ఎలక్షన్లలో పోటీ చేస్తున్న సెక్స్‌బాంబ్ రాఖీ సావంత్

By Bojja Kumar

ముంబై : వివాదాస్పద నటి, బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ త్వరలో జరుగబోయే టీవీ మరియు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్(CINTAA) ఎలక్షన్స్-2013లో పోటీ చేయబోతోంది. 'పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న సిస్టమ్స్‌ను మారుద్దాం...ఆర్టిస్టులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడుదాం' అనే నినాదంతో రాఖీ బరిలోకి దిగుతుందట.

పరిశ్రమలో ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాఖీ మాట్లాడుతూ...'ఆర్టిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సరైన గౌరవం దక్కడం లేదు, వారికి సరిగా డబ్బులు చెల్లించడం లేదు. ఆర్టిస్టులు ఇబ్బందులతో కొన్ని సార్లు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలపై పోరాడేందుకు నేను ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాను' అని వెల్లడించింది.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి CINTAA ఎలక్షన్లు నిర్వహిస్తూ ఉంటారు. 34 ఏళ్ల ఈ సెక్స్ బాంబ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ...'మా గ్రూఫు విజయం సాధిస్తుందని, ఈ సిస్టమ్ ను మార్చడానికి మాకు అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాం' అని తెలిపారు.

ఒక వేళ సమస్యలు పరిష్కరించడంలో నేను విఫలం అయితే వెంటనే పదవికి రాజీనామా చేస్తాను అని బలంగా చెబుతోంది రాఖీ. మరి రాఖీని ఎంత మంది నమ్ముతారో? విజయం కట్టబడతారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X