Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘‘బిగ్ బాస్‌లో నాకు ఓటేయండి... అప్పుడే నా మొగుడిని చూపిస్తా.. అందరి నోరు మూయిస్తా’’
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే నటీమణుల్లో రాఖీ సావంత్ ఒకరు. కొన్ని రోజులుగా రాఖీ పెళ్లి విషయం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్ఆర్ రితేష్‌తో ఆమె పెళ్లి జరిగినట్లుగా ప్రచారం జరిగింది.
మొదట దీన్ని ఖండించిన ఈ కాంట్రవర్సల్ లేడీ తర్వాత... తన పెళ్లి నిజమే అని, హనీమూన్ కూడా వెళ్లామంటూ ప్రకటించింది. తాను పెళ్లి కూతురుగా ఉన్న ఫోటోలు పోస్ట్ చేసి ఇవే ఇందుకు సాక్ష్యంగా చెబుతూ వచ్చింది. అయితే తన భర్త ఫోటోను మాత్రం ఆమె ఇప్పటి బయటపెట్టలేదు. అతడికి లైమ్ లైట్లోకి రావడం ఇష్టం లేదని, అందుకే అతడి ఫోటో షేర్ చేయడం లేదని చెబుతూ వచ్చింది.
చాలా మంది రాఖీ పెళ్లి విషయం నమ్మడం లేదు
అయితే చాలా మంది రాఖీ సావంత్ పెళ్లి ప్రకటనను నమ్మడం లేదు. ఆమె పబ్లిసిటీ కోసమే ఇదంతా చేసిందనే వాదన సైతం తెరపైకి వచ్చింది. ఆమెకు పెళ్లి జరిగిన విషయం నిజమే అయితే భర్త ఫోటోను ఎందుకు పంచుకోవడం లేదని మరికొందరు అంటున్నారు.
వారి నోరు అలా మూయించాలని డిసైడ్ అయింది
తన పెళ్లి నిజం కాదని వాదిస్తున్న వారి నోరు మూయించాలని రాఖీ సావంత్ డిసైడ్ అయింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయబోయే బిగ్ బాస్ 13 రియాల్టీ షోకు తన భర్తతో కలిసి హాజరయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
|
అక్కడే తన భర్తను పరిచయం చేస్తుందట
సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ 13వ సీజన్ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. ‘నేను బిగ్ బాస్ 13కు వెళుతున్నాను. నాకు ఓట్ చేయండి, అక్కడే నా భర్తను పరిచయం చేస్తాను. ఆయన చాల సెక్సీగా, హాట్‌గా ఉంటారు.'' అని సోషల్ మీడియాలో రాఖీ ఓ వీడియో పోస్ట్ చేశారు.
మొదటి సీజన్లో పాల్గొన్న రాఖీ
ఇండియాలోనే మోస్ట్ కాంట్రవర్సల్ షోగా గుర్తింపు తెచ్చుకన్న హిందీ బిగ్ బాస్ మొదటి సీజన్లో రాఖీ పాల్గొన్నారు. ఇందులో ఆమె విజేతగా నిలవనప్పటికీ ఇంట్లో అనేక వివాదాలు క్రియేట్ చేయడం ద్వారా మరింత పాపులారిటీ పొందారు.