Unstoppable: క్లీంకారను అప్పుడే చూపిస్తా.. రామ్ చరణ్ ను ఇరకాటంలో పడేనా బాలకృష్ణ..

Ram Charan In Unstoppable: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు 8 ఎపిసోడ్లు కంప్లీట్ కాగా.. 9 వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ స్పెషల్ ఎపిసోడ్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్ ,దిల్ రాజు, నిర్మాత విక్రమ్ హాజరై సందడి చేశారు. ఈ సమయంలో మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ ను ఎప్పుడు రిలీవ్ చేస్తారని బాలయ్య ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానమిచ్చాడు రామ్ చరణ్. ఇంతకీ ఏమన్నారంటే?

అన్ స్టాపబుల్ ప్రోమో ప్రారంభం కాగానే.. అన్ ప్రొడక్టబుల్ అంటూ బాలకృష్ణ, రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తారు. ఈ షోలో సర్ప్రైజ్ ల మీద సప్రైజ్ లు ఉన్నాయంటూ బాలకృష్ణ అనగానే.. కొంచెం టెన్షన్ గా ఉంది సార్ అంటూ ఫన్నీగా రిప్లై ఇస్తాడు రామ్ చరణ్.'నువ్వు గ్లోబల్ స్టార్ కాదు.. మెగా ఫ్యామిలీ స్టార్' అంటూ రామ్ చరణ్ కు బాలకృష్ణ కొత్త టైటిల్ ఇచ్చాడు. 'నీ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ ను అడిగాను'.. అంటూ ఏదో చెప్పాలని బాలకృష్ణ ప్రయత్నిస్తాడు.. వెంటనే రామ్ చరణ్ రియాక్ట్ అవుతూ..' ఏమన్నారు సార్?' అని ప్రశ్నిస్తాడు.

Ram Charan In Unstoppable Balakrishna Ram Charan Unstoppable With Nbk S4 E9 Promo

'ఆ విషయం నేను చెప్పలేనమ్మా' అంటూ రామ్ చరణ్ బామ్మ, అమ్మ వీడియోలను చూపిస్తాడు. తమకు ఓ కోరిక ఉందని ఆ కోరికను డైరెక్టుగా చెప్పలేక ఓ లెటర్లో పంపిస్తున్నాం అని చెబుతారు. వెంటనే బాలకృష్ణ వారు పంపించిన లెటర్ అంటూ రామ్ చరణ్ కి ఇస్తాడు. ఆ లెటర్ లో.. '2025 లో మాకు ఓ మనుమడు కావాలి' అంటూ తమ కోరికను బయటపెడతారు రామ్ చరణ్ తల్లి బామ్మ. దీంతో రామ్ చరణ్ ఎమోషనల్ అవుతాడు. రామ్ చరణ్ అలా చూసిన బాలకృష్ణ రియాక్ట్ అవుతూ.. 'ఈ సీన్లో నేను నారదుడిని మాత్రమే నాకేం తెలియదు' అంటూ చరణ్ ను నవ్వించే ప్రయత్నం చేస్తాడు.

'ఆ తర్వాత ప్రతి పండుగకి ఆవిడను కలవడం మర్చిపోవు కదా ?'అంటూ ఓ తికమక పెట్టే ప్రశ్న అడుగుతాడు. దానికి అదా.. అంటూ సమాధానం ఇస్తాడు చరణ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగేంద్రబాబు ఫోటోను చూపించి..'ఈ ముగ్గురిలో పార్టీకి వెళ్లాలంటే ఎవరితో వెళ్తావ్?' ప్రశ్నిస్తాడు బాలయ్య.. 'తాను ఈ ముగ్గురితో కాకుండా తన మామయ్య అల్లు అరవింద్ తో వెళ్తానంటూ' షాక్ ఇస్తాడు రామ్ చరణ్.

2023లో ఓ గ్రేటెస్ట్ సన్ గా ఓ సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చామంటూ.. క్లింకరా పుట్టినప్పుడు చిరంజీవి ఫ్యామిలీ ఎలా ఫీల్ అయిందో ఓ వీడియోను చూపిస్తాడు బాలకృష్ణ. ఆ వీడియోను చూడగానే రామ్ చరణ్ ఎమోషనల్ అవుతాడు. దీంతో 'ఆడపిల్ల పుడితే ఇంట్లో అమ్మవారు అడుగుపెట్టినట్లే' అంటూ తనదైన స్టైల్ లో బాలయ్య డైలాగ్ చెప్తాడు. ఈ సమయంలో రాంచరణ్ మాట్లాడుతూ .. తన కూతురు క్లింకార గురించి పలు విషయాలను చెప్పుకొస్తాడు. 'అవును.. క్లింకార ఫేస్ ను ఎప్పుడు చూపిస్తావ్?' అంటూ బాలకృష్ణ ప్రశ్నిస్తాడు.

'ఏ రోజైతే.. తనని నాన్న అని పిలుస్తుందో.. ఆరోజు కచ్చితంగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను' అని రామ్ చరణ్ మాటిస్తాడు. ఆ తర్వాత రామ్ చరణ్ కోసం శర్వా , విక్కీ వస్తారు. అలాగే గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు కూడా వచ్చి బాలయ్య షోలో సందడి ఇలా ఆద్యంతం ఈ షో ఫన్నీగా సాగినట్లు తెలుస్తోంది. ఈ పూర్తి ఎపిసోడ్ జనవరి 8న విడుదల కాబోతోంది. వాచ్ అండ్ ఎంజాయ్ ఆన్ ఆహా..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X