రామ్ చరణ్ కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్.. కానీ అక్కడ హిట్టయ్యిందే!

కొన్నిసార్లు డిజాస్టర్ సినిమాలను చాలా కాలం తరువాత చూస్తే అసలు ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయ్యిందని డౌట్ వస్తుంది. ఇక మరికొన్ని సినిమాలు ఆల్ టైమ్ డిజాస్టర్ అని ఫిక్స్ అవుతాం. అయితే కొన్నిసార్లు అవి కూడా బుల్లితెరపై మంచి రేటింగ్ తో సక్సెస్ అవుతుంటాయి. ఇటీవల రామ్ చరణ్ కి సంబంధించిన ఒక సినిమా కూడా ఊహించని విధంగా TRP అందుకోవడం గమనార్హం. ఆ సినిమా మరేదో కాదు. గత ఎడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన వినయ విధేయ రామ.

ఈ సినిమా రిలీజ్ కి ముందు ఏ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊరమాస్ సినిమా కావడం అలాగే రామ్ చరణ్ సరికొత్త గెటప్ ఆ సినిమాకు హైప్ క్రియేట్ చేశాయి. పైగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఆడియెన్స్ డైరెక్ట్ గా ఆ సినిమా చెత్త అంటూ చెప్పడంతో నిర్మాత కూడా ఒప్పుకోక తప్పలేదు.

Ram charan tej biggest disaster movie good trp in small screen

అలాంటి వినయ విధేయ రామ సినిమా టీవీలో టెలికాస్ట్ అవ్వగా 7.98TRP వచ్చింది. ఇదివరకే రెండు మూడు సార్లు టీవీల్లో వచ్చిన ఈ సినిమాకు మళ్ళీ ఈ రేంజ్ లో టీఆర్పీ రావడం ఆశ్చర్యపరిచే విషయం. డివివి.దానయ్య నిర్మించిన ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కీయరా అద్వానీ హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సినిమాకు దాదాపు పెట్టిన బడ్జెట్ లో సగం కూడా వెనక్కి తిరిగిరాలేదని అప్పట్లో టాక్ వచ్చింది. ఇక నెక్స్ట్ అదే నిర్మాతతో చరణ్, తారక్ తో కలిసి RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X