Ram Charan బుల్లితెరపైకి తొలిసారి పవన్ కల్యాణ్, రామ్ చరణ్... హీరోయిన్ ప్రణితతో కలిసి చిందులు
ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అయ్యే ఢీ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది డ్యాన్స్ మాస్టర్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎంతో మంది డ్యాన్సర్లకు ఈ షో లైఫ్ ఇచ్చింది. తాజాగా ఈ షో ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. అయితే అందులో పవన్ కల్యాణ్ తో పాటు రామ్ చరణ్ ఎంట్రీ ఉంటుంది. ఇక హీరోయిన్ ప్రణీత పవన్ తో కలిసి చిందులు వేసింది. అసలు ఏంటి అనేది పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
ఆకట్టుకుంటున్న ప్రోమో...
తాజాగా ఢీ సెలబ్రెటీ స్పెషల్ ప్రోమో రిలీజ్ అయింది. నందు యాంకర్ గా వ్యవహారిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ వారం న్యాయముర్తులుగా గణేశ్ మాస్టార్, ప్రణిత సుభాష్, జాని మాస్టర్ ఉన్నారు. ఇక ఈ షోలో పలువురు డ్యాన్స్ తో మెప్పించారు. వారి ఫెర్మమెన్స్ కు జడ్జ్ లు ప్రశంసలు కురిపించారు. ఇంతలో భీమ్లా నాయక్ సాంగ్ తో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే నిజంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాదు. ఈయన జూనియర్ పవన్ కల్యాణ్. అచ్చం పవన్ కల్యాణ్ ను పోలి ఉండే వ్యక్తి అనమాట.

పవన్ కల్యాణ్ ఎంట్రీ
ఇక హీరోయిన్ ప్రణీత సుభాష్.. జూనియర్ పవన్ కల్యాణ్ ను చూసి మురిసిపోతుంది. పవన్, ప్రణీత కాంబోలో అత్తారింటికి దారేది చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రణిత పవన్ మరదలి క్యారెక్టర్ లో నటిస్తుంది. ఇక ఈసినిమాలోని బాపు బొమ్మ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాపు బొమ్మ అంటే ప్రణిత అనే ఫిలింగ్ చాలా మందికి వస్తుంది. ఇక జూనియర్ పవన్ కల్యాణ్ ను చూసిన ప్రణిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రణీత సుభాష్ చిందులు...
చాలా చాలా పెద్ద థ్యాంక్యూ చెప్పాలి పవన్ కల్యాణ్ గారికి.. అంటూ ప్రణీత చెప్పుకువచ్చింది. జూనియర్ పవన్ కల్యాణ్ తో కలిసి బాపుగారి బొమ్మ సాంగ్ కు చిందులు వేసింది. ఇక ఇదే కార్యక్రమంలో ఆది, నందు, జానీ మాస్టర్ అండ్ టీమ్ కలిసి క్రికెట్ ఆడుతారు. అక్కడ కాస్త నవ్వులు పూయించే ప్రయత్నం చేస్తారు. ఇక ఆ తర్వాత పలు ఫెర్మమెన్స్ లతో డ్యాన్సర్స్ ఆకట్టుకున్నారు. జానీ మాస్టార్, ఆది మధ్య వచ్చే కామెడీ సీన్స్ అలరిస్తున్నాయి.
రామ్ చరణ్ కు కాల్...
ఇక ఈ ప్రోమోలో చివరగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అందరూ విషెష్ చెబుతారు. ఆ తర్వాత జానీ మాస్టార్ రామ్ చరణ్ కు కాల్ చేస్తే.. నమస్తే అంటూ చెర్రీ మాట్లాడుతాడు. మరి నిజంగా చెర్రీ మాట్లాడాడా అనేది తెలియాలంటే.. పూర్తి ఎపిసోడ్ వస్తేనే తెలుస్తోంది. ప్రస్తుతం ఢీ సెలబ్రెటీ స్పెషల్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మీరు ఈ ప్రోమోను చూడకపోతే ఇప్పుడే చూసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.


Click it and Unblock the Notifications











