టీవీ సెక్సీ సుందరితో రామ్ చరణ్ చిందులు

ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని సైతం ఇక్కడ ఆంద్రాలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి గానూ 'రుస్తుం' అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. 'రుస్తుం' టైటిల్ తో గతంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే. 'జంజీర్' చిత్రాన్ని హిందీ వెర్షన్ కి అపూర్వ లఖియా డైరక్ట్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి మాత్రం దర్శకుడు యోగి పర్యవేక్షణలో చేస్తున్నారు.
రామ్ చరణ్ తండ్రి చిరంజీవి సూచనల మేరుకు ఈ మార్పు జరిగినట్లు సమచారం. వెంకటేష్ తో చింతకాయల రవి చిత్రం చేసిన యోగి ప్రస్తుతం ఈ చిత్రం పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కి నేటివిటీ కోసం ఈ దర్శకుడుని తీసుకున్నట్లు వినికిడి. ఇక ఈ చిత్రం విషయమై ప్రతీ దాన్ని చిరంజీవి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రచ్చ విషయంలోనూ చిరంజీవి ఇలాగే దగ్గరుండి సినిమా చేయించుకున్నారు.
అలాగే ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు. అలాగే జర్నిలిస్టు జె డి ని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టు లో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











