For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుమతో విభేదాలు గురించి రాజీవ్ కనకాల క్లారిటీ.. అందుకే దూరంగా అంటూ షాకింగ్ కామెంట్స్!

  |

  వార్తలు లేనపుడల్లా ఏదో ఒక రకమైన వార్తలు పుట్టిస్తూ ఉంటారు కొందరు. అలా ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు టీవీ సెలబ్రిటీల గురించి అనేక వార్తలు పుట్టిస్తూ ఉంటారు. ఈ కోవలోనే టెలివిజన్లో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ తన భర్త రాజీవ్ కనకాల తో విడిపోయారని వారిద్దరి విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది. తాజాగా ఆ ప్రచారం మీద రాజీవ్ కనకాల ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
  మళ్ళీ విడాకులు

  మళ్ళీ విడాకులు

  సుమ కనకాల అనే పేరు తెలియని తెలుగువాడు ఉండడు.. అంతలా ఆమె టెలివిజన్ లో యాంకర్ గా అనేక షోలు నిర్వహిస్తూ బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు యాంకరింగ్ నిర్వహించే స్థాయికి వెళ్లారు. నిజానికి వీరిద్దరూ ఒక సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరికొకరు ఇష్టపడి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి అన్యోన్య దంపతులుగా వస్తున్న వీరి ప్రేమకు గుర్తుగా రోషన్, మనస్విని అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.

  నారప్పలో ఫుల్ లెంత్ రోల్

  నారప్పలో ఫుల్ లెంత్ రోల్


  అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అని చాలా రోజులుగా వీరిద్దరూ కలిసి కూడా ఉండటం లేదని ప్రచారం జరుగుతోంది. గత ఏడాది రాజీవ్ కనకాల పుట్టిన రోజు సందర్భంగా తాము ఇద్దరం కలిసి ఉన్న ఫోటో షేర్ చేసిన సుమ కనకాల ఈ పుకార్లకు కాస్త బ్రేకులు వేశారు. అయితే మళ్లీ ఈ విడాకులకు సంబంధించిన పుకార్లు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా రాజీవ్ కనకాల నారప్ప సినిమా లో బసవయ్య అనే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు.

  అసలు ఏమైంది

  అసలు ఏమైంది

  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమయంలో అనేక మంది యాంకర్లు ఈ విడాకుల విషయాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అయితే రాజీవ్ కనకాల కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రతి ఇంటర్వ్యూలో కూడా అసలు తమ మధ్య ఏం జరిగింది ? ఏం జరుగుతుంది ? అనే విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తాము ఇద్దరం కలిసి ఉండటం లేదు అనే విషయాల మీద కూడా ఆయన స్పందిస్తూ తన సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

  అసలు ఎందుకు విడిగా ఉన్నామంటే

  అసలు ఎందుకు విడిగా ఉన్నామంటే


  నిజానికి అమ్మ నాన్న కలిసి మణికొండలో ఉన్న తమ సొంత ఇంట్లో ఉండేవారని, అమ్మ చనిపోయాక తన తండ్రి ఒక్కరే మణికొండ నివాసంలో ఉండేవారని చెప్పుకొచ్చారు. అయితే ఆయనను మా ఇంటికి తీసుకు రావాలని అనుకున్నా ఆయనతో పాటు ఉన్న లైబ్రరీ చాలా పెద్దదని వాటన్నింటినీ మా ఫ్లాట్ కి షిఫ్ట్ చేయడం అంటే కుదరదు కాబట్టి తండ్రికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటికి దూరంగా ఆయనతోపాటు ఉండేవాడినని చెప్పుకొచ్చారు. అలాగే వీలు కుదిరినప్పుడల్లా సుమ, పిల్లల దగ్గరికి వెళ్లి చూసి వచ్చే వాడినని, దీనికి విడిపోయాం అంటూ పుకార్లు పుట్టించడం సరికాదని చెప్పుకొచ్చారు.

  సంపాదన ఎక్కువని

  సంపాదన ఎక్కువని


  ఇక సుమ సంపాదన ఎక్కువగా ఉండడం రాజీవ్ కనకాల సినిమాలు కాస్త తగ్గడంతో ఆయన సంపాదనలో వెనకబడటం కారణంగా విభేదాలు వచ్చాయని జరుగుతున్న ప్రచారం మీద కూడా ఆయన ఆసక్తికరంగా స్పందించారు. అసలు మా మధ్య ఇలాంటి ప్రస్తావనే రాదన్న ఆయన సుమ యాంకర్ గా బిజీ కాకముందు తాను అనేక సినిమాల్లో నటించి ఆస్తులు బాగానే కూడ పెట్టాను అని అన్నారు. అలా మాట్లాడుతుంటే ఇవి కూడా మాట్లాడాలి కదా అని చెప్పుకొచ్చారు. అయితే అసలు తమ మధ్య ఇలాంటి వ్యవహారాలు ఏవి చర్చకు రావని ఆయన వెల్లడించారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని తాము ఎప్పుడూ కలిసి ఉంటామని చెప్పుకొచ్చారు.

  English summary
  there are some Rumours about Rajeev Kanakala and his celebrated anchor wife Suma. The actor has now opened up about the issue once again, and clarified.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X