Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చంటిపై రాకేష్ మాస్టర్ కామెంట్స్.. జఫ్పా అంటూ స్కిట్ చేయడంపై రియాక్షన్
రాకేష్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అదే విధంగా జబర్దస్త్‌లో వేసే సెటైర్లు, ఇమిటేషన్‌ల గురించీ చెప్పనక్కర్లేదు. రాకేష్ మాస్టర్‌ను జబర్దస్త్ టీం లీడర్స్ బాగానే వాడుకుంటున్నారు. ఆ మధ్య హైపర్ ఆది, రీసెంట్గా చంటి ఫుల్ వాడేసుకున్నారు. రాకేష్ మాస్టర్ మ్యానరిజం, గెటప్‌లతో సెటైర్స్ వేశారు. వీటిపై రాకేష్ మాస్టర్ సైతం స్పందించాడు.
గతిలేని టీవీ..
చెల్లమ్మకు పెళ్లంటా అన్నయ్యకు సంబరమంటా అంటూ హైపర్ ఆది పంచ్ వేశాక.. చంటి కూడా రాకేష్ మాస్టర్‌పై కసి తీర్చుకున్నాడు. తన స్కిట్లో భాగంగా బుల్లెట్ భాస్కర్ గతి లేని టీవీలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి. ఈ క్రమంలోనే ‘చంటి మాస్టర్'ను ఆహ్వానిస్తాడు. ఇక చంటి సైతం రాకేష్ మాస్టర్లా పిలక పెట్టుకోవడం, మ్యానరిజాన్ని వాడటం వైరల్ అయింది.
జఫ్ఫా అంటూ..
రాకేష్ మాస్టర్ ఊత పదం జఫ్ఫా. ఆయన తన ఇంటర్వ్యూల్లో ఎక్కువగా వాడేది అదే. కొత్త కొత్తగా తిట్టడంలోనూ రాకేష్ మాస్టర్ దిట్టే. అయితే ఆ జఫ్పాను చంటి బాగా పట్టాడు. స్కిట్ మొత్తంలో ఆ ఒక్క పదాన్నే బాగా హైలెట్ చేశాడు. బుల్లెట్ భాస్కర్, షకలక శంకర్‌లపై తిట్ల వర్షాన్ని కురిపించాడు.
రాకేష్ మాస్టర్ రియాక్షన్..
ఇక వీటిపై తాజాగా రాకేష్ మాస్టర్ స్పందించాడు. తనను ఇమిటేట్ చేయడంపై రాకేష్ మాస్టర్ లైట్ తీసుకున్నాడు. రోజా కూడా మనోకు ఏదో చెబుతోందని, మొత్తానికి తనను బాగానే ఫాలో అవుతున్నారని, తనను ఇమిటేట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నాడు.
ఆ ఒక్కటి మాత్రమే..
చంటి
కూడా
బాగానే
ప్రయత్నించాడని
మెచ్చుకున్నాడు.
అయితే
జఫ్పా
అనే
ఒక్క
పదం
మాత్రమే
బాగా
పలికాడని,
ఇంకా
వాయిస్‌లో
బేస్
ఉంటే
బాగుండేదని
చెప్పుకొచ్చాడు.
ఇలా
తన
మీద
వేసిన
కౌంటర్లను
కూడా
రాకేష్
మాస్టర్
స్పోర్టీవ్‌గా
తీసుకోవడంపై
ప్రశంసలు
కురుస్తున్నాయి.