For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి కాంట్రవర్శీ కింగ్.. ఆయన ఎంటరైతే గొడవలు ఖాయం

  |

  ఎలాంటి వివాదాస్పద పరిణామాలు లేకుండా అప్పటి వరకూ సాదాసీదాగా సాగిపోతోన్న తెలుగు బుల్లితెరను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్న ఏకైక షో బిగ్ బాస్. సరికొత్త కాన్సెప్టుతో వచ్చే కార్యక్రమమే అయినా.. ఇక్కడి ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో మద్దతును అందించారు. దీంతో ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది. ఫలితంగా నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదు సీజన్లను కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే ఒక బిగ్ సెలెబ్రిటీ పేరు లీకైంది. ఆ వివరాల్లోకి వెళ్తే....

  సంచలనంగా మారిన తెలుగు షో

  సంచలనంగా మారిన తెలుగు షో

  బిగ్ బాస్ హిందీలో చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. ఆ తర్వాత ఇది ఎన్నో ప్రాంతీయ భాషల్లోకి పరిచయం అయింది. ఇలా ఆరేళ్ల క్రితమే తెలుగులోకి కూడా వచ్చింది. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో దాన్ని నాని, మూడు నుంచి ఐదు వరకూ నాగార్జున హోస్ట్ చేశారు. ఇవన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌ను పూర్తి చేశారు.

  ఆ భాగాలను చూపిస్తూ పాయల్ వీడియో: అమె వేసుకున్న డ్రెస్ చూశారంటే!

  ఆరో సీజన్‌ రెడీగా.. కామన్ మ్యాన్

  ఆరో సీజన్‌ రెడీగా.. కామన్ మ్యాన్

  తెలుగులో ఎంతో సక్సెస్ అయిన బిగ్ బాస్ వరుస సీజన్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఆరో దాన్ని వచ్చే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నాడు. ఇక, దీనికి సంబంధించిన ప్రోమోను త్వరలోనే షూట్ చేయబోతున్నట్లు తెలిసింది. దీన్ని ఆగస్టులో వదలబోతున్నారు.

  సెట్ వర్క్ ఇలా... ఒకరు ఎంపిక

  సెట్ వర్క్ ఇలా... ఒకరు ఎంపిక

  బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్‌లోనూ ఒక్కో రకమైన హౌస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి సీజన్ మినహా మిగిలిన అన్నింటికీ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశారు. ఇప్పుడు ఆరో సీజన్ కోసం కూడా అక్కడే బిగ్ బాస్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. మరోవైపు, ఈ సీజన్ కోసం ఓ కామన్ మ్యాన్‌ను తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆ ఎంపిక ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయింది.

  శృతి మించిన రష్మిక అందాల ఆరబోత: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు

  కంటెస్టెంట్ల సెలెక్షన్ ప్రాసెస్‌లో

  కంటెస్టెంట్ల సెలెక్షన్ ప్రాసెస్‌లో

  బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ ఎంపిక ప్రక్రియ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇందులో భాగంగానే మొదట జూమ్ కాల్ ద్వారా కొందరు సెలెబ్రిటీలను కూడా సీక్రెట్‌గా ఇంటర్వ్యూలు చేశారు. ఆ తర్వాత షార్ట్ లిస్టును రెడీ చేసి వాళ్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

  బడా.. స్మాల్ సెలెబ్రిటీల పేర్లతో

  బడా.. స్మాల్ సెలెబ్రిటీల పేర్లతో

  వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి.. ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి చాలా వివరాలు లీక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలెబ్రిటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో బడా సెలెబ్రిటీలతో పాటు కొందరు చిన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు.

  భర్తపై పడుకుని నిహారిక ముద్దులు: క్లిప్ లీక్ చేసిన చిరంజీవి కూతురు.. ఏం రాసిందో చూస్తే!

  బిగ్ బాస్‌లోకి కాంట్రవర్శీ కింగ్

  బిగ్ బాస్‌లోకి కాంట్రవర్శీ కింగ్


  బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఎన్నో పేర్లు వైరల్ అవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సారి కాంట్రవర్శీ సెలెబ్రిటీలను తీసుకోవాలని చూస్తున్నారట. ఇందులో భాగంగానే నిత్యం వివాదాలతో సహవాసం చేస్తోన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ రాకేష్ మాస్టర్‌ను తీసుకున్నారని తెలిసింది.

  Recommended Video

  Ott చేస్తున్న దారుణం, పైరసీ ను ఎలా పెంచుతుంది అంటే? *Entertainment | Telugu OneIndia
  ఆయన వస్తే గొడవలు ఖాయం

  ఆయన వస్తే గొడవలు ఖాయం

  టాలీవుడ్‌లో చాలా కాలం పాటు రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా, యాక్టర్‌గా పని చేశారు. అయితే, ఆయన ఈ మధ్య కాలంలో ఎవరిని పడితే వాళ్లను తిడుతూ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్నారు. దీంతో ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాకేష్ మాస్టర్ హౌస్‌లోకి వస్తే.. ఓ రేంజ్‌లో గొడవలు పెట్టుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

  English summary
  Bigg Boss Telugu Team Planing for 6th Season From September. Recently Bigg Boss Team Approached Rakesh Master For This Season.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X