Bigg Boss Telugu 8 Finale : చీఫ్ గెస్ట్‌గా మెగా హీరో .. నాగార్జునతో ఫోటో బయటికి, ఇక టీఆర్పీలు బద్ధలే
దాదాపు 100 రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు 8కి మరికొద్దిగంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో విన్నర్ ఎవరు కానున్నారు? విజేతకు ప్రైజ్ మనీ ఎంత? గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ ఎవరు అంటూ పెద్ద డిస్కషన్ నడుస్తోంది. సోషల్ మీడియా , తెలుగు ప్రేక్షకులంతా ప్రస్తుతం బిగ్‌బాస్ పైనే ఫోకస్ పెట్టారు. ఇక అసలు రచ్చ మాత్రం ఆదివారం నుంచే మొదలుకానుంది.
14 మందితో బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభం కాగా.. మధ్యలో 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. షో మొదలై నాటి నుంచి 14 వారాల వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక, మెహబూబ్, హరితేజ, గంగవ్వ, విష్ణుప్రియ, రోహిణి, పృథ్వీరాజ్ శెట్టి, టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. 15వ వారం నాటికి నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్‌లు మాత్రమే కంటెస్టెంట్స్‌గా మిగిలారు.

కన్‌ఫ్యూజన్ లేకుండా టాప్ 5లో ఐదుగురే నిలవడంతో ఉత్కంఠకు తెరపడినట్లయ్యింది. వీరిలో టికెట్ టూ ఫినాలే టాస్క్‌ల ద్వారా అవినాష్ ముందే గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచారు. 14వ వారం రోహిణి, టేస్టీ తేజాలు ఎలిమినేట్ కావడంతో టాప్ 5పై క్లారిటీ వచ్చేసింది. ఈ ఐదుగురిలో ఒకరు బిగ్‌బాస్ తెలుగు 8 టైటిల్ విజేత కానున్నారు. ప్రధానంగా నిఖిల్, గౌతమ్‌ల మధ్యే పోటీ జరుగుతోంది. వీరిద్దరిలో ఒకరు బిగ్‌బాస్ విన్నర్ కానున్నారని ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారు.
ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఓటింగ్‌లో గౌతమ్ మంచి జోరులో చూపిస్తుండగా.. చివరికి వచ్చేసరికి నిఖిల్ చేతులెత్తేశాడు. ప్రధానంగా తెలుగు సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తెలుగు బిగ్‌బాస్‌లో కన్నడిగుల డామినేషన్‌పై తొలి నుంచి ఆగ్రహంతో ఉన్న కొన్ని వర్గాలు గౌతమ్‌కి ఓట్లు గుద్దేస్తున్నారు. ఇది నిఖిల్‌కు ప్రతికూలంగా మారింది. అయితే అంతిమ నిర్ణయం బిగ్‌బాస్ నిర్వాహకులదే కావడం.. పైగా నిఖిల్ సెలబ్రెటీ కావడం, సీజన్ ప్రారంభమైన నాటి నుంచి 15 వారాల పాటు హౌస్‌లో కంటిన్యూ అవుతుండటం వంటి అంశాలు పరిగణనలోనికి తీసుకుంటే లాస్ట్ మినిట్‌లో ఏమైనా జరగొచ్చు.

ఇదిలాఉండగా.. బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి పేరు ఈ విషయంలో ప్రముఖంగా వినిపించింది. గతంలో బిగ్‌బాస్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా హాజరవ్వడంతో పాటు హోస్ట్ నాగార్జునకు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఖచ్చితంగా చిరునే అని అంతా డిసైడ్ అయిపోయారు. కానీ అనూహ్యంగా ఓ మెగా హీరో చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు ఓ న్యూస్ బయటికి వచ్చింది.
ఆ హీరో ఎవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా.. నాగ్ - చరణ్‌లు కలిసున్న ఫోటో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే చరణ్ తన రీసెంట్ మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్ కోసం బిగ్‌బాస్‌కి వచ్చారా? లేక ఆయనే చీఫ్ గెస్టా అన్నది మరికొద్దిగంటల్లో తేలిపోనుంది. ఒకవేళ చరణ్ వస్తే మాత్రం రేపు టీఆర్పీలు పగిలిపోతాయని ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారు. స్టార్ హీరో రానుండటంతో అన్నపూర్ణ స్టూడియోకి భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications











