వాళ్లిద్దరూ రష్మీని బాగా ఇబ్బంది పెట్టారు.. ఆ అమ్మాయిలందరిదీ అదే పరిస్థితి: రాకేష్

By Manoj

తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతున్న యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. చాలా కాలం క్రితం సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె... చిన్న చిన్న పాత్రలను చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న కామెడీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. అనంతరం ఎన్నో సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఇలా ఏకకాలంలో టీవీ షోలు... సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మీ గౌతమ్‌ ఇద్దరు ప్రముఖులు బాగా ఇబ్బంది పెట్టారని ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరా ఇద్దరు.? పూర్తి వివరాల్లోకి వెళితే....

సినిమాలతో నో యూజ్.. దానితో పెరిగిన క్రేజ్

సినిమాలతో నో యూజ్.. దానితో పెరిగిన క్రేజ్


రష్మీ గౌతమ్ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం దక్కించుకుంది. కానీ, ఆమెకు గుర్తింపు మాత్రం దక్కలేదు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘జబర్ధస్త్'కు యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె కెరీర్ మలుపు తిరిగింది. దీంతో ఎనలేని క్రేజ్ సంపాదించింది.

కమెడియన్‌తో ప్రేమాయణం.. ఫుల్ ఫేమస్

కమెడియన్‌తో ప్రేమాయణం.. ఫుల్ ఫేమస్


జబర్ధస్త్‌కు పని చేస్తున్న క్రమంలోనే రష్మీ గౌతమ్‌కు సుడిగాలి సుధీర్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. వీళ్లిద్దరూ కలిసి తరచూ స్కిట్లు చేయడం కారణంగానూ ఈ వార్తలకు బలం చేకూరుతోంది. అటు రష్మీ.. ఇటు సుధీర్ ఈ వార్తలను ఖండించినప్పటికీ... ఏమాత్రం ప్రయోజనం లేదు. పైగా వీళ్లపై పుకార్లు మరింత ఎక్కువయ్యాయి.

మలుపు తిప్పిన సినిమా.. మైమరపించింది

మలుపు తిప్పిన సినిమా.. మైమరపించింది


టీవీ షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్న సమయంలోనే రష్మీ సినిమా అవకాశాలను కూడా అందుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్' అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె గ్లామరస్ పాత్ర చేసింది. రష్మీ కెరీర్‌లో ఈ సినిమా మాత్రమే చెప్పుకోదగ్గ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి.

ఎప్పుడూ అక్కడే... రష్మీ దృష్టి వాటి పైనే

ఎప్పుడూ అక్కడే... రష్మీ దృష్టి వాటి పైనే


సినిమాలు, టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్నప్పటికీ... రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. అదే సమయంలో సమాజంలో జరుగుతున్న అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తోంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది.

రష్మీ పర్సనల్‌ లైఫ్‌పై షాకింగ్ కామెంట్స్

రష్మీ పర్సనల్‌ లైఫ్‌పై షాకింగ్ కామెంట్స్


కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ... సినీ సెలెబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న ఆయన.. ఈ మధ్య తరచూ ఏదో ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రష్మీ గౌతమ్ పర్సనల్‌ లైఫ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడాయన.

వాళ్లిద్దరూ రష్మీని బాగా ఇబ్బంది పెట్టారు

వాళ్లిద్దరూ రష్మీని బాగా ఇబ్బంది పెట్టారు

రష్మీ గురించి మాట్లాడుతూ... ‘నేను ఢీ చేస్తున్నప్పటి నుంచి ఆ అమ్మాయి తెలుసు. మంచిగా పలకరిస్తుంది. కలిస్తే మాట్లాడుతుంది. ఆమె నాకు బిడ్డ లాంటిది. గర్వం అనేది ఏమాత్రం ఉండదు. పాపం రష్మీ గురించి ఓ విషయం చెప్పాలి. ఆమె కెరీర్ స్టార్టింగ్‌లో ఓ సినిమా చేస్తున్నప్పుడు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టారు' అంటూ బాంబ్ పేల్చాడాయన.

Recommended Video

#HBDSudigaliSudheer : Sudigali Sudheer Next Film with Rashmi Gautam
వాళ్ల దెబ్బకు ఇండస్ట్రీ వదిలేయాలనుకుంది

వాళ్ల దెబ్బకు ఇండస్ట్రీ వదిలేయాలనుకుంది


దీనిని కొనసాగిస్తూ.. ‘వాళ్లిద్దరూ చేసిన పని వల్ల రష్మీ గౌతమ్ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకుంది. అప్పుడు ఈ విషయాన్ని బయటకు రాకుండా చూశారు. అందుకే ఇది ఎవరికీ తెలియదు. అప్పుడు రష్మీ పట్టుదలతో పని చేయబట్టే ఇప్పుడు పాపులర్ అయిపోయింది. ఆమెలా ఇబ్బందులు పడిన అమ్మాయిలు చాలా మందే ఉన్నారు' అని చెప్పుకొచ్చాడు రాకేష్ మాస్టర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X