For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అరియానాతో చేశా.. అషూతో చేయలే.. దేవతల మీద కాదు అంటూ వర్మ రచ్చ!

  |

  ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ పేరు వింటేనే ఇప్పుడు అందరూ ఇదేంట్రా బాబు ఇలా అయిపోయాడు అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దర్శకుడిగా ఎంతో మంది దర్శకులకు రోల్ మోడల్ గా నిలిచి పదుల సంఖ్యలో దర్శకులకు గురువు గా వ్యవహరించిన ఆయన ఇప్పుడు అమ్మాయిలతో కలిసి చేస్తున్న కొన్ని వ్యవహారాలు మాత్రం ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి.

  మొన్నీమధ్య అరియానాతో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేసి రచ్చ చేసిన వర్మ ఇప్పుడు అషు రెడ్డితో కూడా అలాంటిదే ఇంకేదో చేస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా దాని మీద వర్మ తాజాగా వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

  ఆర్జీవితో జాగ్రత్త

  ఆర్జీవితో జాగ్రత్త

  డబ్స్మాష్ లు చేసి జూనియర్ సమంత అని పేరు తెచ్చుకున్న అషు రెడ్డి బిగ్ బాస్ లో ఎంటర్ కావడంతో మరింత క్రేజ్ సంపాదించింది. అయితే ఆమె బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో ఇప్పుడు బుల్లితెర మీద అనేక ప్రోగ్రాం లు చేస్తూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే నిన్న ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

  అందులో నో అంటే నో అంతే అని క్యాప్షన్ కూడా ఇచ్చింది ఈ వీడియోలో ఆర్జీవి ఆమె తొడలను కింద నుంచి షూట్ చేస్తుంటే ఆమె మాత్రం వద్దు వద్దు అని అంటూ ఉండడం కనిపించింది. అయితే ఈ క్రమంలో నెటిజన్లు అషు రెడ్డి చేసిన పోస్ట్ మీద కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు. నిజానికి గతంలో ఆర్జీవీ అరియానా తో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆర్జీవితో జాగ్రత్తగా ఉండాలని ఆమెకు సలహాలు ఇస్తూ కామెంట్లు పెడుతున్నారు..

  దేవతల మీద కాదు

  దేవతల మీద కాదు

  అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ కావడంతో ఈ విషయం మీద రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అయితే ఈ వీడియోలో ఎడమవైపు ఉన్నది నేను కాదు కుడి వైపు ఉన్నది అషు రెడ్డి కాదు. #AriyanaBoldRgv తరహాలోనే #AshuBoldRgv అనే ఇంటర్వ్యూ మేం చేయలేదు. దేవుళ్ల మీద ఒట్టు. కానీ, దేవతల మీద కాదు'' అని అషూరెడ్డి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లింక్‌ను ఆయన ట్వీట్ చేశారు.

  అసలు అయినా ఆ వీడియోలో అషు మీ పేరు ఎత్తలేదని, అందులో ఉన్నది నేను కాదు అని చెప్పుకోవడం ఎందుకని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక గత నెలలో రాంగోపాల్ వర్మ చేసిన యూట్యూబ్ ఇంటర్వ్యూ పెద్ద విధ్వంసానికి దారితీసింది. అయితే ఇది తమ పర్సనల్ వ్యవహారంగా చెప్పుకుంటూ వచ్చారు రామ్ గోపాల్ వర్మ. మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని మాట్లాడుకున్న మాటలు నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు చూడరు అని కూడా క్లారిటీ ఇచ్చారు.

  హైప్ క్రియేట్ చేయడానికి ఇలా

  హైప్ క్రియేట్ చేయడానికి ఇలా

  ఇప్పుడు అదే తరహాలో రామ్ గోపాల్ వర్మ రెడ్డి తో కూడా ఈ చిట్ చాట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది, అందుకే ఇద్దరూ ఒకచోట ఉండగా రాంగోపాల్ వర్మ టీమ్ సభ్యులు ఈ వీడియో తీసి పబ్లిసిటీ కోసం ఇలా వాడుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కావాలనే ఇంటర్వ్యూ మీద హైప్ క్రియేట్ చేయడానికి ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు అనే వాదన వినిపిస్తోంది. మరి దీని వెనుక ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయనేది మాత్రం తెలియాల్సి ఉంది.

  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  అయితే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నేరుగా సినిమాలు చేయడం లేదు. ఆయన తన శిష్యుల చేత సినిమాలు చేయించి స్పార్క్ ఓటీటీలో విడుదల చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.. అలాగే ఆయన ప్రకటించిన కొన్ని సినిమాలు ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా వాటికి సంబంధించిన అప్ డేట్స్ కూడా ఇవ్వడం మానేశారు.. మరి ఆయన సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో వేచిచూడాల్సి ఉంది మరి.

  RGV's Reaction After Watched 'Akasha Veedhullo' Movie Trailer ​| Filmibeat Telug
  ఆయనతో ప్రేమలో

  ఆయనతో ప్రేమలో

  ఇక అషు రెడ్డి విషయానికి వస్తే బిగ్ బాస్ లో తనకు హౌస్ మెట్ అయిన రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమలో ఉన్నాను అని భ్రమ కల్పించే విధంగా ఆమె ఆ మధ్య కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు.. ఆమె రాహుల్ సిప్లిగంజ్ కి ముద్దు పెడుతున్న ఫోటోలు అలాగే ఇద్దరూ కాస్త ప్రైవేట్ గా క్లోజ్ గా ఉన్నట్టుగా అనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ ఇద్దరూ కొన్నాళ్లపాటు వార్తల్లో నిలిచారు కూడా.

  అయితే అసలు విషయం ఏమిటంటే ఈ భామ రాహుల్ తో ప్రేమలో లేనని కూడా క్లారిటీ ఇచ్చింది. మేము ఇద్దరం మంచి స్నేహితులం అని కూడా చెప్పు వచ్చింది. ఇక ఆమె చేస్తున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో ఆమె ఎక్స్ ప్రెస్ హరి అనే కమెడియన్ తో కాస్త క్లోజ్ గా కనిపిస్తూ ఉండటం తో వీరిద్దరి మధ్య కూడా ఏదైనా ఉందా అని ప్రచారం జరుగుతూ ఉండగా అది కేవలం షో వరకే పరిమితం అని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

  English summary
  RGV responded to Ashu Reddy video on the Twitter.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X