Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ బాబు 50లక్షల సెటిల్మెంట్.. సాక్రిఫైజ్ స్టార్ సునిశిత్‌ను చితకబాదిన డ్యాన్స్ మాస్టర్
సోషల్ మీడియాలో కొన్నికొన్ని సార్లు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో అస్సలు అర్థం కాదు. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కాంట్రవర్సీ అయినా.. విషయం ఏదైనా ఫైనల్ గా సెలబ్రేటీ ముద్ర వేసుకోవడం కామన్ అయిపోయింది. ఇక శాక్రిఫైజ్ స్టార్ గురించి నెటిజన్లకు స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ మధ్య హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి కూడా చేసుకున్నట్లు కామెంట్ చేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి వచ్చాడు. అయితే ఇటీవల ఒక ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అతన్ని ఇంటర్వ్యూలోనే చితకబాదాడు.
తొక్కేశారు అంటూ..
మొదట కొన్ని యూ ట్యూబ్ ఇంటర్వ్యూలతో ఫెమాస్ అయిన సునిశిత్ అనంతరం శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గా పేరు మార్చుకున్నాడు. ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా తనను తొక్కేశారని ఎన్టీఆర్జ్ మహేష్ బాబు వంటి స్టార్స్ తనకు రావాల్సిన సినిమాలను రానివ్వకుండా చేశారని ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశాడు.
లావణ్య త్రిపాఠిపై కామెంట్స్ చేయడంతో..
ఇక తనకు చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్నాయని కొందరితో పెళ్లి వరకు కూడా వెళ్లినట్లు చెప్పాడు. ఇక మరికొందరు ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇక లావణ్య త్రిపాఠితో కూడా డేటింగ్ అనంతరం పెళ్లి అయ్యిందని చెప్పడంతో ఆమె అనుచరులు పొలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అప్పుడు సునిశిత్ పొలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది.
సుకుమార్ తో సినిమా..
ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ వన్ నేనొక్కడినే సినిమా కథను ముందు తనకే చెప్పాడని నాన్నకు ప్రేమతో కూడా తన నుంచి లాగేసుకున్నారని చెప్పడంతో అప్పట్లో సోషల్ మీడియాలో ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. యూ ట్యూబ్ లో అతనికి సంబంధించిన వీడియోలు బాగానే ట్రెండ్ అయ్యాయి.
ఇంటర్వ్యూలోనే చితకబాదాడు.
ఇక ఇటీవల రాకేష్ మాస్టర్ అతని మాటలకు చిరాకు పడి ఇంటర్వ్యూలోనే చితకబాదాడు. మహేష్ బాబు 1 నేనొక్కడినే కథను ముందుగా తనకే చెప్పారని సగం షూటింగ్ కూడా జరిగిందని చెప్పాడు. ఇక మహేష్ బాబు 50లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకొని తనను తప్పించినట్లు వివరణ ఇచ్చాడు.
మహేష్ బాబు ఇచ్చిన డబ్బుతో
శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ మాటలకు విసుగెత్తి పోయిన రాకేష్ మాస్టర్ అతన్ని బెత్తంతో కొట్టాడు. చెంపలపై, నెత్తిపై ఇష్టం ఉన్నట్లుగా వాయించేశారు. అయినప్పటికీ శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ మాటల తీరు మారలేదు. ఇక మహేష్ బాబు ఇచ్చిన 50 లక్షలతో ఒక BMW కారు కొనుక్కున్నట్లు చెప్పడంతో రాకేష్ మాస్టర్ అతనిపై మరోసారి చేయి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.