Just In
- 4 min ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
- 1 hr ago
బుట్టబొమ్మ ఫుల్ బిజీ.. కుదరకపోయినా మెగా హీరో కోసం ఒప్పుకుందట
- 1 hr ago
జాకెట్ బటన్స్ విప్పేసి పాయల్ రాజ్‌పుత్ రచ్చ: ఎద అందాలతో కనువిందు చేస్తూ హాట్ వీడియో పోస్ట్!
- 1 hr ago
పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రారంభం: నెల రోజుల పాటు అక్కడే.. కలవనున్న మరో హీరో
Don't Miss!
- News
నిమ్మగడ్డతో పోరులో జగన్ వైఫల్యానికి కారణమిదే -తర్వాత స్టెప్ ఇదైతేనే సేఫ్: ఎంపీ రఘురామ
- Sports
'కార్టూన్ బాయ్' రిషభ్ పంత్‌ను ట్రోల్ చేసిన రషీద్ ఖాన్!! ఏమన్నాడంటే?
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు... ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న తొలి మహిళా పైలట్ స్వాతి రాథో
- Finance
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
- Automobiles
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శృతి మించిన రాఖీ సావంత్ చేష్టలు.. పంచెను చింపి కర్చీప్.. అతడిని అర్ధనగ్నంగా నిలబెట్టిన సెక్స్‌బాంబ్!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 14 ఇంటిలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మాజీ కంటెస్టెంట్లు రాఖీ సావంత్, రాహుల్ మహాజన్ వ్యవహారం శృతి మించినట్టు కనిపించింది. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అనేక వివాదాలకు కారణమవుతున్న రాఖీ సావంత్.. మరోసారి కొత్త కంట్రావర్సికీ తెర లేపింది. సెలబ్రిటీ రాహుల్ మహాజన్‌తో వ్యవహరించిన తీరుపై ఇంటి సభ్యులు భగ్గుమన్నారు. ఇంతకు ఇంటిలో ఏం జరిగిందంటే..

వివాదాలతో రాఖీ సావంత్
బిగ్‌బాస్ 14 సీజన్ మరింత వివాదాలతో ముందుకెళ్తున్నది. ఇంటి సభ్యుల హద్దు మీరిన ప్రవర్తన మీడియాలో చర్చనీయాంశమైంది. కంటెస్టెంట్ జాస్మిన్ భాసిన్‌తో రాఖిసావంత్ మంగళవారం జరిగిన గొడవ తర్వాత ఆమెను కెప్టెన్ కానివ్వను అంటూ కామెంట్ చేసింది. ఆ ఘటనను మరిచిపోకముందే రాఖీ సావంత్ మరో కొత్త వివాదానికి కారణమైంది.

రాక్షసి అవతారం ఎత్తిన రాఖీ
కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా రాఖీ సావంత్ రాక్షసి అవతారం ఎత్తింది. ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులను వేధించే ప్రక్రియలో ఆమె తీరు శృతి మించింది. రాఖీ సావంత్ తీరుతో ఇంటి సభ్యులు ఆమెకు దూరంగా పరుగులు పెట్టారు. ఈ క్రమంలో రాహుల్ మహాజన్‌ను వెంటాడి విసిగించింది.

రాహుల్ మహాజన్ ఫోటోను నేలకోసి కొట్టి
కెప్టెన్సీ టాస్క్‌లో రాఖీ సావంత్ లీనమైంది. మీ అందరి రక్తం తాగుతా అంటూ రాక్షసి పాత్రలో లీనమైంది. రాహుల్ నన్ను మోసం చేశావు. నిన్ను ముక్కలు ముక్కలు చేస్తా అంటూ ఫోటోను తీసి నేలకేసి బాదింది. ఫోటోను కాళ్లతో తొక్కేసి కసి తీర్చుకొన్నది. అలా రాహుల్‌ను వేధిస్తూ కనిపించింది.

నీ పంచెను చింపి పడేస్తా
ఇక అంతటితో ఆగకుండా రాహుల్ కుర్తా, పంచెలో కనిపించగానే.. నీ పంచెను కర్చీఫ్ చేసి పడేస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించింది. అంతేకాకుండా రాహుల్ పంచెను లాగింది. కింద పడేసి మీద పడి రక్కేసినంత పనిచేసింది. అంతటితో ఆగకుండా పంచెను పీలికలుగా చింపేసి కర్చీప్ మాదిరిగా చేసి పడేసింది.

రాహుల్ మహాజన్‌ను దాదాపు నగ్నంగా
ఓ దశలో రాహుల్ మహాజన్‌ను నగ్నంగా మార్చిపడేసినంత పని చేసింది. దాంతో ఇంటి సభ్యులు భగ్గుమన్నారు. ఇంటిలో ఇలానే ఎవరైనా మహిళకు జరిగితే ఇలానే స్పందించే వారా? దేనికైనా హద్దు ఉంటుందని ఇంటి సభ్యులు ఫైర్ అయ్యారు. ఇలా విపరీత చేష్టలతో బిగ్‌బాస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్నది.

మాజీ కేంద్ర మంత్రి కుమారుడైన రాహుల్ మహాజన్
దివంగత మాజీ కేంద్రమంత్రి ప్రమోద్ మహాజన్ కుమారుడైన రాహుల్ మహాజన్ బిగ్‌బాస్ 2లో పాల్గొన్నాడు. అయితే పాత కంటెస్టెంట్లను తిరిగి బిగ్‌బాస్ 14లోకి తీసుకువస్తూ కొంత సంప్రదాయానికి తెర తీశారు. అలానే రాఖీ సావంత్‌ను కూడా బిగ్‌బాస్ 14లోకి పంపించారు. దాంతో వారి మధ్య అలాంటి సీన్ చోటుచేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.