twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ షోపై రాంగోపాల్ వర్మ తొలిసారి స్పందన: ఆ కంటెస్టెంట్‌ను గెలిపించమంటూ ట్వీట్

    |

    తరచూ ఏదో ఒక గడవలో తల దూర్చుతూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. కెరీర్ ఆరంభంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. ఈ మధ్య సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ సినిమాలను రూపొందిస్తున్నాడు. తద్వారా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఈ మధ్య వరుస సినిమాలతె ఫుల్ బిజీగా ఉంటోన్న ఆర్జీవీ.. బిగ్ బాస్ షోపై తొలిసారి స్పందించాడు. అందులో ఓ కంటెస్టెంట్‌కు ఓట్లు వేసి గెలిపించమని కోరాడు. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? అసలెందుకు సపోర్ట్ చేస్తున్నాడు? పూర్తి వివరాలు మీకోసం!

     లాక్‌డౌన్‌లో ఆ సినిమాలతో ఫుల్ బిజీ

    లాక్‌డౌన్‌లో ఆ సినిమాలతో ఫుల్ బిజీ

    లాక్‌డౌన్ సమయంలో సినిమా షూటింగ్‌లు పూర్తిగా ఆగిపోయాయి. అయినప్పటికీ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం కొన్ని సినిమాలను తెరకెక్కించి షాకిచ్చాడు. పవన్ కల్యాణ్ జీవితం ఆధారంగా ‘పవర్ స్టార్'తో పాటు ‘నగ్నం' వంటి చిత్రాలను రూపొందించాడు. వీటి కోసం ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేసి అందులో విడుదల చేశాడు.

     డైరెక్టుగా థియేటర్‌లోనే రిలీజ్ చేస్తానని

    డైరెక్టుగా థియేటర్‌లోనే రిలీజ్ చేస్తానని

    దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన ఆధారంగా రాంగోపాల్ వర్మ ‘మర్డర్' అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విడుదలను నిలిపివేయాలని ప్రణయ్‌ తండ్రి బాలస్వామి కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ అనంతరం సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్‌ను కోర్టు ఆదేశించింది. దీంతో ఈ నెల 18న థియేటర్లలో దీన్ని రిలీజ్ చేస్తున్నారు.

     ఫినాలేకు ముందు షోపై ఆర్జీవీ స్పందన

    ఫినాలేకు ముందు షోపై ఆర్జీవీ స్పందన

    తెలుగులో తిరుగులేని చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం నాలుగో దానిని ప్రసారం చేస్తున్నారు నిర్వహకులు. మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫైనల్ జరగబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తొలిసారి బిగ్ బాస్ షోపై స్పందించారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.

     బిగ్ బాస్ అంటే ఏంటో తెలీదన్న వర్మ

    బిగ్ బాస్ అంటే ఏంటో తెలీదన్న వర్మ

    ఆ మధ్య జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లో బిగ్ బాస్ షోను ఉద్దేశించి రాంగోపాల్ వర్మ విచిత్రమైన కామెంట్స్ చేశారు. ‘బిగ్ బాస్ అంటే ఏంటి? అది షోనా లేకపోతే ఏమైనానా? హిందీలో అప్పుడెప్పుడో ఎవరో అంటే విన్నాను. ఇది తెలుగులో కూడా మొదలైందా.? అసలు దాని గురించి నాకు కొంచెం కూడా తెలీదు. నేనెప్పుడూ చూడలేదు కూడా' అంటూ షాకింగ్ రియాక్షన్స్ ఇచ్చారు.

    ఆ కంటెస్టెంట్‌ను గెలిపించమని ట్వీట్

    అసలు బిగ్ బాస్ షో అంటేనే తెలియదు అని చెప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ... అందులో కంటెస్టెంట్‌గా ఉన్న ఆరియానా గ్లోరీకి మద్దతుగా తాజాగా ఓ ట్వీట్ చేశారు. ‘అందరూ ఓట్ చేసి ఆరియానాను గెలిపించండి. ఈమె మాత్రమే బిగ్ బాస్‌లో గెలవడానికి అర్హురాలు' అంటూ అందులో పేర్కొన్నారాయన. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసేస్తుంది.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
     ఆమెను హైలైట్ చేసింది ఈ దర్శకుడే

    ఆమెను హైలైట్ చేసింది ఈ దర్శకుడే

    ఆరియానా అనే అమ్మాయి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవ్వడానికి కారణం రాంగోపాల్ వర్మనే. గతంలో ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ‘మీకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన అమ్మాయి ఎవరు' అని ఆమె ప్రశ్నించగా.. ఆయన వెంటనే ‘నువ్వే' అని రిప్లై ఇచ్చాడు. అంతేకాదు, ఈ వీడియోను స్వయంగా ఆర్జీవీనే ట్వీట్ చేయడంతో ఆరియానా ఫేమస్ అయిపోయింది.

    English summary
    Bigg Boss is the Telugu language version of the reality TV series Bigg Boss, which itself is an adaptation of the Dutch series Big Brother. It airs on Star Maa and streams on digital platform Hotstar. Season 1 was hosted by Jr NTR premiered on 16 July 2017.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X