అవును జబర్దస్త్‌లోకి తాగేసి వెళ్ళాను.. పొట్టి నరేష్ నా పిలక పట్టుకోగానే.. జరిగింది ఇదే: రాకేష్ మాస్టర్

తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ కామెడీ షోగా గుర్తింపు అందుకున్న జబర్దస్త్ రేటింగ్ ఈ మధ్య బాగా తగ్గుతున్నట్లు టాక్ వచ్చింది. అందుకే ఆ షోలోకి కొత్త తరహా ఆర్టిస్టులు రంగంలోకి దిగుతున్నారు. ఆ మధ్య అవినాష్ బయటకు వెళ్లిపోగానే అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇటీవల జబర్దస్త్ లోకి రాకేష్ మాస్టర్ వెళ్లడం బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ రోజు సెట్ పైకి తాగేసి వెళ్లినట్లు రాకేష్ వివరణ ఇచ్చాడు.

ఒకప్పుడు బిజీ కొరియోగ్రాఫర్ గా..

ఒకప్పుడు బిజీ కొరియోగ్రాఫర్ గా..

15 ఏళ్ళ క్రితం పలు మీడియం బడ్జెట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన రాకేష్ మాస్టర్ ఇండస్ట్రీలో దాదాపు అందరికి సుపరిచితమే. వైవిఎస్ చౌదరి సినిమాలకు అలాగే కెరీర్ మొదట్లో అల్లరి నరేష్, వేణు తొట్టెంపూడి సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. రవితేజ సినిమాలకు కూడా వర్క్ చేశాడు.

శేఖర్ మాస్టర్ గురువుగా..

శేఖర్ మాస్టర్ గురువుగా..

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ కొరియోగ్రాఫర్స్ కు ఒకప్పటి గురువు రాకేష్ మాస్టర్. శేఖర్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ శిష్యుడే. అయితే వీరి మధ్య కొన్ని విబేధాలు రావడం మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. గురువు అయినప్పటికీ తనను కావాలనే శేఖర్ దూరం పెట్టినట్లు చాలా ఇంటర్వ్యూలలో ఆయన ఎమోషనల్ అయ్యారు.

పొట్టి నరేష్ పిలక పట్టుకోవడం

పొట్టి నరేష్ పిలక పట్టుకోవడం

ఇక యూ ట్యూబ్ ఛానెల్స్ లో రెగ్యులర్ గా ఇంటర్వ్యూలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్న రాకేష్ మాస్టర్ పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అయితే జబర్దస్త్ లో బుల్లేట్ భాస్కర్ టీమ్ లో అతను చేసిన ఒక స్కిట్ బాగా వైరల్ అయ్యింది. అందులో పొట్టి నరేష్ మాస్టర్ పిలక పట్టుకొని లేపడం హాట్ టాపిక్ గా నికిచింది.

తాగేసి జబర్దస్త్ లోకి వెళ్ళాను

తాగేసి జబర్దస్త్ లోకి వెళ్ళాను

అయితే ఆ రోజు తాను తాగేసి షూటింగ్ కు వెళ్లినట్లు రాకేష్ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. తనలో మంచి నటుడు ఉన్నాడని గ్రహించిన బుల్లెట్ భాస్కర్ అడ్వాన్స్ ఇచ్చేసి స్కిట్ లో నటించాలని చెప్పినట్లు వివరణ ఇచ్చారు. అయితే ఆ రోజు కొన్ని కారణాల వల్ల అనుకోకుండా తాగేసి ఉన్నట్లు చెప్పారు.

Recommended Video

Gatham Actress Poojitha About Her Acting Experience
నేను ఫీల్ అవ్వలేదు

నేను ఫీల్ అవ్వలేదు

తాగేసి ఉన్నాను. నేను సెట్ పైకి రాలేనని చెప్పినప్పటికీ ఎవరు వినలేదు. కానీ చివరికి మత్తులోనే నటించక తప్పలేదు. నరేష్ నా జుట్టు పట్టుకోవడం వలన నేను ఫీల్ అవ్వలేదు. అది కేవలం ఒక నటన మాత్రమే.. దాన్ని నేను తప్పుగా అనుకోను అని ఇంటర్వ్యూలో క్లారిటి ఇచ్చారు. ఇక రాకేష్ మాస్టర్ ను తీసుకోవద్దని చెప్పినప్పటికీ బుల్లెట్ భాస్కర్ నాపై అభిమానంతో తీసుకొని ఆర్థికంగా కూడా కొన్నిసార్లు సహాయం చేశాడని రాకేష్ మాస్టర్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X