ఆర్జీవీ మనసు దోచేసిన బుల్లితెర నటి.. స్టేజీ మీదే పెళ్లి ప్రపోజల్.. ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సినిమాలను తీయడంతో పాటు ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఈయన అన్నా, ఈయన చేసే కామెంట్లు అన్నా చాలా మంది ఇష్టపడరు. కానీ కొంత మంది మాత్రం ఈయనను దేవుడిగా అభివర్ణిస్తూ ఆయనను ఫాలో అవ్వాలని చూస్తారు. ఫాలో అయ్యే ధైర్యం లేక.. ఆయన్ను చూపి హ్యాపీగా ఫీలవుతుంటారు. అయితే తాజగా ఈయన మరో అమ్మాయిపై మనసు పారేసుకున్నారు. ఆమె మరెవరో కాదు తెలుగు బుల్లితెర నటి. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పుడూ ఓ కొత్త అమ్మాయితో కనిపించే ఆర్జీవీ.. తనకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎవరు ఏం అనుకున్నా పట్టించుకోకుండా సోషల్ మీడియా వేధికగా తాన చేసిన పనుల గురించి చెబుతుంటారు. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా ఓ చేతిలో మందు గ్లాసు, మరో చేతిలో అందమైన అమ్మాయిని పట్టుకుని నలిపేసిన ఆయన తాజాగా ఓ షోకు వచ్చారు. అక్కడే ఓ తెలుగు బుల్లితెర నటికి ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ అనగానే లవ్ ప్రపోజల్ అనుకునేరు... అందరూ ఆశ్చర్య పడేలా మ్యారేజ్ ప్రపోజ్ చేశారు ఆర్జీవీ.

Ram Gopal Varma Marriage Proposal to Telugu Television beauty Check Details

ముఖ్యంగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ న్యూ ఇయర్ సందర్భంగా పెళ్లా వద్ద పార్టీ ముద్దు అనే షోను కండక్ట్ చేసింది. ఈక్రమంలోనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను స్పెషల్ గెస్టుగా పిలిచారు. ఇక అక్కడకు వెళ్లిన ఆర్జీవీ ఎప్పటిలాగే తన మాటలతో అందరినీ అలరించారు. ఎవరూ ఊహించని విధంగా పంచులు వేస్తూ ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా ఆయన వస్తున్నాడని వెల్ కమ్ చెప్పేందుకు స్టేజీపై మొత్తం అమ్మాయిలను నిలబెట్టారు. యాంకర్ రష్మి, రోహిణి, వర్ష, హిమజ, లాస్య, పవిత్ర, ఇలా మరికొంత మంది అమ్మాయిలు స్టేజీపై ఉన్నారు.

రామ్ గోపాల్ వర్మ రాగానే వర్ష ఎలా ఉన్నారు సార్ అని అడగ్గా.. ఎందుకు ఆన్సర్ చెబితే ఏమైనా చేస్తావా అని అడిగాడు. దానికి సమాధానం చెప్పకుండానే.. మీరు వస్తుంటేనే మాకు టెన్షన్ వచ్చేస్తుంది సార్ అని అంటుంది. దీనికి ఆర్జీవీ నేను అడిగింది మీరు ఇవ్వరు.. అందుకే ఆ టాపిక్ వదిలేద్దాం అంటూ ఆమె నోరూ మూయించేశాడు. కానీ వర్ష మాత్రం.. మిమ్మల్ని బ్లాక్ డ్రెస్ లో చూస్తుంటే హీరోలా కనిపిస్తున్నారని అంటుంది. దీనికి ఆర్జీవీ అంత యెదవలా కనిపిస్తున్నానా అంటూ మరోసారి కామెంట్ చేశాడు. దీనికి అంతా నవ్వుకున్నారు.

Ram Gopal Varma Marriage Proposal to Telugu Television beauty Check Details

ఆ తర్వాత రష్మి పెళ్లాం ముద్దా పార్టీ ముద్దా అనగా.. పార్టీయే ముద్దు అన్నాడు ఆర్జీవీ. ఆ తర్వాత వచ్చిన వర్ష.. మీకు నేను కావాలా పార్టీ కావాలా అంటే మీరేం చెప్తారు అనగానే.. నువ్వే కావాలంటాడు. ఆ తర్వత మీరు ఎప్పుడూ అమ్మాయిలకే ఎందుకు సపోర్ట్ చేస్తారని అనగా.. నేను అమ్మాయిని కాదు కాబట్టి అంటూ మరో పంచ్ వేస్తాడు. ఆ తర్వాత తనలాగా హానెస్ట్ గా ఉండే అమ్మాయిలు అంటేనే తనకు ఇష్టం అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత స్టేజీపై ఉన్న వాళ్లలో మీకు ఎవరు నచ్చారని అడగ్గా.. వెంటనే కాస్త దూరం వచ్చి అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ ప్రపోజ్ చేశాడు. ప్రేమించమని కాదండోయ్.. ఏకంగా విల్ యు మారీ మీ అంటూ అందరినీ అడిగేశాడు. అద్భుతంగా ఉన్న ఈ ఎపిసోడ్ యూట్యూబ్ లో కూడా ఉంది. మీరూ ఓసారి వెళ్లి చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X