twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంటిపై రాకేష్ మాస్టర్ కామెంట్స్.. జఫ్పా అంటూ స్కిట్ చేయడంపై రియాక్షన్

    |

    రాకేష్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అదే విధంగా జబర్దస్త్‌లో వేసే సెటైర్లు, ఇమిటేషన్‌ల గురించీ చెప్పనక్కర్లేదు. రాకేష్ మాస్టర్‌ను జబర్దస్త్ టీం లీడర్స్ బాగానే వాడుకుంటున్నారు. ఆ మధ్య హైపర్ ఆది, రీసెంట్‌గా చంటి ఫుల్ వాడేసుకున్నారు. రాకేష్ మాస్టర్ మ్యానరిజం, గెటప్‌లతో సెటైర్స్ వేశారు. వీటిపై రాకేష్ మాస్టర్ సైతం స్పందించాడు.

    గతిలేని టీవీ..

    గతిలేని టీవీ..

    చెల్లమ్మకు పెళ్లంటా అన్నయ్యకు సంబరమంటా అంటూ హైపర్ ఆది పంచ్ వేశాక.. చంటి కూడా రాకేష్ మాస్టర్‌పై కసి తీర్చుకున్నాడు. తన స్కిట్‌లో భాగంగా బుల్లెట్ భాస్కర్ గతి లేని టీవీలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి. ఈ క్రమంలోనే ‘చంటి మాస్టర్'ను ఆహ్వానిస్తాడు. ఇక చంటి సైతం రాకేష్ మాస్టర్‌లా పిలక పెట్టుకోవడం, మ్యానరిజాన్ని వాడటం వైరల్ అయింది.

    జఫ్ఫా అంటూ..

    జఫ్ఫా అంటూ..

    రాకేష్ మాస్టర్ ఊత పదం జఫ్ఫా. ఆయన తన ఇంటర్వ్యూల్లో ఎక్కువగా వాడేది అదే. కొత్త కొత్తగా తిట్టడంలోనూ రాకేష్ మాస్టర్ దిట్టే. అయితే ఆ జఫ్పాను చంటి బాగా పట్టాడు. స్కిట్ మొత్తంలో ఆ ఒక్క పదాన్నే బాగా హైలెట్ చేశాడు. బుల్లెట్ భాస్కర్, షకలక శంకర్‌లపై తిట్ల వర్షాన్ని కురిపించాడు.

    రాకేష్ మాస్టర్ రియాక్షన్..

    రాకేష్ మాస్టర్ రియాక్షన్..

    ఇక వీటిపై తాజాగా రాకేష్ మాస్టర్ స్పందించాడు. తనను ఇమిటేట్ చేయడంపై రాకేష్ మాస్టర్ లైట్ తీసుకున్నాడు. రోజా కూడా మనోకు ఏదో చెబుతోందని, మొత్తానికి తనను బాగానే ఫాలో అవుతున్నారని, తనను ఇమిటేట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నాడు.

    ఆ ఒక్కటి మాత్రమే..

    ఆ ఒక్కటి మాత్రమే..


    చంటి కూడా బాగానే ప్రయత్నించాడని మెచ్చుకున్నాడు. అయితే జఫ్పా అనే ఒక్క పదం మాత్రమే బాగా పలికాడని, ఇంకా వాయిస్‌లో బేస్ ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చాడు. ఇలా తన మీద వేసిన కౌంటర్లను కూడా రాకేష్ మాస్టర్ స్పోర్టీవ్‌గా తీసుకోవడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

    English summary
    Rakesh Master Comments On Jabardasth Chanti. Jabardasth Chanti Imitates Rakesh Master In His Skit. in his lates skil chanti satirically imitates Rakesh Master.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X