For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళికి అంటు రోగం కాదు అదో వ్యాధి.. నరకాసురుడు.. ఎన్టీఆర్, రాంచరణ్ షాకింగ్ కామెంట్స్

  |

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఎవరు మీలో కోటీశ్వరులు ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైంది. తొలివారంలో కర్టెన్ రైజర్‌లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి, RRR సినిమా విశేషాల గురించి రాంచరణ్‌, ఎన్టీఆర్ ఆసక్తిగా చర్చించుకొన్నారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో లైవ్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శించబడిన మొట్టమొదటి భారతీయ చిత్రం బాహుబలి: ది బిగినింగ్ చిత్రం గురించి రాంచరణ్, ఎన్టీఆర్ ప్రస్తావిస్తూ.. జక్కన హార్డ్ వర్క్, ఫర్‌ఫెక్షన్ గురించి మాట్లాడుతూ..

  సినిమా చూసిన తర్వాత మాటల్లేవు

  సినిమా చూసిన తర్వాత మాటల్లేవు

  బాహుబలి సినిమా అద్భుతమైన సినిమా అని ఎన్టీఆర్ అంటే.. ఆ సినిమా చూసిన తర్వాత నాకు మాటలు రావట్లేదు. రాజమౌళికి ఏం మెసేజ్ పెట్టాలో అర్ధం కావడంలేదు. ఎలాంటి మెసేజ్ పెట్టినా తక్కువే అవుతుందనే ఫీలింగ్ అనిపించింది. ప్రతీ ఇండియన్‌ గర్వంగా ఫీలయ్యే సినిమా. ఆయనకు ఫోన్ చేసి అభినందించాను. అలాంటి దర్శకుడు వద్ద మీరు మూడు సినిమాలు చేశారు. నేను రెండు సినిమాలు చేశాను. RRRలో ఆయన నీతో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా పక్కా మల్టీస్టారర్ అని రాంచరణ్ అన్నారు.

  నిన్ను మిస్ అవుతున్నాననే బాధ

  నిన్ను మిస్ అవుతున్నాననే బాధ

  RRR సినిమాలో పనిచేయడం గొప్ప అనుభూతి. అలాగే నీతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతంటే చరణ్‌ను నేను మిస్ అవుతానేమో. ఇక షూటింగ్‌లో రాంచరణ్ కలువడా? నేను మిస్ అవుతానా? అనే ఫీలింగ్ కలిగేది. RRR నటుడిగా నాకు గొప్ప అనుభూతిని పంచిన సినిమా అని ఎన్టీఆర్ అన్నారు.

  NTR's EMK show: రాంచరణ్ రూ.కోటి ఎందుకు గెలువలేదంటే? చెర్రీని ఉపాసాన Mr.C పిలవడం వెనుక సీక్రెట్ ఇదే!

  జక్కన్న వదిలేయమని అడిగా

  జక్కన్న వదిలేయమని అడిగా

  ఎన్టీఆర్ మాట్లాడుతుంటే రాంచరణ్ అడ్డుపడుతూ.. జక్కన్న అని మీరు ఎందుకు పేరు పెట్టారో తెలియదు కానీ.. ఆయన నటులను చెక్కడం చూస్తే అమోఘం అనిపిస్తుంది. ఆయన పక్కా పర్‌ఫెక్షనిస్టు. కొన్నిసార్లు జక్కన్న కాదా అంటూ తేలికగా తీసుకొంటాం. కానీ ఇన్నేళ్ల తర్వాత ఆయన నిన్ను, ఇలా చెక్కేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అని రాంచరణ్ అడిగితే.. కొన్నిసార్లు జక్కన్నను వదిలేయమంటాను. కానీ ఆయన సీన్ పర్‌ఫెక్ట్‌గా వచ్చే వరకు వదిలేయడు అంటూ ఎన్టీఆర్ అన్నారు.

