ఈ జన్మకు ఇంతే.. గుక్కపెట్టి ఏడ్చేసిన రాజీవ్ కనకాల

టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ నటుడిగా ఎదిగారు. మరిన్ని చిత్రాల్లోనూ గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. సై, విక్రమార్కుడు, జనతా గ్యారేజీ, మహార్షి, ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ వంటి భారీ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటి వరకు 100 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక రాజీవ్ కనకాల గారి నాన్న దేవదాస్ కనకాల నటనా రంగంలో శిక్షణ ఇచ్చే వారనే సంగతి తెలిసిందే.

ఇటు సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ రాజీవ్ కనకాల మెరుస్తూనే వస్తున్నారు. 1995 నుంచి అటు సినిమాలు, ఇటు సీరియల్స్ ల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. రుతు రాగాలు, శాంతి నివాసం వంటి సీరియల్స్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, డెడ్ పిక్సెల్స్, హోమ్ టౌన్, కాని స్టేబుల్ కనకం వంటి వెబ్ సిరీస్ ల్లో నటించి మెప్పించారు. ఇక తాజాగా ఇంద్రజా జడ్జీగా వ్యవహరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తన చెల్లి గురించి ప్రదర్శించిన వీడియోకు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Rajiv Kanakala Emotional about his Sister

రాజీవ్ కనకాల చెల్లెలు గురించి స్పెషల్ వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల ఎమోషనల్ అయ్యారు. 'అన్నయ్య బాగున్నావా? అంతా బాగుంటే ఈరోజు నీ పక్కనే ఉండి రాఖీ కట్టేదాన్ని అన్నయ్య. అనుకున్న విధంగా అన్నీ జరగవుగా, ఒక్కసారిగా అందరం అమ్మా, నాన్న, నేను నిన్ను వదిలి వెళ్లిపోయాం. ఈ జన్మకి మన బంధం ఇక్కడి వరకే రాసుందేమో అన్నయ్య. వదినా పిల్లలు జాగ్రత్త. అందరినీ అడిగానని చెప్పు. వెళ్లొస్తా.' అని వీడియో ద్వారా రాజీవ్ కనకాల గారికి రాఖీ శుభాకాంక్షలు చెప్పించారు. అయితే ఈ సందర్భంగా తన చెల్లులిని గుర్తు చేసుకొని గుక్క పెట్టి ఏడ్చారు ఆయన.

శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా తన చెల్లెలు భౌతికా లేపోయినా ఇలా వీడియో రూపంలో తనకు రాఖీ కట్టించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. ఇక అక్కలు, చెల్లులు ఉన్న వారందరూ ఎన్ని గొడవలు ఉన్నా కూడా వారితో రాఖీ కంట్టించుకోవడమే కాకుండా, వారికి జీవితాంతం అండగా నిలవాలని కోరారు. దాంతో ఆడబిడ్డలు ధైర్యంగా ఉంటారని చెప్పారు. ఇక తన జీవితంలో పెద్ద సమస్యలు వచ్చిన ప్రతిసారి తన చెల్లెలు కనకాల శ్రీలక్ష్మి ముందుండి పరిష్కరించేందని చెబుతూ భావోద్వేగమయ్యారు. ఇప్పుడు నాకు ఆ అవకాశం లేదు.

'నా జీవితంలో భార్య, పిల్లలు ఉండవచ్చు కానీ తోడబుట్టిన బంధం లేదు. అమ్మా లేదు, నాన్న లేదు. దయచేసి మీకు అలాంటి బంధాలుంటే గౌరవించండి. వారికి రక్షణగా ఉండండి . ఇదే నాకున్న రిక్వెస్ట్. ఇక నా చేతుల్లోనే నా చెల్లులు చనిపోవడం నా గుండెల్ని పిసికేసినట్టు అనిపించింది. ఒక్కసారిగా ఆ వీడియో చూడటం ఇంకా గుండెలో బాధ తన్నుకొచ్చింది.' అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X