Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బిగ్ బాస్ షోపై రాంగోపాల్ వర్మ తొలిసారి స్పందన: ఆ కంటెస్టెంట్‌ను గెలిపించమంటూ ట్వీట్
తరచూ ఏదో ఒక గడవలో తల దూర్చుతూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. కెరీర్ ఆరంభంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. ఈ మధ్య సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ సినిమాలను రూపొందిస్తున్నాడు. తద్వారా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఈ మధ్య వరుస సినిమాలతె ఫుల్ బిజీగా ఉంటోన్న ఆర్జీవీ.. బిగ్ బాస్ షోపై తొలిసారి స్పందించాడు. అందులో ఓ కంటెస్టెంట్‌కు ఓట్లు వేసి గెలిపించమని కోరాడు. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? అసలెందుకు సపోర్ట్ చేస్తున్నాడు? పూర్తి వివరాలు మీకోసం!
లాక్డౌన్లో ఆ సినిమాలతో ఫుల్ బిజీ
లాక్డౌన్ సమయంలో సినిమా షూటింగ్‌లు పూర్తిగా ఆగిపోయాయి. అయినప్పటికీ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం కొన్ని సినిమాలను తెరకెక్కించి షాకిచ్చాడు. పవన్ కల్యాణ్ జీవితం ఆధారంగా ‘పవర్ స్టార్'తో పాటు ‘నగ్నం' వంటి చిత్రాలను రూపొందించాడు. వీటి కోసం ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేసి అందులో విడుదల చేశాడు.
డైరెక్టుగా థియేటర్లోనే రిలీజ్ చేస్తానని
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన ఆధారంగా రాంగోపాల్ వర్మ ‘మర్డర్' అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విడుదలను నిలిపివేయాలని ప్రణయ్ తండ్రి బాలస్వామి కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ అనంతరం సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్‌ను కోర్టు ఆదేశించింది. దీంతో ఈ నెల 18న థియేటర్లలో దీన్ని రిలీజ్ చేస్తున్నారు.
ఫినాలేకు ముందు షోపై ఆర్జీవీ స్పందన
తెలుగులో తిరుగులేని చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం నాలుగో దానిని ప్రసారం చేస్తున్నారు నిర్వహకులు. మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫైనల్ జరగబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తొలిసారి బిగ్ బాస్ షోపై స్పందించారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.
బిగ్ బాస్ అంటే ఏంటో తెలీదన్న వర్మ
ఆ మధ్య జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లో బిగ్ బాస్ షోను ఉద్దేశించి రాంగోపాల్ వర్మ విచిత్రమైన కామెంట్స్ చేశారు. ‘బిగ్ బాస్ అంటే ఏంటి? అది షోనా లేకపోతే ఏమైనానా? హిందీలో అప్పుడెప్పుడో ఎవరో అంటే విన్నాను. ఇది తెలుగులో కూడా మొదలైందా.? అసలు దాని గురించి నాకు కొంచెం కూడా తెలీదు. నేనెప్పుడూ చూడలేదు కూడా' అంటూ షాకింగ్ రియాక్షన్స్ ఇచ్చారు.
|
ఆ కంటెస్టెంట్‌ను గెలిపించమని ట్వీట్
అసలు బిగ్ బాస్ షో అంటేనే తెలియదు అని చెప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ... అందులో కంటెస్టెంట్‌గా ఉన్న ఆరియానా గ్లోరీకి మద్దతుగా తాజాగా ఓ ట్వీట్ చేశారు. ‘అందరూ ఓట్ చేసి ఆరియానాను గెలిపించండి. ఈమె మాత్రమే బిగ్ బాస్‌లో గెలవడానికి అర్హురాలు' అంటూ అందులో పేర్కొన్నారాయన. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసేస్తుంది.
Recommended Video
ఆమెను హైలైట్ చేసింది ఈ దర్శకుడే
ఆరియానా అనే అమ్మాయి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవ్వడానికి కారణం రాంగోపాల్ వర్మనే. గతంలో ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ‘మీకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన అమ్మాయి ఎవరు' అని ఆమె ప్రశ్నించగా.. ఆయన వెంటనే ‘నువ్వే' అని రిప్లై ఇచ్చాడు. అంతేకాదు, ఈ వీడియోను స్వయంగా ఆర్జీవీనే ట్వీట్ చేయడంతో ఆరియానా ఫేమస్ అయిపోయింది.