రాంచరణ్ డిజాస్టర్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద నిరాశ.. అక్కడ రికార్డుల మోత!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాలతో రిలీజైన వినయ విధేయ రామ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. డిజాస్టర్ టాక్‌తో మొదలైన ఈ చిత్ర ట్రేడ్ వర్గాల ఊహకు అందని కలెక్షన్లు తిరగరాసి ఆశ్చర్య పరిచింది. రిలీజ్ ఏడాదిన్నర గడుస్తున్న ఈ ప్లాప్ చిత్రం బుల్లితెర మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఆ రికార్డుల వివారాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ వద్ద నిరాశ

బాక్సాఫీస్ వద్ద నిరాశ

ప్రముఖ దర్శకుడు డీవీవీ దానయ్య నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రం జూన్ 11వ తేదీ 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్‌ను మూట గట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పుంజుకోలేకపోయింది. అయితే అంతటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా తొలివారం కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

వినయ విధేయ రామ కలెక్షన్లు

వినయ విధేయ రామ కలెక్షన్లు

వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. థియేట్రికల్ రైట్స్ రూ. 92 కోట్లకు అమ్మడం జరిగింది. అయితే ఆ చిత్రం రూ. 62.85 కోట్ల నికర వసూళ్లు, సుమారు 90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాదాపు 32 శాతం (రూ. 30 కోట్లు) నష్టపోయినట్లు అప్పట్లో ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

బుల్లితెర మీద రికార్డులు

బుల్లితెర మీద రికార్డులు

ఇదిలా ఉంటే బిగ్ స్క్రీన్ మీద వినయ విధేయ రామ ప్రేక్షకులను నిరాశపరిస్తే.. బుల్లితెర మీద మాత్రం రికార్డుల మోత మోగిస్తున్నది. ఈ చిత్రం టీఆర్పీలు ట్రేడ్ వర్గాలను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ చిత్రం తొలిసారి టెలివిజన్ ప్రీమియర్ ప్రదర్శించినప్పుడు 7.9 టీర్పీ వచ్చింది. ఆ తర్వాత రెండోసారి 8.2, మూడోసారి 8.16, నాలుగోసారి 7.2 టీఆర్పీ వచ్చింది.

ఎనిమిదోసారి కూడా రికార్డు స్థాయిలో

ఎనిమిదోసారి కూడా రికార్డు స్థాయిలో

ఇక ఇప్పటి వరకు టెలివిజన్‌లో ఎనిమిదిసార్లు ప్రసారం చేస్తే అంతే క్రేజ్ కనిపిస్తున్నది. ఈ చిత్రం ఐదో సారి ప్రసారం అయినప్పుడు అత్యధికంగా 8.18 టీఆర్పీ, 6వసారి 5.19, 7వ సారి 6.35, ఇటీవల తాజాగా వినయ విధేయ రామను ప్రసారం చేస్తే 7.97 టెలివిజన్ రేటింగ్ రావడం విశేషం.

Recommended Video

Mahesh Babu As Lord Rama, Fan Made Poster Goes Viral
మెగా పవర్ స్టార్ స్టామినాకు

మెగా పవర్ స్టార్ స్టామినాకు

వినయ విధేయ రామ చిత్రాన్ని టెలివిజన్ ప్రేక్షకులు ఆదరించడంపై చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది. లాక్‌డౌన్ పిరియడ్‌లో ప్రసారమైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో క్లైమాక్స్‌పై అసంతృప్తి కలిగించడం ఓ మైనస్‌గా చెప్పుకొంటారు. ఏది ఏమైనా టెలివిజన్ రేటింగుల విషయంలో రికార్డులు క్రియేట్ చేయడం మెగా పవర్, బోయపాటి స్టామినాకు చిరునామాగా మారిందనే చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X