గుప్పెడంత మనసు వసుధార రీ ఎంట్రీ.. ఆ సీరియల్‌లో హీరోయిన్‌గా? టెలికాస్ట్ ఎందులో అంటే?

తెలుగు నాట పాపులర్ సీరియల్‌గా గుర్తింపు తెచ్చుకుంది గుప్పెడంత మనసు. స్టార్ మాలో మూడేళ్ల క్రితం నెంబర్‌వన్ సీరియల్‌గా ఓ వెలిగింది ఈ ధారావాహిక. మహిళా ప్రేక్షకులతో పాటు యూత్ ఈ సీరియల్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకు కారణం దీని కథ, స్క్రిప్ట్, పాత్రలు, వాటిని పోషించిన నటీనటులు. ముఖ్యంగా రిషి, జగతి, వసు, మహేంద్ర క్యారెక్టర్లు ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సీరియల్‌లోని సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

గుప్పెడంత మనసుకు భారీ ఫాలోయింగ్
గుప్పెడంత మనసు నటీనటులకు స్టార్ స్టేటస్ కూడా వచ్చింది. వారు ఎక్కడికి వెళ్లినా ఇందులోని పాత్రల పేర్లతోనే పిలుస్తున్నారంటే ఈ సీరియల్ ఎంతగా ముద్ర వేసిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే దురదృష్టవశాత్తూ ఇందులోని కొందరు నటీనటులు ఈ సీరియల్ తర్వాత బుల్లితెరకు దూరమయ్యారు. ముఖ్యంగా హీరోగా నటించిన ముఖేష్ గౌడ, హీరోయిన్ రక్ష గౌడలు తెలుగు ప్రేక్షకులకు కనిపించడం లేదు. ముఖేష్ అప్పుడప్పుడు స్టార్ మాలో కొన్ని ప్రోగ్రామ్స్‌లో సందడి చేస్తుండగా రక్షగౌడ మాత్రం పూర్తిగా దూరమయ్యారు. అయితే వసుధార తన ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే ఓ సీరియల్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపింది. మరి ఆమె ఏ సీరియల్‌లో నటిస్తున్నారు? అది ఎందులో టెలికాస్ట్ కానుంది? ఈ వివరాల్లోకి వెళితే..

Raksha Gowda Re-Entry as Chinni Star Maa Shocks Fans with Heroine Change and New Time Slot

చిన్ని సీరియల్‌లో హీరోయిన్ల మార్పు
స్టార్ మాలో ప్రసారమవుతున్న చిన్ని సీరియల్‌లో మొదట్లో చాలా బాగుండేది. అయితే ఈ మధ్య ఈ ధారావాహికకు కొన్ని మార్పులు చేశారు. తొలుత కావేరి పాత్రలో నటించిన కావ్యశ్రీకి శుభం కార్డ్ వేసి.. కావేరికి కూతురు రోల్ అంటూ చిన్నిపాత్రకు మధుమిత అని పేరు పెట్టి స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చేశారు. దీనిని హిందీ బ్యూటీ స్మృతి కశ్యప్‌తో వేయించగా.. ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే ఆమె ట్రాక్‌లో వచ్చి జనం ఆదరించడం మొదలుపెట్టగా.. చిన్ని మేకర్స్ మరో ట్విస్ట్ ఇచ్చారు.

వసుధార రీ ఎంట్రీ
ఫేస్‌కి సర్జరీ జరగడంతో హీరోయిన్ ముఖం మారిపోయింది. ఆ కొత్త ఫేస్‌గా వసుధార ఎంట్రీ ఇవ్వనుందని స్టార్ మా హింట్ ఇచ్చేసింది. ఈ మేరకు ప్రోమోను కూడా రిలీజ్ చేసింది. మీ హృదయాలను గెలిచిన తార... ఇప్పుడు చిన్నీ పాత్రలో మిమ్మల్ని అలరించబోతోంది అని స్టార్ మా రాసుకొచ్చింది. సదరు ప్రోమోలో హీరో పాత్ర ధారి ఫోన్ చూసుకుంటూ ఎవరి కోసమో వెయిట్ చేస్తుంటాడు. అక్కడ ఓ అమ్మాయి మెడలో తాళి, చీరకట్టుతో గాజులు వేసుకుంటూ, ముఖానికి మేకప్ వేసుకుంటూ ఉంటుంది. ఇంతలో హీరో గారు చిన్ని.. ఇంకా ఎంతసేపు.. త్వరగా రా టైమ్ అవుతుందని విసుక్కుంటాడు. దాంతో చిన్ని పాత్రలో ఉన్న అమ్మాయి వస్తున్నానంటూ ఫేస్ టర్నింగ్ ఇస్తుంది. కట్ చేస్తే ఆ అమ్మాయి మన వసుధార అలియాస్ రక్షా గౌడ. దాంతో ఇకపై చిన్ని పాత్రను వసుధార పోషించనుందని స్టార్ మా తెలిపింది.

మండిపడుతోన్న నెటిజన్లు
అయితే కొత్త హీరోయిన్ వచ్చిందనే ఉద్దేశంతో సీరియల్ టైమింగ్స్‌ను మార్చేసింది స్టార్ మా. గతంలో చిన్ని సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 7 గంటలకు ప్రసారమయ్యేది. దీనిని ఒక గంట ముందుకు జరిపి. ఇకపై సాయంత్రం 6 గంటలకు ప్రసారం అవుతుందని స్టార్ మా ప్రకటించింది. ప్రస్తుతం చిన్నిలో హీరోయిన్ మార్పుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎన్నిసార్లు హీరోయిన్‌ని మార్చుతారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X