  తగ్గిందేమిటి? పెరిగిందేటి? అంటూ రాజమౌళి

  తగ్గిందేమిటి? పెరిగిందేటి? అంటూ రాజమౌళి

  జక్కన్నను చూస్తే చాలా సార్లు భయం వేసేది. శరీరం కొంచెం తగ్గినా.. పెరిగానా ఏంటీ అని అడిగేవాడు అని రాంచరణ్ అంటే.. దర్శకుడిగా రాజమౌళి ఫర్‌ఫెక్షనిస్ట్. బాడీ కాదు.. జుట్టు కొంచెం పెరిగితే చాలూ.. జుట్టు పెరిగిందేమిటి? గడ్డం తక్కువగా ఉందేమిటి? కొంచెం తగ్గిందేమిటంటూ వెంటనే పట్టేస్తాడు అని ఎన్టీఆర్ అంటుండగా.. మూడేళ్లు సినిమా తీస్తే.. పెరుగకుండా ఉంటుందా అని ఓసారి అన్నాను అని రాంచరణ్ అన్నారు.

  Evaru Meelo Koteeswarulu Show: రాంచరణ్‌కు ఎన్టీఆర్ చెమటలు పట్టించిన ప్రశ్నలు ఇవే!

  మిగితా వాళ్లు చచ్చిపోతారు అంటూ ఎన్టీఆర్

  మిగితా వాళ్లు చచ్చిపోతారు అంటూ ఎన్టీఆర్

  రాజమౌళి ఫర్‌ఫెక్షన్‌ను తట్టుకోలేక ఓ సారి అడిగేశాను. ఏంటి జక్కన్న వదిలేయ్ అంటే.. అది కాదు మీరు చేసేయండి అంటూ వెంటపడేవారు. ఆ తర్వాత నేను అన్నాను.. ఫర్‌ఫెక్షన్ అనేది అంటు రోగం కాదు.. మీకు ఉన్న వ్యాధి అది. నీ ఒక్కడికే ఉంది. మీకు పిచ్చి ముదిరిపోయింది. అది తగ్గదు. ఇక ముందు మీతో చేసే వాళ్లు అయిపోయినట్టే.. నేను, చరణ్ లాంటి యంగ్ బాయ్ కాబట్టి తట్టుకొన్నాం. ఇక మిగితా వారు చచ్చిపోతారు అని ఎన్టీఆర్ అన్నట్టు చెప్పాడు.

  Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
  జక్కన చేతిలో కనిపించని బెత్తం అంటూ రాంచరణ్

  జక్కన చేతిలో కనిపించని బెత్తం అంటూ రాంచరణ్

  సెట్లో నీవు రిలాక్స్‌గా ఉండవు. కానీ నేను చాలా రిలాక్స్‌గా ఉంటాను. నా డైరెక్టర్ కూడా రిలాక్స్ ఉంటే ఇక అయిపోనట్టే. రాజమౌళి అలా ఉండటమే బెటర్. ఆయన చేతిలో ఓ కనిపించని బెత్తం ఉంటుంది అని రాంచరణ్ అంటే.. అవును ఆయన నరకాసురుడు. అలా ఉండటం వల్లే బాహుబలి లాంటి ప్రపంచం గర్వించదగిన చిత్రం వచ్చింది.

  మన తెలుగు భాష యావత్ ప్రపంచానికి తెలిసింది. హిందీ, తమిళం అంటూ రక రకాల భాషలతో ఓ గోడ ఉండేది. అలాంటి గోడలను చెరిపి వేసింది బాహుబలి చిత్రం. అందుకు రాజమౌళి థ్యాంక్స్ చెప్పుకోవాలని రాంచరణ్ అని రాంచన్ అంటే.. సినిమాకు భాష లేదని జక్కన నిరూపించాడు అని ఎన్టీఆర్ అన్నారు.

  English summary
  Jr NTR's Evaru Meelo Koteeswarulu Show started on August 22nd. Ram Charan won Rs.25 lakhs in the show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X