Guppedantha Manasu: భర్త ఎవరని వసుధారను స్టేజీపై నిలదీసిన దేవయాని.. దిమ్మతిరిగేలా జగతి సమాధానం!

కాలేజీలో మీటింగ్ నడుస్తుంటుంది. సమావేశం ప్రారంభించిన జగతి బోర్డ్ మెంబర్ ఫణీంద్ర సార్ మాట్లాడతారని చెబుతుంది. దీంతో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి, కాలేజీ గురించి సంతోషంగా చెబుతాడు ఫణీంద్ర. తర్వాత మాట్లాడేందుకు వసుధార మైక్ దగ్గరకు వెళ్తుంది.

అప్పుడు వెంటనే దేవయాని లేచి నిలబడుతుంది. దేవయాని నువ్వు ఎక్కడికి అని ఫణీంద్ర అడిగితే.. మన వసుధార గురించి రెండు ముక్కలు మాట్లాడతనని చెప్పి వెళ్తుంది. దీంతో జగతి మహేంద్ర షాక్ అవుతారు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మార్చి 1 బుధవారం నాటి తాజా ఎపిసోడ్‌ 699లో ఇంకా ఏం జరిగిందంటే?

నీకు చాలా ధైర్యమని తెలుసు..

నీకు చాలా ధైర్యమని తెలుసు..

మైక్ కి చేయి అడ్డం పెట్టి వసుధారతో మాట్లాడుతుంది దేవయాని. రిషి జీవితంలో నుంచి తప్పుకో వసుధార. ఇప్పుడే మర్యాదగా చెబుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్లిపో. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ వసుధార. ఈ ఊరు, కాలేజీ వదిలేసి వెళ్లిపో.. లేకపోతే అని దేవయాని అంటుండంగానే.. లేకపోతే ఏం చేస్తారు మేడమ్. నేనేందుకు వెళ్లాలి అని వసుధార అంటుంది.

అవునా.. నీకు చాలా ధైర్యమని తెలుసు వసుధార. ఈరోజు నీ ధైర్యం ఏపాటిదో చూద్దాం అని దేవయాని అంటుంది. తర్వాత తన పేరు, రిషి పెద్దమ్మని, రిషిని పెంచి పెద్ద చేసింది తానేనని చెబుతుంది. దీంతో ఏం మాట్లాడుతోంది అని మహేంద్రతో ఫణీంద్ర అంటాడు. మహేంద్ర, జగతి కూడా ఏం జరుగబోతుందో అని టెన్షన్ పడుతుంటారు.

మా ఇంటి కోడలుగా..

మా ఇంటి కోడలుగా..

ఈ ప్రాజెక్ట్ కి ముఖ్య కారకురాలు వసుధార. డీబీఎస్ డీ కాలేజీకి దొరికిన ఒక అపురూపమైన వెల కట్టలేని డైమండ్. వసుధార లాంటి తెగువు, అందం, తెలివి ఉన్నవాళ్లు చాలా అరుదుగా ఉంటారు అంటూ పొగుడుతూ ఒక్కసారిగా ఇలాంటి అమ్మాయిని కూతురుగా కోరుకుంటారు. కానీ నేను మాత్రం మా ఇంటికి కోడలిగా రావాలని ఆశపడ్డాను అని షాక్ ఇస్తుంది.

వసుధార లాంటి అమ్మాయి రిషిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను అని దేవయాని అంటే.. ఏం మాట్లాడుతున్నావ్ అని ఫణీంద్ర కోపంగా లేస్తాడు. ముగిస్తున్నాను అంటూ మనం ఆశపడింది నిజమే కదా.. కానీ అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటీ అని ఇలా మాట్లాడుతూ వసుధారను చూసి వెకిలిగా నవ్వుతుంది.

తాళి వేసుకోవడం ఈజీనా..

తాళి వేసుకోవడం ఈజీనా..

మేడమ్ ఇది పర్సనల్ విషయాలు చర్చించే వేదిక కాదు.. దయచేసి ఆపండి అని వసుధార అంటుంది. దీనికి ఇలా మాట్లాడే అవకాశం మళ్లీ మళ్లీ రాదు కదమ్మా. మాట్లాడని. నువ్వు మా రిషిని పెళ్లి చేసుకోనంత మాత్రానా నీ మీదున్న ప్రేమ, అభిమానం తగ్గిపోతాయా.. చెప్పు.. నువ్వంటే మా అందరికీ చెప్పలేనంత అభిమానం వసుధార.

