బన్నీ వర్సెస్ చెర్రీ.. ఇప్పుడు రామ్ చరణ్ ఏంట్రీ.. డేట్ ఫిక్స్ అయ్యింది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన రాబోయే చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 'ఉప్పెన' చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఆ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ టైటిల్ ను 'పెద్ది'గా ప్రకటించి, ఊరమాస్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ ను విడుదల చేశారు. దాంతో 'పెద్ది' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తర్వాత వరల్డ్ మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్న చరణ్ నుంచి రాబోతున్న ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఇక చివరిగా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. తెలుగుతో పాటు అన్నీ భాషల్లో బ్రహ్మాండమైన రిలీజ్ జరిగింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఈ సినిమాను రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించారు. తమిళ అగ్ర దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయనకు ఇదే తొలిచిత్రం కావడం విశేషం. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఎస్జే సూర్య కీలక పాత్రలో అలరించారు.

అయితే ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కానీ సినిమాలోని బలమైన కథ, రామ్ చరణ్ నట విశ్వరూపం, గ్రాండ్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, అదిరిపోయే సంగీతం ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా రామ్ చరణ్ పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రం ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఇప్పటికే థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీలోనూ విడుదలై దుమ్ములేపింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫివ్రబరి 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైంది. తాజాగా విడుదల తేదీని తెలియజేస్తూ టీవీ ఆడియెన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను జీ5 తెలుగు సొంతం చేసుకుంది. కాగా ఏప్రిల్ 27న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఈ చిత్రం టీవీలో ప్రసారం కానుంది. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ సెన్సేషనల్ మూవీ 'పుష్ప 2 : ది రూల్' చిత్రం ఏప్రిల్ 13న టెలివిజన్ ప్రీమియర్ జరిగింది. ఈ సినిమాకు 12.61 టీఆర్సీ రేటింగ్ దక్కింది. అయితే పుష్ప చిత్రం మాత్రం 22.54 టీఆర్సీపీ ని సొంతం చేసుకోవడం విశేషం.
అయితే కేవలం 14 రోజుల గ్యాప్ లోనే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా టీవీలో ప్రసారం కాబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఇక గేమ్ ఛేంజర్ సినిమాకు టెలివిజన్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీంతో బన్నీ వర్సెస్ చెర్రీగా మారింది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో 'పెద్ది' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్. శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











