నాగార్జున తో చేయటం హ్యాపీగా ఉంది : రకుల్ ప్రీతి సింగ్
హైదరాబాద్ : తెలుగు టీవీ ప్రేక్షకులను ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ అలరించిన నాగార్జున మరోసారి సరికొత్త ఎపిసోడ్స్ తో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు( డిసెంబర్ 8) నుంచి ప్రారంభం కాబోతున్న రెండవ ఎపిసోడ్ మొదటి ఎపిసోడ్ కు ఏమాత్రం తగ్గకుండా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు రోజుల పాటు ఈ షో అలరించనుంది.
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమం మొదటి సీరిస్ ముగిసిన నాలుగు నెలల వ్యవధిలోనే తిరిగి ప్రేక్షకుల ముందుకు మళ్లీ వస్తోంది. ఈ షోలో ఇప్పటికే నితిన్ మీద ఎపిసోడ్ షూట్ చేసారు. అలాగే... ఇప్పుడు రకుల్ ప్రీతి సింగ్ మీద సైతం ఓ పోగ్రాం షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రకుల్ ట్విట్టర్ ద్వారా ఖరారు చేసింది.

రకుల్ ట్వీట్ చేస్తూ... " మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాం ఎవర్ గ్రీన్ నాగార్జున తో కలిసి పాల్గొనే అవకాసం రావటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.. !! నేను చాలా ఎంజాయ్ చేసాను! ," అన్నారామె.
ఇక ఈ షోలో పాల్గొనాలనుకుంటున్న వారికి ఎంపిక ప్రక్రియ కోసం ప్రత్యేక విధానాలను అనుసరించారు. అక్టోబర్ 9 నుంచి 18 రోజుల పాటు ప్రసారం చేసిన ప్రశ్నలకు ప్రేక్షకుల నుంచి అపూర్వస్పందన లభించింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన 34.50 లక్షల ఎస్‌ఎంఎస్‌లు/ఐవిఆర్‌ఎస్‌ల నుంచి అర్హుల ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టారు. హాట్‌సీట్‌కు చేరుకున్న కంటెస్టెంట్ కోటి రూపాయల వరకు ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం ఉంటుంది.
నాగార్జున బుల్లితెరపైకి అరంగేట్రం చేస్తూ చేసిన రియాలిటీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ షో హిందీలో బాగా ఫేమస్ అయిన కౌన్ బనేగా కరోడ్పతి షోకి రీమేక్ వెర్షన్. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వారా నాగార్జున తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడమే కాకుండా టిఆర్పి రేటింగ్స్ లో రికార్డ్స్ సృష్టించాడు. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం సెకండ్ సీజన్ రేపటి నుంచి(డిసెంబర్ 8న) ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండవ సీజన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయంగా అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ గే మ్ షోని బిగ్ సినర్జీ నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











