సుమకు బిగ్ షాక్ ఇచ్చిన రాజీవ్ కనకాల.. భర్త చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చేసింది.!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెరపై దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవాను చూపిస్తోంది యాంకర్ సుమ. అద్భుతమైన టాలెంట్‌తో నెగ్గుకొస్తూ ఎన్నో ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. ఒకపక్క గ్లామర్‌తో కొత్త కొత్త యాంకర్లు పోటీ ఇస్తున్నా... తన ప్రత్యేకమైన నైపుణ్యంతో వాళ్లందరినీ వెనక్కి నెట్టేస్తోంది. ఈ క్రమంలోనే మరిన్ని షోలు, ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక, పర్సనల్ లైఫ్‌లోనూ పర్ఫెక్ట్‌గా ఉన్న సుమకు.. భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా భర్త రాజీవ్ కనకాల ఆమెకు కోలుకోలేని షాకిచ్చాడు. దీంతో ఈ యాంకర్ కన్నీటి పర్యంతం అయింది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే....

ఆల్‌రౌండర్‌గా గుర్తింపు.. అందుకే టాప్ ప్లేస్

ఆల్‌రౌండర్‌గా గుర్తింపు.. అందుకే టాప్ ప్లేస్

తెలుగు బుల్లితెరపై లోకల్ అమ్మాయిలు యాంకర్లుగా హవా చూపిస్తున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి... తక్కువ వ్యవధిలోనే మంచి గుర్తింపును తెచ్చుకుందీ మలయాళీ భామ సుమ. వివాహం తర్వాత ఆమె తెలుగులో చాలా పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే యాంకర్‌గా టాప్ ప్లేస్‌లోకి వెళ్లింది. అదే సమయంలో అన్నీ విద్యలనూ చూపిస్తూ ఆల్‌రౌండర్ అనిపించుకుంటోంది.

అందరికీ సుమే కావాలి... అన్నీ చోట్లా ఆమె

అందరికీ సుమే కావాలి... అన్నీ చోట్లా ఆమె

వరుస షోలతో బిజీ బిజీగా గడుపుతోన్న సుమ... మరిన్ని ఆఫర్లు అందుకుంటూ ముందుకెళ్తోంది. మరీ ముఖ్యంగా టీవీ షోలతో పాటు సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లను ఆమెనే హోస్ట్ చేస్తోంది. సుమకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ వల్లే ఇది సాధ్యమవుతోంది. ఇవి మాత్రమే కాదు... వ్యాపార ప్రకటనలో పాటు యూట్యూబ్ వీడియోలతో సత్తా చాటుతోందీ టాప్ యాంకర్.

ఎంత పేరున్నా... అక్కడ మాత్రం మిస్సింగ్

ఎంత పేరున్నా... అక్కడ మాత్రం మిస్సింగ్

సుమకు యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్, డైలాగ్ డెలివరీ సహా పలు అంశాల్లో బాగా పట్టున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత టాలెంట్, ఫేమ్ ఉన్నా ఆమె మాత్రం సినిమాల్లో నటించడం లేదు. కెరీర్ ఆరంభంలో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ... ఇప్పుడు మాత్రం ఆ వైపు తిరిగి చూడడం లేదు. అయితే, ఆ మధ్య ‘విన్నర్' మూవీ కోసం ఓ పాటను పాడింది సుమ.

పర్సనల్‌ లైఫ్‌లో కూడా సూపర్ సక్సెస్

పర్సనల్‌ లైఫ్‌లో కూడా సూపర్ సక్సెస్

సుమ... నటుడు రాజీవ్ కనకాలను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలం పాటు ప్రేమించుకున్న ఈ జంట... పెద్దల అంగీకారంతో అగ్నిసాక్షిగా ఒక్కటైంది. అప్పటి నుంచి పర్సనల్ లైఫ్ చూసుకుంటూనే కెరీర్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది. ఇద్దరు పిల్లల తల్లైనా సరే సుమ తన బాధ్యతలను సక్రమంగా చేసుకుంటూ బెస్ట్ ఉమెన్ అనిపించుకుంటోంది.

అతడిని ఓ ఆట ఆడుకున్న సెలెబ్రిటీలు

అతడిని ఓ ఆట ఆడుకున్న సెలెబ్రిటీలు

సుమ ప్రస్తుతం హోస్ట్ చేస్తున్న షోలలో ‘క్యాష్' ఒకటి. ఇందులో సినీ, టెలివిజన్ ప్రముఖులు గెస్టులుగా వస్తారు. ఈ క్రమంలోనే వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు రాజీవ్ కనకాల, సమీర్, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ వచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటోంది. ఇందులో బ్రహ్మాజీని సుమతో పాటు అందరూ ఆడుకున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ సందడిగా సాగింది.

సుమకు బిగ్ షాక్ ఇచ్చిన రాజీవ్ కనకాల

సుమకు బిగ్ షాక్ ఇచ్చిన రాజీవ్ కనకాల

‘ఇది చేసి నా జీవితంలో చాలా మంచి పని చేశాను అని దేని గురించి చెబుతారు' అంటూ సుమ... రాజీవ్ కనకాలను ప్రశ్నించింది. దీనికి ‘యాక్టర్ అవడమే నేను చేసిన మంచి పని' అని అతడు సమాధానం చెప్పాడు. దీంతో సుమ షాక్‌కు గురైంది. అంతేకాదు, కాసేపు నోట్లో నుంచి మాట కూడా రాలేదు. ఆ పక్కనే ఉన్న వాళ్లు కూడా రాజీవ్‌కు సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేశారు.

Recommended Video

Metro Kathalu Movie Actor Thiruveer Special Interview || అలా చేస్తే తప్పు కానీ నటించడం తప్పు కాదు!
భర్త చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చేసింది.!

భర్త చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చేసింది.!

ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఎంతో సరదాగా సాగిందని ప్రోమోను చూస్తే అర్థం అవుతోంది. అయితే, చివర్లో రాజీవ్ కనకాల, సుమ మధ్య భావోద్వేగ సన్నివేశాలు కూడా కనిపించడంతో ఈ ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగిపోయింది. తనను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎంతో మంచిగా చూసుకుంటోన్న భర్త.. తన షోకు రావడంతో ఆనందం పట్టలేక సుమ అతడిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X