాగరాజన్ ఉన్నారు.

    English summary
    Tamil Bigg Boss landed in Contraversy. Super Star Rajinikanth poster taken out from Tamil Bigg Boss. On this incident, Rajini fans fired in social media. But Bigg Boss team given clarity behind their action
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X