ఆనీ మాస్టర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన రామ్ చరణ్.. 15 ఏళ్ల నమ్మకం అంటూ..

బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా ఈ సారి మంచి క్రేజ్ అందుకున్న వారిలో టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ కూడా టాప్ లిస్టులో ఉన్నారు. గత 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎన్నో వందల సినిమాలకు కొరియోగ్రఫీ చేయడమే కాకుండా రియాల్టీ షోలలో కూడా జడ్జ్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 లో ఆమె తప్పకుండా గట్టిపోటీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలోనే ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే ఇటీవల ఆనీ మాస్టర్ కు రామ్ చరణ్ ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆ విషయాన్ని ఆనీ మాస్టర్ సోషల్ మీడియాలో ఒక పోటో పోస్ట్ చేసి మరీ షేర్ చేసుకున్నారు.

ఎంత కష్టపడినా..

ఎంత కష్టపడినా..

ఆనీ మాస్టర్ ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. చాలా కష్టపడి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అయితే ఆమె ఎంత కష్టపడినా కూడా ఇంకా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాలేదు. కేవలం ఒక తరహా సినిమాలకు మాత్రమే కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసుకుంటూ వచ్చారు.

ఎక్కువగా ఆ దర్శకుడితో

ఎక్కువగా ఆ దర్శకుడితో

ఇక పూరి జగన్నాథ్ మద్దతు అందుకున్న ఆనీ మాస్టర్ కొన్ని పెద్ద సినిమాలకు వర్క్ చేశారు. దాదాపు పూరి జగన్నాథ్ ప్రతీ సినిమాలో కూడా ఏదో ఒక మంచి ఆఫర్ అందుకుంటూ వస్తున్నారు. జ్యోతిలక్ష్మి సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ పైసా వసూలు వంటి సినిమాలకు కూడా ఆనీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసి మంచి గుర్తింపు అయితే అందుకున్నారు.

సరైన బ్రేక్ రావాలని

సరైన బ్రేక్ రావాలని

ఆనీ మాస్టర్ బిగ్ బడ్జెట్ సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేయాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. సరైన బ్రేక్ రావాలని అలాగే పబ్లిక్ లో కూడా తనకు గుర్తింపు రావాలని ఆమె బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. ఇక అనుకున్నట్లుగానే ఆనీ మాస్టర్ కు బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఆమె బయటకు రాగానే కొన్ని మంచి ఆఫర్స్ కూడా అందుకున్నారు.

ఆఫర్ ఇచ్చిన రామ్ చరణ్

ఆఫర్ ఇచ్చిన రామ్ చరణ్

ఇక ఇటీవల ఆమెకు రామ్ చరణ్ కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఉపాసన కామినేని ఇంట్లో జరగనున్న పెళ్లి వేడుకలలో జరిగే హడావుడిలో ఆనీ మాస్టర్ కు కీలక బాధ్యతను అప్పగించారు. ఉపాసన కొణిదెల సోదరి అనుష్ పాల పెళ్లి వేడుకలో జరిగే సంగీత్ వేడుకలకు మొత్తం ఆనీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారట.

సంగీత్ ఈవెంట్ లో

సంగీత్ ఈవెంట్ లో

మరదలి పెళ్లి వేడుకలను దగ్గరుండి చూసుకుంటున్న రామ్ చరణ్ సంగీత బాధ్యతను ఆనీ మాస్టర్ కు అప్పగించారట. ఈ సంగీత్‌ ఈవెంట్‌ ఆదివారం సాయంత్రం దోమకొండ కోటలో నిర్వహించారు. మొత్తానికి ఆనీ మాస్టర్ తనదైన స్టైల్ లో కామినేని వారి కుటుంబ సభ్యులతో స్టెప్పులు వేయించారు. అందుకు ఆమెకు బాగానే పేమెంట్ ఇచ్చారని తెలుస్తోంది.

15 ఏళ్ళ నమ్మకం అంటూ..

15 ఏళ్ళ నమ్మకం అంటూ..

మెగా ఫ్యామిలీకి అనీ మాస్టర్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం ఈనాటిది కాదు. కొణిదెల వారి ఇంట్లో ఎవరి పెళ్లి వేడుకలు జరిగినా ఆనీ మాస్టర్ సంగీత్ ఈవెంట్స్ కు ప్రత్యేకంగా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు పెళ్లి వేడుకల్లో కూడా అందరికి డ్యాన్స్ నేర్పించారు. ఇక వారితో అనుబంధం 15 ఏళ్లుగా కొనసాగుతోంది అని ఆనీ మాస్టర్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. రామ్ చరణ్ తో దిగిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Recommended Video

RRR Trailer: Radhe Shyam And Bheemla Nayak Trailer Release Dates | Filmibeat Telugu
బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే

బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే

బిగ్ బాస్ ద్వారా ఆనీ మాస్టర్ కు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందినట్లు సమాచారం. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సమాచారం ప్రకారం, ఆనీ మాస్టర్ రోజుకు రూ. 50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారట. కాబట్టి ఆమె వారానికి 3.5 లక్షలు సంపాదించారు. అదే నిజమైతే, సెప్టెంబర్ 5 మరియు నవంబర్ 20 మధ్య, అనీ మాస్టర్ సంపాదించిన మొత్తం మొత్తం రూ. 40 లక్షలు కావచ్చని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X