‘బిగ్ బాస్’ చేసిన పనికి ఏడ్చిన శివజ్యోతి.. డేటింగ్ చేస్తానన్న రాహుల్‌కు పునర్నవి షాక్

Recommended Video

#RakshaBandhan celebrations in the house!!!

తెలుగులోనే అత్యంత భారీ రియాలిటీ షోగా పరిచయమై, విజయవంతంగా దూసుకుపోతోంది 'బిగ్ బాస్'. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. మూడో సీజన్ కూడా గత నెలలో ప్రారంభమైంది. మొదటి వారం నుంచే ఈ షోలో రోజు రోజుకూ వివాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ షో ఆసక్తికరంగా సాగుతోంది. వాస్తవానికి గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈ సారి కంటెస్టెంట్లలో అంతగా పేరున్న వాళ్లు లేకపోయినా.. షో మాత్రం ప్రేక్షకాదరణను పొందుతోంది. దీనికి కారణం ఇంట్లో జరిగే రచ్చే. తాజాగా హౌస్‌లో ఊహించని పరిణామం జరిగింది.

 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా..

గురువారం ఎపిసోడ్‌లో ఆగస్టు 15 సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో బిగ్ బాస్ హౌస్ కళకళలాడింది. స్కిట్‌లు డాన్స్‌లతో పాటు భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తింది. ఆ తర్వాత రెండు బ్యాచ్‌లు వచ్చి స్కిట్లు చేయడం.. అందరూ కలిసి డ్యాన్సులు చేయడం చేశారు. చివరకు అంతా ఏకమై హగ్గులు చేసుకున్నారు.

సందేశాత్మక స్కిట్లతో

సందేశాత్మక స్కిట్లతో

బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లతో స్కిట్లు చేయించారు. ఇందులో భాగంగా వితిక తన కో స్టార్ రవికృష్ణతో ‘నువ్వు ప్రియతో ఎందుకు మాట్లాడావు.. నేను కూడా నా ఇష్టం వచ్చినోడితో మాట్లాడుకుంటా' అంటూ సీరియస్ క్యారెక్టర్ చేసింది. మరో గ్రూపులో ఉన్న వరుణ్.. శాంత పరుడిలా కనిపించాడు. మొత్తంగా ఆడ మగ సమానత్వం గురించి వితిక బ్యాచ్.. దేశ గొప్పదనం గురించి వరుణ్ టీమ్ చేసిన నటన ఆకట్టుకుంది.

నాని వచ్చి కట్టించాడు

గురువారం ఎపిసోడ్ చూసిన వారందరిలో ఒక అనుమానం నెలకొంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజే రాఖీ పూర్ణిమ కూడా వచ్చింది. మరి, పండుగకు సంబంధించిన సెలెబ్రేషన్స్ చూపించలేదేంటి అని చాలా మంది అనుకున్నారు. వాస్తవానికి గత సంవత్సరం రాఖీ సంబరాలు ఘనంగా జరిగాయి. దీనికి కారణం హోస్ట్ నాని హౌస్‌లోకి ఎంటరవడమే.

అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టేశారు

అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టేశారు

బిగ్ బాస్ హౌస్‌లో రాఖీ సంబరాలు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో అలీ రేజాకు రాఖీ కట్టుకుంటూ శివజ్యోతి కన్నీటి పర్యంతం అయింది. ఆ తర్వాత వితిక.. రాహుల్‌కు, హిమజ.. వరుణ్ సందేశ్‌కు, రోహిణి.. రవికి, అషు రెడ్డి.. మహేశ్‌లకు రాఖీలు కట్టారు. చివర్లో పునర్నవి ఎవరికి కట్టాలి అని ఏదో చెబుతూ రాహుల్ పేరు ఎత్తింది. దీంతో అతడు పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పునర్నవి.. రాహుల్‌కు రాఖీ కట్టబోతుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది.

ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

ఈ వారం ఎలిమినేషన్‌కు రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్‌లు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సారి ఉన్న కంటెస్టెంట్లు అందరికీ ఎటువంటి రిమార్కులు లేకపోవడంతో (రాహుల్ మినహా) ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X