అయితే నీ మెడలో ఉన్న ఆ తాళి ఎవరు కట్టారు. నువ్వు ఎవరినీ పెళ్లి చేసుకున్నావ్ అని అడిగేస్తుంది దేవయాని. మహేంద్ర అడ్డుకోబోతుంటే ఆపేస్తుంది దేవయాని. ఆ అదృష్టవంతుడి పేరేంటో చెప్పు వసుధార అని దేవయాని అంటే.. అప్పుడు మెడలో తాళి వేసుకోవడం అంతా ఈజీనా అన్నా రిషి మాటలు వసుధారకు గుర్తు వస్తాయి. మేడమ్ చెప్పండి అని మీడియా వాళ్లు కూడా అడుగి హడావిడి చేస్తారు.

తాళికి కారణం రిషినే..

తాళికి కారణం రిషినే..

అలా మీడియా వాళ్లు గోల చేసేసరికి.. వెంటనే లేచిన జగతి.. రిషి వల్ల అని అరుస్తుంది. దీంతో దేవయాని బిత్తరపోగా.. అంతా షాక్ అయి పైకి లేస్తారు. జగతీ కోపంగా దేవయాని వైపు చూస్తే.. ఏం మాట్లాడుతున్నావ్ జగతీ అని కోపంగా అంటుంది దేవయాని. దీంతో మైక్ దగ్గరికి వెళ్లిన జగతి.. దేవయానిని తోసినట్లుగా చేసి.. వసుధార మెడలో తాళి పడటానికి కారణం రిషి అని చెబుతుంది జగతి.

రిషీంద్ర భూషణ్ నా కొడుకే వసుధార మెడలో తాళికి కారణం. వసుధార నా కోడలు అని అంటుంది జగతి. దీంతో నీ శిష్యురాలిని కాపాడుకోవడానికి అబద్ధాలు చెబుతున్నావా అని దేవయాని అంటుంది. ఇది అబద్ధం కాదు అక్కయ్య గారు. ఇది నిజం అని ఆవేశంగా అంటుంది జగతి.

 రిషిని బలిచేయకు..

రిషిని బలిచేయకు..

వసుధారను కాపాడేందుకు రిషిని అడ్డం పెట్టుకుంటున్నావా అని దేవయాని అంటే.. అక్కయ్యా అవసరానికి రిషి పేరు వాడుకునేంత స్థాయికి నేను ఇంకా దిగజారలేదు అని జగతి అంటుంది. అప్పుడే రిషి ఎంట్రీ ఇస్తాడు అయితే. రిపోర్టర్స్ వెనుక ఉండటంతో.. ఎవరికీ కనిపించడు. వసు జీవితంలో రిషి ఉన్నాడు.

ఈ తాళి వసుధార మెడలో పడేందుకు రిషినే కారణం అని జగతి అంటుంది. ఆ మాటలకు రిషి షాక్ అవుతూ అక్కడే ఆగుతాడు. జగతీ తప్పు మాట్లాడుతున్నావ్.. శిష్యురాలి కోసం రిషిని బలిచేయకు. ఇది కరెక్ట్ కాదు. ఇలా మాట్లాడటం తప్పు తప్పు అని దేవయాని అంటూ రిషివైపు చూస్తుంది. దీంతో వెంటనే నాన్నా రిషి అని పిలుస్తుంది.

అయోమయంలో రిషి..

రిషి కంగారుగా చూస్తే.. వెంటనే వెళ్లిన దేవయాని.. విన్నావా రిషి.. జగతి ఎంత మాట అందో.. ఆ వసుధార తాళికి కారణం నువ్వంట అని అంటుంది దేవయాని. రిషి తల దించుకుని అయోమయంగా ఉంటాడు. రిషి ఆగావేంటీ.. అక్కడికి వచ్చి చెప్పు. రా నాన్నా.. అంటూ రిషి చేయి పట్టుకుని మరి స్టేజిపై ఉన్న మైక్ దగ్గరికి తీసుకెళ్తుంది.

మైక్ ముందు మౌనంగా నిల్చుంటాడు రిషి. చెప్పు రిషి.. వసుధార మెడలో ఆ తాళికి కారణం నువ్వే అని జగతి అంటుంది. కాదను చెప్పు అని దేవయాని అంటుంది. మరి రిషి ఏం చెబుతాడో వచ్చే ఎపిసోడ్ లో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X